సాక్షి, అమరావతి: రాష్ట్రంలో డిపాజిట్లు, క్రెడిట్ పెరిగినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. గత ఐదేళ్లలో ఏపీలో డిపాజిట్ల వార్షిక సగటు వృద్ధి 9.4 శాతం ఉంటే.. అదే సమయంలో ప్రజలకు అవసరమైన క్రెడిట్ కూడా వార్షిక సగటు వృద్ధి 14.3 శాతం నమోదైనట్లు పేర్కొంది. ఐదేళ్లలో బ్యాంకుల్లో ప్రజల డిపాజిట్లు సగటు వార్షిక వృద్ధి 9.4 శాతం నమోదవ్వడం అంటే ప్రజల ఆదాయాలు పెరగడమే నిదర్శనంగా కనిపిస్తోంది.
కోవిడ్ సమయంలో కూడా రాష్ట్ర ప్రజల జీవనోపాధికి సమస్యల్లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసిన పథకాలు సత్ఫలితాలిచ్చాయనడానికి డిపాజిట్లలో వృద్ధి నిదర్శనంగా నిలుస్తోంది. ఇక నవరత్నాలు ద్వారా అర్హులైన పేదలందరి జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వారికి నేరుగా నగదు బదిలీని అమలుచేసింది. అలాగే, బ్యాంకుల ద్వారా పేదలతో పాటు రైతులకు, స్వయం సహాయక సంఘాల మహిళలకు, ఎంఎస్‌ఎంఈలతో పాటు వివిధ పథకాల కింద బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించి వారి ఆదాయాలు మెరుగుపడేలా రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా..
► ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో పాటు మహిళలకు బ్యాంకుల నుంచి రుణాలు విరివిగా లభించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలను చేపట్టింది. దీంతో గత ఐదేళ్లలో రాష్ట్రంలో వార్షిక సగటు క్రెడిట్ వృద్ధి 14.3 శాతం నమోదైంది.
► అలాగే, ఇచి్చన రుణాలను సకాలంలో చెల్లించేలా ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు, స్వయం సహాయక సంఘాలకు సున్నావడ్డీ పథకాన్ని అమలుచేస్తోంది.
► అంతేకాక.. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు లబ్ధిదారులకు పావలా వడ్డీకి రుణాలను ఇప్పిస్తోంది.
► వీధుల్లో, వాడల్లో చిరు వ్యాపారాలు చేసుకునే వారికి బ్యాంకులు ద్వారా సున్నావడ్డీకే రుణాలు ఇప్పిస్తోంది.
► ఇక వైఎస్సార్ చేయూత ద్వారా పేద మహిళలకు ప్రభుత్వం ఆరి్థక సాయం అందించడంతో పాటు బ్యాంకుల ద్వారా రుణాలను మంజూరు చేయించడమే కాకుండా వ్యాపారాలు చేసుకునేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.
► దీంతో ఈ వర్గాలన్నింటికీ బ్యాంకులు విరివిగా రుణాలను మంజూరు చేస్తున్నాయి. ఇలా రుణాలు తీసుకున్న వారు సకాలంలో వాటిని తిరిగి చెల్లిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment