హైదరాబాద్: వరంగల్ జిల్లా తాడ్వాయి ఎన్ కౌంటర్లో చనిపోయిన మావోయిస్టులను అంతకుముందు బలగాలు తీవ్రంగా హింసించారని పిటిషనర్ తరుపు వాదనలు వినిపించారు. ఈ ఎన్ కౌంటర్పై సీబీఐతో విచారణ జరిపించాలని కోర్టును కోరారు. దీంతో ఈ ఎన్ కౌంటర్పై పోస్టుమార్టం నివేదికను సీల్డ్ కవర్లో సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. రెండు వారాల్లోగా ఈ ఎన్ కౌంటర్పై వివరాలు సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం రెండు వారాలకు ఈ కేసు విచారణను హైకోర్టు వాయిదా వేసింది.
ఈ నెల 15న వరంగల్ జిల్లాలోని గోవిందరావుపేట-తాడ్వాయి అడవుల్లో ఉదయం 6.30 గంటల సమయంలో ఎన్‌కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్ కౌంటర్ లో అదే జిల్లాకు చెందిన తంగెళ్ల శ్రుతి (23) అలియాస్ మహిత, మణికంటి విద్యాసాగర్‌రెడ్డి(27) అలియాస్ సాగర్ చనిపోయారు.
'వారిని తీవ్రంగా హింసించి చంపారు'
Published Tue, Sep 29 2015 12:31 PM | Last Updated on Sat, Aug 11 2018 4:59 PM
Advertisement
Advertisement