హైదరాబాద్: అగ్రిగోల్డ్ బాధితులు ఆందోళన చెందొద్దని, డబ్బు ఇప్పించే బాధ్యత తమదే అని హైకోర్టు తెలిపింది. అగ్రిగోల్డ్ కేసును సోమవారం హైకోర్టులో విచారించారు. వచ్చే వారం లోగా నివేదిక ఇవ్వాలని ఈ సందర్భంగా సీఐడీని కోర్టు ఆదేశించింది.
అగ్రిగోల్డ్కు చెందిన రూ.570 కోట్ల బ్యాంక్ డిపాజిట్లను హైకోర్టు అకౌంట్కు మళ్లించాలని కోర్టు తెలిపింది. సీఐడీ సీజ్ చేసిన రెండున్నర కిలోల బంగారం, రూ. 7.40లక్షలను కూడా తమ అకౌంట్కు జమ చేయాలని కోర్టు ఉత్తర్వులు జారీచేసింది.