సదావర్తి భూములపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. హైకోర్టు తీర్పు ప్రకారం తాము డబ్బులు కడతామని ఆయన స్పష్టం చేశారు. తక్కువ ధరకే టీడీపీ నేతలు కోట్లాది రూపాయల భూమిని కొట్టేయాలని కుట్రలు చేశారని, దానికి చంద్రబాబు నాయుడు సహకరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. పెద్ద మొత్తం విలువ చేసే సదావర్తి సత్రం భూములను అతి తక్కువ రేట్లకే చంద్రబాబునాయుడు తమ పార్టీ నేతలకు కట్టబెట్టే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే.