ముంబై: నిధుల సంక్షోభంలో ఉన్న దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ (డీహెచ్‌ఎఫ్‌ఎల్) ఇప్పటి వరకు రూ.4,800 కోట్ల డిపాజిట్ల చెల్లింపుల క్లెయిమ్‌లను ఆమోదించినట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. సమారు 55,000 మంది డిపాజిట్ హోల్డర్లు రూ.5,200 కోట్ల డిపాజిట్లకు సంబంధించి క్లెయిమ్‌లను డిసెంబర్ 17 నాటికి దాఖలు చేయగా.. రూ.4,800 కోట్ల క్లెయిమ్‌లను అనుమతించినట్టు వెల్లడించాయి. వీరిలో రిటైలర్లతోపాటు యూపీ పవర్ కార్పొరేషన్ ఉద్యోగులు సైతం ఉన్నారు. వీటితో పాటు అన్ని రకాల క్లెయిమ్‌లు (రుణదాతలు సహా) కలపి రూ.93,105 కోట్లుగా ఉన్నట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment