నో క్యాష్‌ విత్‌ డ్రాయల్స్‌ | no cash.. no withdrayals | Sakshi
Sakshi News home page

నో క్యాష్‌ విత్‌ డ్రాయల్స్‌

Published Tue, Nov 29 2016 10:55 PM | Last Updated on Mon, Sep 4 2017 9:27 PM

నో క్యాష్‌ విత్‌ డ్రాయల్స్‌

నో క్యాష్‌ విత్‌ డ్రాయల్స్‌

బోర్డులు పెట్టిన  బ్యాంకర్లు
బ్యాంకుల్లో జమ అయింది రూ.4500 కోట్లు...జిల్లాకు వచ్చింది రూ.600 కోట్లే 
– తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు
 –ఉద్యోగులకు జీతాలు ఇవ్వడంపై అధికారులు మల్లగుల్లాలు  
కర్నూలు(అగ్రికల్చర్‌): రద్దయిన రూ. 1000, 500 నోట్లు ఇప్పటి వరకు బ్యాంకుల్లో దాదాపు రూ.4500 కోట్లు డిపాజిట్‌ అయ్యాయి. అంటే ప్రజల దగ్గర ఉన్న డబ్బు బ్యాంకులకు వెళ్లింది. తిరిగి అంతే మొత్తంలో నగదు వస్తే లావాదేవీలు అన్నీ సాఫీగా జరుగుతాయి. పెద్దనోట్లు రద్దు అయిన తర్వాత జిల్లాకు వచ్చిన కరెన్సీ  రూ.600 కోట్లు మాత్రమే.  పరిమితంగా నగదు రావడంతో ప్రతి ఒక్కరూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  సోమవారం జిల్లాకు దాదాపు 107 కోట్ల కరెన్సీ వచ్చింది. ఎస్‌బీఐకి రూ.27 కోట్లు రాగా దీనిని ఆ బ్యాంకు మాత్రమే ఉపయోగించుకుంటోంది. ఆంధ్రాబ్యాంకుకు రూ.80 కోట్లు వచ్చింది. ఈ మొత్తాన్ని 16 బ్యాంకులకు ఇవ్వాలని ఆర్‌బీఐ ఆదేశించింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ నగదు ఏ మూలకు సరిపోని పరిస్థితి. కలెక్టరేట్‌లోని ఎస్‌బీఐ ట్రెజరీ బ్రాంచీకి సోమవారం సాయంత్రం రూ.10 లక్షలు ఇచ్చారు. ఇది కేవలం 15 నిముషాల్లో అయిపోయిందంటే నగదుకు డిమాండ్‌ ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోంది. మంగళవారం యథావిధిగా నో క్యాష్, నో విత్‌ డ్రాయల్‌ అంటూ బోర్డులు పెట్టారు.  కేవలం డిపాజిట్లు మాత్రమే స్వీకరిస్తామని, నగదు లేనందున చెల్లింపులు లేవని స్పష్టంగా చెబుతున్నారు. కరెన్సీ చస్ట్‌ ఉన్న ఎస్‌బీఐ పరిస్థితే ఇలా ఉంటే మిగిలిన బ్యాంకుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఊహించవచ్చు.  
 
సిండికేట్‌ బ్యాంకులో నగదు నిల్‌....
జిల్లాలో లీడ్‌ బ్యాంకుగా సిండికేట్‌ బ్యాంకు వ్యవహరిస్తోంది. ఈ బ్యాంకుకు జిల్లాలో 46 బ్రాంచీలు ఉన్నాయి.  ఆంధ్రాబ్యాంకుకు వచ్చిన రూ.80 కోట్లు ఏఏ బ్యాంకుకు ఇవ్వాలో ఆర్‌బీఐ సూచించింది. ఇందులో సిండికేట్‌ బ్యాంకు పేరు లేకపోవడంతో  కరెన్సీ కోసం  ఆ బ్యాంకు అధికారులు  ఇబ్బందులు  పడుతున్నారు.  
 
ఉద్యోగుల జీతాల సమస్య గట్టెక్కడంపై మల్లగుల్లాలు...
న వంబరు నెల జీతం డిసెంబరు 1న ఉద్యోగుల బ్యాంకు ఖాతాలకు జమ చేయనున్నారు. అయితే ట్రెజరీ బ్రాంచీలో నగదు కొరత తీవ్రంగా ఉండటంతో ఏమి చేయాలి అనే దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఆర్‌బీఐ చెప్పిన ప్రకారం ఒకే సారి రూ.24వేలు తీసుకునే అవకాశం కల్పించాలని ఉద్యోగుల డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు జిల్లా ఉన్నతాధికారులను కోరుతున్నారు. ఉద్యోగుల జీతాల సమస్యను పరిష్కరించేందుకు జాయింట్‌ కలెక్టర్‌ హరికిరణ్‌ రంగంలోకి దిగారు. ఉద్యోగుల జీతాల కోసం ట్రెజరీ బ్రాంచికి కనీసం మూడు కోట్లు నగదు ఇచ్చే విధంగా చూడాలని జేసీ ఎల్‌డీఎం నరసింహారావును ఆదేశించారు. ఈయన ఎస్‌బీఐ కరెన్సీ చస్ట్‌ ఏజీఎంతో మాట్లాడగా ఆయన అంగీకరించినట్లు సమాచారం.  
కనీసం రూ.2 కోట్లు అవసరం: బి.కల్యాణ్‌ కుమార్‌, మేనేజర్‌. ట్రెజరీ బ్రాంచి.
డిసెంబరు1ని ఎలా గట్టెక్కాలా అనే దానిపై ఎన్‌జీఓ అసోసియేషన్‌ ప్రతినిధులతో, జిల్లా కలెక్టర్‌తో చర్చించనున్నాము. కనీసం రూ.2 కోట్లు ఇస్తే ఉద్యోగుల జీతాల చెల్లింపు సమస్యల నుంచి బయట పడవచ్చు. ఈ మేరకు మా బ్యాంకు అధికారులను కోరాము. మంగళవారం నగదు లేకపోవడంతో  నో క్యాస్‌ నో విత్‌డ్రాయల్‌ అంటూ బోర్డులు పెట్టాం. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement