hi court
-
టీడీపీ నేత నారాయణను విచారించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
-
అర్థరాత్రి హైడ్రామా.. రాత్రి రాత్రే కొత్తపేట పండ్ల మార్కెట్ నేలమట్టం
సాక్షి, సిటీబ్యూరో/చైతన్యపురి: కొత్తపేట పండ్ల మార్కెట్ కాలగర్భంలో కలిసిపోయింది. 36 ఏళ్ల చరిత్ర కలిగిన మార్కెట్ రాత్రికి రాత్రే భూస్థాపితమైంది. పండ్ల మార్కెట్ స్థలంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించాలని నిర్ణయించిన సర్కారు.. 21 ఎకరాల ఈ స్థలాన్ని వైద్య, ఆరోగ్యశాఖకు బదలాయించింది. దీంతో ఈ మార్కెట్‌ను బాటసింగారం తరలించాలని నిర్ణయించిన సర్కారు ఆగమేఘాల మీద జేసీబీలతో మంగళవారం తెల్లవారేసరికి మార్కెట్‌ను కూల్చేసింది. ఈ పరిణామాలతో ఉలిక్కిపడిన కమీషన్ ఏజెంట్లు హైకోర్టును ఆశ్రయించడం, కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను సమర్పించడం.. న్యాయస్థానం కూడా ఈ వ్యవహారంలో మార్కెటింగ్ శాఖ అధికారుల తీరును తప్పుపట్టడం చకచకా జరిగిపోయాయి. ఏర్పాట్లు చేసేంతవరకు.. ► కోహెడలో పూర్తిస్థాయిలో మార్కెట్ నిర్మించేంతవరకు తాత్కాలికంగా బాటసింగారానికి కొత్తపేట పండ్ల మార్కెట్‌ను తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడ సౌకర్యాల కల్పన సరిగా లేకపోవడంతో ఈ వ్యవహారంపై కమీషన్ ఏజెంట్లు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కేసు విచారించిన న్యాయస్థానం అక్కడ పూర్తి ఏర్పాట్లు చేసేంతవరకు మార్కెట్‌ను కొత్తపేటలోనే కొనసాగించాలని స్పష్టం చేసింది. ► ఈ నేపథ్యంలో ఈ నెల 4న కొత్తపేటలో పండ్ల మార్కెట్‌ను పునఃప్రారంభించారు. మార్కెట్ తరలింపు వ్యవహారం సర్కారుకు చికాకుగా మారింది. తడవకోసారి బాటసింగారం, అక్కడి నుంచి కొత్తపేటకు తరలించడం ద్వారా క్రయవిక్రయాలపై ప్రభావం పడుతుందని భావించిన ప్రభుత్వం.. ఈ స్థలాన్ని వైద్య, ఆరోగ్య శాఖకు కేటాయించినందున ఖాళీ చేయాలని నిర్ణయించింది. ► ఈ క్రమంలోనే స్థలాన్ని స్వాధీనం చేసుకున్న వైద్య, ఆరోగ్యశాఖ షెడ్లను కూల్చివేసింది. మార్కెట్ వద్ద అర్ధరాత్రి హైడ్రామా నెలకొంది. మార్కెట్ మూసివేతకు అధికారులు రావడంతో వ్యాపారులు అడ్డుకున్నారు. దీంతో పోలీసు బందోబస్తు నడుమ మార్కెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్‌ను కూల్చివేస్తున్నారనే సమాచారంతో వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కూల్చివేతలను అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేసి వీరిని చెదరగొట్టారు. తెల్లవారేసరికి ఫ్రూట్ మార్కెట్‌ను నేలమట్టం చేశారు. ► కోర్టు ఉత్తర్వులను ధిక్కరించి మార్కెట్‌ను కూల్చివేశారని కమీషన్ ఏజెంట్లు ఆరోపిస్తు న్నారు. మార్కెటింగ్ శాఖ అధికారులు మాత్రం బాటసింగారంలోనే మార్కెట్ కోసం అన్ని రకాల సౌకర్యాలు కల్పించామని, అక్కడే పండ్ల మార్కెట్ కొనసాగుతుందని, మంగళవారం బాటసింగారంలోనే క్రయవిక్రయాలు జరిగా యని అధికారులు చెబుతుండటం గమనార్హం. ► మార్కెట్లో కూల్చివేతల విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి మల్రెడ్డి రాంరెడ్డి, లింగోజిగూడ కార్పొరేటర్ దర్పెల్లి రాజశేఖర్‌రెడ్డి, నాయకులు సురేందర్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి మార్కెట్ వ్యాపారులకు మద్దతుగా ఆందోళన చేపట్టారు. కూల్చివేతలు ఆపండి: హైకోర్టు సాక్షి, హైదరాబాద్: గడ్డిఅన్నారం ఫ్రూట్ మార్కెట్ తరలింపు ప్రక్రియకు నెల రోజుల గడువు ఇవ్వాలన్న తమ ఆదేశాలను అమలు చేయకపోవడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలకు విరుద్ధంగా మార్కెట్లో కూల్చివేతలను వెంటనే నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వ్యాపారులను మార్కెట్ ఆవరణలోకి అనుమతించాలని, తమ వస్తువులను బాటసింగారం మార్కెట్‌కు తరలించేందుకు అనుమతించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణకు వ్యవసాయ, మార్కెటింగ్ విభాగం డైరెక్టర్ లక్ష్మీబాయి, వ్యవసాయ, మార్కెటింగ్ విభాగం ముఖ్య కార్యదర్శి రఘునందన్‌రావులను హాజరుకావాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావలిలతో కూడిన ధర్మాసనం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ధర్మాసనం ఆదేశాలకు విరుద్దంగా మార్కెట్‌ను కూల్చివేస్తున్నారంటూ కమీషన్ ఏజెంట్లు దాఖలు చేసిన కోర్టుధిక్కరణ పిటిషన్‌ను ధర్మాసనం మరోసారి విచారించింది. నెల రోజుల్లో ఖాళీ చేయాలని గత నెల 8న ధర్మాసనం ఆదేశించిందని, ఈ నెల 8 వరకు గడువు ఉన్నా...వ్యాపారులను ఈ నెల 4న మాత్రమే అనుమతించారని పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది గంగయ్యనాయుడు వాదనలు వినిపించారు. మార్కెట్లోకి ప్రవేశించిన వ్యాపారులపై పోలీసులు కేసులు నమోదు చేశారని, దాదాపు 500 మంది పోలీసుల పహారా మధ్య సోమవారం అర్ధరాత్రి కూల్చివేతలు చేస్తున్నారని తెలిపారు. 106 కమిషన్ ఏజెంట్లలో 78 మంది ఇప్పటికే బాటసింగారం మార్కెట్‌కు తరలి వెళ్లిపోయారని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌కుమార్ నివేదించారు. దీంతో ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇటువంటి పరిస్థితి కల్పించడం తీవ్ర దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. -
చంద్రబాబు భూదోపిడీకి హైకోర్టు అడ్డుకట్ట
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు భూదోపిడీకి హైకోర్టు అడ్డుకట్ట వేసిందని సదావర్తి సత్రం భూముల విషయంలో న్యాయస్థానం ఇచ్చిన తీర్పును తాము స్వాగతిస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం హైకోర్టు తీర్పు వెలువడిన తరువాత ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సదావర్తి భూములను కట్టబెట్టేందుకు ఇపుడు ప్రభుత్వం ఖరారు చేసిన మొత్తం మీద అదనంగా రూ 5 కోట్లు చెల్లిస్తే భూమిని మీకే కేటాయిస్తామని హైకోర్టు తీర్పును ఇచ్చిందని ఆ మేరకు నిర్ణీత గడువు లోపుగా డబ్బు చెల్లిస్తామని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా అమరావతిలోని అమరలింగేశ్వర స్వామి వారి సదావర్తి సత్రానికి చెందిన చెన్నైలోని అతి విలువైన భూములను టీడీపీ నేతలు కారు చౌక ధరకే కొట్టేయాలని చూశారని రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు తన బినామీల ద్వారా ప్రభుత్వ, ప్రజల, దేవుడి భూములను దోచుకు తింటున్నారని ఆయన విమర్శించారు. 84 ఎకరాల భూములను రూ.22 కోట్లకే కట్టబెట్టడంతో తాము హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేశామని తెలిపారు. -
చంద్రబాబు ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలి
-
’పుంజు’కుంటున్న బరులు
కేసులకు బెదరని పందేలరాయుళ్లు హైకోర్టు ఆదేశాలను పాటించాలంటూ పోలీసుల ఫ్లెక్సీలు మూడు రోజులూ అనుమతి వస్తుందని ఆశ సాక్షి ప్రతినిధి, ఏలూరు : కోడి పందేలపై హైకోర్టు నిషేధం విధించగా.. సుప్రీం కోర్టు సమర్ధించింది. పందేలను అడ్డుకోవడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు. అయినా.. పశ్చిమ గోదావరి జిల్లాలో పందేల రాయుళ్లు వెనుకంజ వేయకుండా పందేల యుద్ధానికి సిద్ధం అవుతున్నారు. సంప్రదాయం పేరుతో కోళ్లకు కత్తులు కట్టకుండా పోటీలు నిర్వహిస్తామని చెబుతున్నారు. పండగ మూడు రోజులు అనుమతులు ఇచ్చే విషయం ప్రభుత్వం ఆలోచిస్తోందని ఇంటిలిజెన్స్ ఉన్నతాధికారి ఏబీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించిన నేపథ్యంలో పందెంరాయుళ్లు బరులు సిద్ధం చేస్తున్నారు. పందేలు పండగ ఆనవాయితీ అని.. దీన్ని అడ్డుకోవడం ఎవరి తరంకాదని నిర్వాహకులు కోడిపందేలకు ప్రసిద్ధిగాంచిన భీమవరం, పరిసర గ్రామాల్లో ఏర్పాట్లు పూర్తకావచ్చాయి. తణుకు మండలం తేతలి, వేల్పూరు గ్రామాల్లో ఇప్పటికే నిర్వాహకులు బరులు సిద్ధం చేయగా ఇరగవరం, అత్తిలి మండలాల్లో బరుల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. పెనుమంట్ర మండలం మార్టేరు, ఆలమూరు, పెనుమంట్ర, పెనుగొండ మండలం వడలి, సిద్ధాంతం, పెళ్లికూతురమ్మ చెరువు, ఆచంట మండలం ఆచంట, వల్లూరు గ్రామాలలో కోడి పందేల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. నరసాపురం పట్టణ శివారు రుస్తుంబాద, నరసాపురం మండలం వేములదీవి, లక్ష్మణేశ్వరం, సీతారామపురం, మొగల్తూరు మండలం మొగల్తూరు, కేపీ పాలెం, పేరుపాలెం, కాళీపట్నం గ్రామాల్లో అప్పటికప్పుడు పందేలు వేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. భీమవరం ప్రకృతి ఆశ్రమం, ఐ.భీమవరం, వెంప ఖరీదైన పందేలకు పెట్టింది పేరు. ఇక్కడి పోటీలు తిలకించేందుకు సినీ స్టార్లు, రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి రాజకీయ ప్రముఖులు వస్తుంటారు. ఈ మూడు ప్రాంతాల్లో ఇంకా సన్నాహాలు ప్రారంభం కాకపోయినా చివరి మూడు రోజులు ఎట్టిపరిస్థితుల్లో నిర్వహిస్తామని పందెం కాసి మరీ చెబుతున్నారు. మెట్టలో ముఖ్యంగా చింతలపూడి మండలం పోతునూరు, సీతానగరం, జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం, లక్కవరం, పంగిడిగూడెం, కామవరపుకోట మండలం కళ్లచెర్వు, రావికంపాడు, సాగిపాడు, కామవరపుకోట, లింగపాలెం మండలంలో ములగలంపాడు, కొణిజర్ల, కలరాయనగూడెం గ్రామాల్లో ఏటా భారీ పందాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా ములగలంపాడు, కళ్లచెర్వు గ్రామాల్లో ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేసి మరీ డే అండ్ నైట్ పందేలు నిర్వహిస్తారు. కోసాట, పేకాట, గుండాటవంటి జూదాలను కూడా యథేచ్ఛగా నిర్వహిస్తారు. కొవ్వూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు ప్రాంతాల్లోనూ పందేలకు ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. ఎక్కడికక్కడ పోలీస్ పికెట్లు పందేలా రాయుళ్లు బరులు సిద్ధం చేస్తుంటే జిల్లా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకునే ఏర్పాట్లు చేస్తున్నారు. పందేలు జరిగే ప్రాంతాల్లో పోలీస్పికెట్లను పెంచి జూదరులను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కోళ్లకు కత్తులు కట్టేవారు, గతంలో కోడిపందేల కేసులు ఉన్న వారిపై నిఘా నిఘా ఉంచి బైండోవర్ కేసులు పెడుతున్నారు. బరులు సిద్దం చేసిన చోట హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం కోడి పందేలు నిర్వహించరాదని, బరుల కోసం స్థలం ఇచ్చిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తామంటూ హెచ్చరికలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఏటా చివరి నిముషంలో.. ఏటా పందేలకు అనుమతుల విషయంలో చివరి వరకూ టెన్షన్ తప్పదు. భోగి రోజు ఉదయం 9 గంటల తర్వాత అనుమతి వస్తుంది. ఏటా 3 రోజులకు మాత్రమే అనధికార అనుమతులు ఉంటాయి. పెద్దనోట్లు రద్దు ప్రభావం కోడిపందేలపై పెద్దగా ప్రభావం చూపదని భావిస్తున్నారు. ఆన్లైన్ లావాదేవీల వైపు పందెంరాయుళ్లు మొగ్గు చూపడం లేదు. వారంతా ఇప్పటికే నోట్లు సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. -
షరతులు వర్తిస్తాయ్
కోడి పందేలపై హైకోర్టు ఆదేశాలను సమర్థించిన సుప్రీం కోర్టు కోళ్లను స్వాధీనం చేసుకోవద్దని.. ఎక్కడబడితే అక్కడ దాడులు చేయొద్దని ఆదేశాలు కోర్టు ఆదేశాలు అమలు చేస్తాం : ఎస్పీ భాస్కర్ భూషణ్ సాక్షి ప్రతినిధి, ఏలూరు : కోడి పందేలను నిరోధించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్థిస్తూ ఉత్తర్వులు వెలువరించింది. అయితే, కోళ్లను స్వాధీనం చేసుకోవద్దని.. ఎక్కడబడితే అక్కడ దాడులు చేయొద్దని ఆదేశించింది. ఇలాంటి మినహాయింపులను అడ్డం పెట్టుకుని సంక్రాంతి రోజుల్లో పందేలు వేసేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పందేల సందర్భంగా కోళ్లకు కట్టే కత్తులను స్వాధీనం చేసుకోవచ్చని చెప్పిన సుప్రీం కోర్టు పందెం కోళ్లను మాత్రం స్వాధీనం చేసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. పోలీసులు దీని కోసం ఎక్కడబడితే అక్కడ దాడులు చేయకూడదని, ఈ పందేలకు గుర్తింపు ఉన్న ప్రాంతాల్లో మాత్రమే తనిఖీలు చేయాలని ఉత్తర్వులు ఇచ్చింది. కోడి పందేలను నిరోధించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. ఆ ఉత్తర్వులపై స్టే విధించాలని కోరుతూ జిల్లాకు చెందిన నేతలు సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. పిటీషన్‌ను స్వీకరించిన కోర్టు పైవిధంగా ఉత్తర్వులిస్తూ.. కేసు విచారణను నెల రోజులపాటు వాయిదా వేసింది. ఆచితూచి అడుగులు హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కోడి పందేలు నిర్వహించే వారితోపాటు కోళ్లకు కత్తులు కట్టేవారిపై పోలీసులు బైండోవర్ కేసులు పెడుతూ వచ్చారు. గతంలో పందేలపై దాడులు చేసినపుడు కోళ్లను కూడా స్వాధీనం చేసుకునేవారు. తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల్లో కోళ్లను స్వాధీనం చేసుకోవద్దని స్పష్టం చేసింది. కోర్టు ఆంక్షల నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై పోలీసులు కసరత్తు చేస్తున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలను పరిశీలిస్తున్నామని, దానికి అనుగుణంగా చర్యలు చేపడతామని జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ ’సాక్షి’కి తెలిపారు. మరోవైపు కోర్టు ఆదేశాలు ఎలా ఉన్నా సంప్రదాయం పేరుతో కోడిపందేలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కోడి పందేలకు అనుమతి ఇవ్వకపోయినా, కోర్టులు అక్షింతలు వేసినా ప్రభుత్వ పెద్దలు మాత్రం ఆఖరి నిముషంలో ఇచ్చే ఆదేశాలతో జిల్లాలో ఏటా కోడిపందేలు నిరాంటంకంగా సాగిపోతున్నాయి. బరుల వద్దే గుండాట, పేకాట, కోతాట వంటి జూదాలకు కూడా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. బరుల ఏర్పాటు అధికార పార్టీ నేతలే చేస్తుండటంతో సంక్రాంతి మూడు రోజులైనా అనుమతి వస్తుందన్న ఆశతో పందేల రాయుళ్లు ఉన్నారు. మరోవైపు హైకోర్టు ఆదేశాల మేరకు కోడిపందేలపై దాడుల కోసం జాయింట్ యాక్షన్ టీమ్‌ల ఏర్పాటుకు శనివారం చివరి రోజు కావడంతో ఆ దిశగా జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. -
'అలా వసూలు చేస్తుంటే ఏం చేస్తున్నారు?'
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పలు రకాల ట్యాక్సీలు ఇబ్బడి ముబ్బడిగా ఛార్జీలను వసూలు చేస్తుంటే ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉబర్, వోలా వంటి ట్యాక్సీలు ఇష్టం వచ్చినట్లు ఛార్జీలు వసూలు చేస్తుంటే అలా చేయకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వివరాలు అందజేయాలంటూ నోటీసుల్లో పేర్కొంటూ విచారణ ఈ నెల 25కు వాయిదా వేసింది. -
బీఆర్ఎస్ ప్రక్రియకు హైకోర్టు బ్రేకులు
-
అగ్రిగోల్డ్ డబ్బులు ఇప్పించే బాధ్యత మాదే
-
అగ్రిగోల్డ్ డబ్బులు ఇప్పించే బాధ్యత మాదే: హైకోర్టు
హైదరాబాద్: అగ్రిగోల్డ్ బాధితులు ఆందోళన చెందొద్దని, డబ్బు ఇప్పించే బాధ్యత తమదే అని హైకోర్టు తెలిపింది. అగ్రిగోల్డ్ కేసును సోమవారం హైకోర్టులో విచారించారు. వచ్చే వారం లోగా నివేదిక ఇవ్వాలని ఈ సందర్భంగా సీఐడీని కోర్టు ఆదేశించింది. అగ్రిగోల్డ్‌కు చెందిన రూ.570 కోట్ల బ్యాంక్ డిపాజిట్లను హైకోర్టు అకౌంట్‌కు మళ్లించాలని కోర్టు తెలిపింది. సీఐడీ సీజ్ చేసిన రెండున్నర కిలోల బంగారం, రూ. 7.40లక్షలను కూడా తమ అకౌంట్‌కు జమ చేయాలని కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. -
'వారిని తీవ్రంగా హింసించి చంపారు'
హైదరాబాద్: వరంగల్ జిల్లా తాడ్వాయి ఎన్ కౌంటర్లో చనిపోయిన మావోయిస్టులను అంతకుముందు బలగాలు తీవ్రంగా హింసించారని పిటిషనర్ తరుపు వాదనలు వినిపించారు. ఈ ఎన్ కౌంటర్‌పై సీబీఐతో విచారణ జరిపించాలని కోర్టును కోరారు. దీంతో ఈ ఎన్ కౌంటర్‌పై పోస్టుమార్టం నివేదికను సీల్డ్ కవర్లో సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. రెండు వారాల్లోగా ఈ ఎన్ కౌంటర్‌పై వివరాలు సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం రెండు వారాలకు ఈ కేసు విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఈ నెల 15న వరంగల్ జిల్లాలోని గోవిందరావుపేట-తాడ్వాయి అడవుల్లో ఉదయం 6.30 గంటల సమయంలో ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్ కౌంటర్ లో అదే జిల్లాకు చెందిన తంగెళ్ల శ్రుతి (23) అలియాస్ మహిత, మణికంటి విద్యాసాగర్‌రెడ్డి(27) అలియాస్ సాగర్ చనిపోయారు. -
'ఇసుక మాఫియాను తేల్చేయండి'
హైదరాబాద్: మహబూబ్ నగర్లో అక్రమ ఇసుక మాఫియా విషయంలో ఇప్పటి వరకు ఎంతమందిపై చర్యలు తీసుకున్నారని హైకోర్టు ప్రశ్నించింది. దీనివెనుక ఎవరెవరున్నారో మొత్తం వివరాలు తేల్చాలంటూ జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది. మహబూబ్ నగర్లో ఇసుక మాఫియాపై సోమవారం విచారణ చేపట్టిన హైకోర్టు దీనిపై వివరాలు తేల్చాలంటూ పోలీసులను ప్రశ్నించగా.. పన్నెండుమందిపై కేసులు పెట్టామని వారిలో నలుగురిని అరెస్టు చేశామని చెప్పారు. దీంతో మొత్తం వివరాలు తెలియజేయాలని పేర్కొంటూ కేసును రెండు వారాలకు వాయిదా వేసింది. -
ఏప్రిల్ 15వరకు బీబీసీ డాక్యుమెంటరీపై నిషేధం
న్యూఢిల్లీ: ఢిల్లీలో పారామెడికల్ విద్యార్థినిపై లైంగికదాడి నేపథ్యంలో బీబీసీ రూపొందించిన వివాదాస్పద డాక్యుమెంటరీ ఇండియా డాటర్‌పై విధించిన నిషేధాన్ని ఏప్రిల్ 15 వరకు ఢిల్లీ హైకోర్టు పొడిగించింది. ఆలోగా దీనికి సంబంధించిన పత్రాలను తమ ముందు ఉంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇండియా డాటర్‌పై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలంటూ రెండు పిల్లు దాఖలైన నేపథ్యంలో వాటిని పరిశీలించిన జస్టిస్ జీ రోహిణి, జస్టిస్ ఆర్ ఎండ్లా ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. ఇండియా డాటర్ను ఇండియాలో ప్రదర్శించకుండా ఉండేలా నిషేధం విధించాలని కేంద్రం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. -
న్యాయవాదుల మధ్య ఘర్షణ, హైకోర్టు వద్ద తీవ్ర ఉద్రిక్తత