న్యూఢిల్లీ: ఢిల్లీలో పారామెడికల్ విద్యార్థినిపై లైంగికదాడి నేపథ్యంలో బీబీసీ రూపొందించిన వివాదాస్పద డాక్యుమెంటరీ ఇండియా డాటర్పై విధించిన నిషేధాన్ని ఏప్రిల్ 15 వరకు ఢిల్లీ హైకోర్టు పొడిగించింది.
న్యూఢిల్లీ: ఢిల్లీలో పారామెడికల్ విద్యార్థినిపై లైంగికదాడి నేపథ్యంలో బీబీసీ రూపొందించిన వివాదాస్పద డాక్యుమెంటరీ ఇండియా డాటర్పై విధించిన నిషేధాన్ని ఏప్రిల్ 15 వరకు ఢిల్లీ హైకోర్టు పొడిగించింది. ఆలోగా దీనికి సంబంధించిన పత్రాలను తమ ముందు ఉంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇండియా డాటర్పై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలంటూ రెండు పిల్లు దాఖలైన నేపథ్యంలో వాటిని పరిశీలించిన జస్టిస్ జీ రోహిణి, జస్టిస్ ఆర్ ఎండ్లా ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. ఇండియా డాటర్ను ఇండియాలో ప్రదర్శించకుండా ఉండేలా నిషేధం విధించాలని కేంద్రం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.