ఇన్ఫీకి రూ.8వేల కోట్లు లాస్‌! | Infosys Market Value Erodes By Rs 8000 Crore As Share Prices Tank | Sakshi
Sakshi News home page

ఇన్ఫీకి రూ.8వేల కోట్లు లాస్‌!

Published Mon, Apr 16 2018 7:09 PM | Last Updated on Mon, Apr 16 2018 7:09 PM

Infosys Market Value Erodes By Rs 8000 Crore As Share Prices Tank - Sakshi

టెక్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌ ఇవాల్టి మార్కెట్‌లో భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను ఈబీఐటీ మార్జిన్‌ గైడెన్స్‌ తగ్గించడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ దెబ్బతింది. దీంతో ఆ కంపెనీ షేర్లు 3 శాతం మేర నష్టల్లో ముగిశాయి. ఈ నష్టాల దెబ్బకి కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ కూడా రూ.8000 కోట్ల మేర తుడిచిపెట్టుకుపోయింది. ఇంట్రాడేలో కంపెనీ స్టాక్‌ 5.98 శాతం మేర కిందకి పడిపోయి రూ.1,099ను తాకింది. ట్రేడింగ్‌ సెషన్‌ ముగిసే నాటికి కంపెనీ షేరు 3.10 శాతం నష్టంలో రూ.1,132.80గా నమోదైంది. 

ఎన్‌ఎస్‌ఈలో ఇంట్రాడేలో రూ.1,102 కనిష్ట స్థాయిని తాకి, చివరి రూ.1,134.50 వద్ద స్థిరపడింది. దీంతో మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.7,887.28 కోట్లు హరించుకుపోయి, రూ.2,47,416.46 కోట్లగా రికార్డైంది. 30-షేరు ఇండెక్స్‌లో ఈ కంపెనీనే రెండో అతిపెద్ద లూజర్‌. అంచనావేసిన దానికంటే తక్కువగా కంపెనీ తన క్వార్టర్‌ ఫలితాల్లో మార్జిన్‌ గైడెన్స్‌ను 22-24 శాతానికి తగ్గించింది. మార్జిన్‌ గైడెన్స్‌ కోత పెట్టడంతోనే కంపెనీ స్టాక్‌ ప్రతికూలంగా స్పందించిందని గ్లోబల్‌ బ్రోకరేజ్‌ నోమురా తెలిపింది. కాగ, కంపెనీ ప్రకటించిన క్వార్టర్‌ ఫలితాల్లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం రూ.3690 కోట్లగా నమోదైన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement