ట్రెండ్ రివర్స్: ఆ ఖాతాల్లోకి వెయ్యి కోట్లు | Withdrawal trend reverses in Jan Dhan accounts; deposits up Rs 1,000 cr | Sakshi
Sakshi News home page

ట్రెండ్ రివర్స్: ఆ ఖాతాల్లోకి వెయ్యి కోట్లు

Published Mon, Apr 17 2017 12:05 PM | Last Updated on Tue, Sep 5 2017 9:00 AM

ట్రెండ్ రివర్స్: ఆ ఖాతాల్లోకి వెయ్యి కోట్లు

ట్రెండ్ రివర్స్: ఆ ఖాతాల్లోకి వెయ్యి కోట్లు

జన్ధన్ అకౌంట్లలో నెలకొన్న విత్ డ్రాయల్ ట్రెండ్ రివర్స్ అయింది. ఈ ఖాతాల్లోకి దాదాపు వెయ్యి కోట్ల మేర డిపాజిట్లు వచ్చి పడి ఏప్రిల్ 5తో ముగిసిన వారానికి ఖాతాల్లో నగదు రూ.63,971.38 కోట్లగా నమోదైంది. ప్రధాన్ మంత్రి జన్ధన్ యోజన కింద ప్రారంభించబడిన ఈ అకౌంట్లలో మార్చి నెలలో నికర బ్యాలెన్స్ రూ.62,972.42 కోట్లగా ఉందని ఆర్థికమంత్రిత్వశాఖ డేటాలో వెల్లడైంది. పెద్ద నోట్ల రద్దుతో డిసెంబర్ 7 వరకు ఈ అకౌంట్లలో డిపాజిట్లు రికార్డుస్థాయిల్లో నమోదయ్యాయి. అప్పడు రూ.74,610 కోట్లు వచ్చిచేరాయి. అనంతరం జన్ధన్ ఖాతాలపై కూడా అధికారులు తనిఖీలు విస్తృతంగా జరుపగా.. డిపాజిట్లు కొంతమేర క్షీణించాయి.
 
ఈ బ్యాంకు అకౌంట్లను దుర్వినియోగానికి వాడితే, కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ప్రబుత్వం హెచ్చరించింది. ఈ అకౌంట్లలో నగదు డిపాజిట్ పరిమితిని కూడా రూ.50వేలుగానే నిర్దేశించింది.  రద్దయిన పెద్ద నోట్లను జీరో అకౌంట్ ఖాతాల్లో జమచేసి, పన్నుల నుంచి తప్పించుకుంటున్నారని విచారణ సంస్థలు గుర్తించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ హెచ్చరికలతో ఆ అకౌంట్లలో డబ్బు భారీగా విత్ డ్రా కూడా అయింది. ప్రస్తుతం విత్ డ్రాయల్ ట్రెండ్ రివర్స్ అయి, మళ్లీ డిపాజిట్లు పెరిగాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement