
ఆర్‌బీఐ మౌనం అందుకేనా!
ఢిల్లీ: పాత నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి గడువు ఎల్లుండితో ముగుస్తోంది. అయితే ఇప్పటివరకు బ్యాంకుల్లో ఎన్ని నోట్లు డిపాజిట్ అయ్యాయి అన్న విషయంపై ఆర్‌బీఐ మౌనం పాటిస్తోంది.
డిసెంబర్ 10 వరకు డిపాజిట్ అయిన సొమ్ము 12.44 లక్షల కోట్లుగా వెల్లడించిన ఆర్బీఐ.. అనంతరం జరిగిన డిపాజిట్లపై స్పందించడం లేదు. నవంబర్ 8న రద్దయిన నోట్ల విలువ 14.2 లక్షల కోట్లు కాగా.. సుమారు 2 లక్షల కోట్ల వరకు బ్యాంకుల్లో డిపాజిట్ కాదని కేంద్రం అంచనా వేసింది. డిసెంబర్ 10 నాటికే 12 లక్షల కోట్లు డిపాజిట్ అయినందున కేంద్రం అంచనా తప్పింది. ఈ క్రమంలో రద్దయిన నోట్ల విలువ కంటే అధికంగా బ్యాంకుల్లో డిపాజిట్‌లు జరిగాయా అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ నేపథ్యంలో అంచనాలు తప్పడం మూలంగానే ఆర్‌బీఐ మౌనం పాటిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.