
దేశీయ స్టాక్ మార్కెట్‌లో బుల్ రంకేలేస్తుంది. ఫలితంగా వరుస సెషన్‌లలో భారీ లాభాల్ని మూటగట్టుకుంటుంది. మంగళవారం సాయంత్రం మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 431 పాయింట్ల లాభంతో 69296 వద్ద నిఫ్టీ 168 పాయింట్ల లాభంతో 20855 వద్ద ముగిసింది.
అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎన్‌టీపీసీ, బీపీసీఎల్, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎం అండ్ ఎం, టైటాన్ కంపెనీ, మారుతి సుజికీ షేర్లు లాభాల్లో ముగియగా.. ఎల్‌టీఐ మైండ్ ట్రీ, హెచ్‌సీఎల్ టెక్, దివీస్ ల్యాబ్స్, హెచ్‌యూఎల్, ఎథేర్ మోటార్స్, బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, విప్రో షేర్లు నష్టాల్లో ముగిశాయి.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్‌లోని బుల్ జోరుకు ఈ వారం కీలకమైన యూఎస్ జాబ్ డేటా విడుదల కంటే ముందే మదుపరులు అప్రమత్తమయ్యారు. అయినప్పటికీ దేశీయ మార్కెట్లు పాజిటీవ్‌గా ట్రేడవ‍్వడంతో తాజా గరిష్టాలను తాకింది. దీంతో పాటు దేశంలోని ఐదు రాష్ట్రాల ఎన్నికలు, సానుకూలంగా జీడీపీ, యథాతథంగా ఆర్‌బీఐ మానిటరీ పాలసీ సమావేశం వంటి అంశాలు కలిసి వచ్చాయని దేశీయ స్టాక్ మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment