BBC documentary
-
యాదృచ్ఛికంగా తీసిన డాక్యుమెంటరీ కాదు!: జై శంకర్
ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ తీసిన డాక్యుమెంటరీ పెను దూమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ డాక్యుమెంటరికి సంబంధించిన యూట్యూబ్, సోషల్ మీడియా లింక్‌లను తొలగించాలని బీబీసిని కేంద్ర ఆదేశించింది కూడా. ఆ తర్వాత కొద్ది రోజులకే బీబీసీ కార్యాలయాలపై ఐటీ దాడులు కూడా జరిగాయి. కానీ ఇది ఐటీ దాడులు కాదని పన్నుల లావాదేవీల్లోని అవతవకలపై సర్వేగా ఐటీ శాఖ పేర్కొంది కూడా. ఐతే వీటిపై ప్రతిపక్షాలు అధికార పార్టీ ఐటీ దాడులతో నిజాలను నొక్కేస్తుందంటూ దుమ్మెత్తిపోశాయి. ఈ విషయంపై విదేశాంగ మంత్రి మాట్లాడుతూ..మోదీ ప్రభుత్వం విదేశీ మీడియా ప్రచురించిన కథనాన్ని ఖండించినందున ఇది రాజకీయం అంటూ పిలుస్తున్నారు. అయినా ఇంత అకస్మాత్తుగా అభిప్రాయాలు, డాక్యుమెంటరీలు అంటూ ఎందుకు వచ్చాయి. 2024 జాతీయ ఎన్నికలకు ఒక సంత్సరం ముందు ఈ డాక్యుమెంటరీ బయటకు వచ్చింది. దీన్ని జై శంకర్ అందరీ దృష్టిని మరల్చేలా మోదీ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నంగా అభివర్ణించారు. వాస్తవానికి బీబీసీ ఐటీ నిబంనల ప్రకారం అత్యవసర అధికారాలను ఉపయోగించి మరీ ఈ డాక్యుమెంటరీని తీసిందన్నారు. 1984లో ఢిల్లీలో చాలా విషయాలు జరిగాయి కదా మరీ వాటి గురించి ఎందుకు డాక్యుమెంటరీ తీయలేదని ప్రశ్నించారు. ఇది అనుకోకుండా యాదృచ్ఛికంగా తీసిన డాక్యుమెంటరీ కాదని నొక్కి చెప్పారు. భారత్‌లో ఎన్నికల సీజన్ ప్రారంభమయ్యే నాటికి కావలనే బీబీసీ ఈ డాక్యుమెంటరీని విడుదల చేసింది. అదే లండన్, న్యూజిలాండ్ ఎన్నికల సమయంలో ఇలా చేస్తుందా? అని నిలదీశారు. 2002 గుజరాత్ అల్లర్ల విషయంలో అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీపై వచ్చిన ఆరోపణలను సుప్రీం కోర్టు కొట్టేసిందనే విషయాన్ని గుర్తు చేశారు. కొన్ని సార్లు ఇలాంటి బురద రాజకీయాలు భారతదేశ సరిహద్దుల నుంచి కాకుండా బయట నుంచి కూడా వస్తున్నాయన్నారు. భారత్‌పై తీవ్రవాద చిత్రాన్ని ముద్ర వేయడం అనేది కేవలం బీజేపీనే లేక ప్రధాని మోదీని ఉద్దేశించో జరగడం లేదని, గత కొంతకాలంగా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయని జైశంకర్ అన్నారు. ఈ కథనాల వెనుక ఉద్దేశ్యం విదేశాల్లో భారతదేశ వ్యతిరేక ఎజెండాను తీసుకెళ్లేడమేనని అన్నారు. "మేము ఒక డాక్యుమెంటరీ లేదా యూరోపియన్ నగరంలో చేసిన ప్రసంగం గురించో మాట్లాడటం లేదు. దీని గురించి చర్చిస్తున్నాం. పైగా ఇక్కడి రాజకీయాలను మీడియా ప్రత్యక్షంగా నిర్వహిస్తుంది కూడా. తెర వెనుక చేస్తున్న రాజకీయాలు చేస్తున్నావారికి నిజంగా రాజకీయాల్లోకి వచ్చే ధైర్యం లేని వాళ్లే చేసే పనులే ఇవి. ఈ కథనం వెనుక ఉన్న వారెవరో రాజకీయాల్లోకి రావాలని సవాలు విసిరారు. పైగా మీడియా, ఎన్జీవో అనే పేరుతో ఈ డాక్యుమెంటరీ కథనాలతో రాజకీయాల చేయరని మండిపడ్డారు". జైశంకర్. (చదవండి: ఇందిరాగాంధీ నా తండ్రిని ఆ పదవి నుంచి తొలగించారు: జై శంకర్) -
మూడో రోజూ ఐటీ సోదాలు.. 2 రాత్రులుగా ఆఫీసులోనే బీబీసీ ఉద్యోగులు
బ్రిటీష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్(బీబీసీ) ఇండియా కార్యాలయాలపై మూడో రోజు ఐటీ సోదాలు కొనసాగాయి. సర్వే ఆపరేషన్ పేరుతో ఐటీ అధికారులు చేపట్టిన దాడుల కారణంగా ఢిల్లీలోని బీబీసీలో పనిచేసే దాదాపు 10 మంది సీనియర్లు ఉద్యోగులు రెండు రోజుల నుంచి ఆఫీస్‌లోనే ఉంటున్నారు. ఆదాయపు పన్ను శాఖ సర్వే ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంటికి వెళ్లలేదు. బీబీసీ కార్యాలయ ఉద్యోగుల నుంచి ఐటీ అధికారులు తమకు కావల్సిన ఆర్ధిక లావాదేవీల సమాచారాన్ని, డాక్యుమెంట్లు, మెయిల్స్, ఇతర వివరాల్ని సేకరించారు. కాగా 2002 గుజరాత్ జరిగిన అల్లర్లకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ ఇటీవల ఓ డాక్యుమెంటరీ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇండియా ది మోదీ క్వశ్చన్ పేరుతో రిలీజ్ అయిన ఈ డాక్యుమెంటరీ దేశ వ్యాప్తంగా వివాదస్పదమైంది. దీనిని భారత్‌లో ప్రసారం చేయనీయకుండా కేంద్రం బ్యాన్ చేసింది. సోషల్ మీడియా మాధ్యమాలైన యూట్యూబ్, ట్విటర్ వంటి వాటిల్లో సంబంధిత లింక్‌లను తొలగించింది. ఇది జరిగిన రెండు వారాల్లోనే ఈ ఐటీ దాడులు ప్రారంభమవడం గమనార్హం. ఐటీ దాడుల నేపథ్యంలో ఢిల్లీలోని బీబీసీ సిబ్బంది ఒకరు మాట్లాడుతూ.. ఐటీ సోదాలు జరుగుతున్న కూడా తాము వార్తలను ఎప్పటిలాగే ప్రసారం చేస్తున్నామని తెలిపారు. అయితే చాలా మంది ఉద్యోగులు ఇళ్ల నుంచి పని చేస్తున్నారని పేర్కొన్నారు. కాగా పన్నుల ఎగవేత ఆరోపణలపై ఢిల్లీ, ముంబైలోని బీబీసీ కార్యాలయాల్లో మంగళవారం ఉదయం 11:30 గంటలకు ప్రారంభమైన ఐటీ సోదాలు 44 గంటలు గడిచినా ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ దాడులు మరికొంత కాలం పాటు కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. ఈ ఆపరేషన్ ఎప్పుడు పూర్తవుతుందనేది చెప్పలేమని.. తమకు లభించే ఆధారాల్ని బట్టి ఉంటుందని పేర్కొన్నారు. ఆర్థిక లావాదేవీలు, కంపెనీ నిర్మాణం, ఇతర వివరాలపై ఐటీ సర్వే బృందాలు సమాధానాలు రాబడుతున్నాయి. సాక్ష్యాలను సేకరించే పనిలో భాగంగా ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి డేటాను కాపీ చేస్తున్నాయని ఐటీ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా రాజకీయ ప్రతికారంతోనే బీబీసీ కార్యాలయాలపై కేంద్రం ఐటీ దాడులు జరిపిస్తోందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇక వివాదాస్పద డాక్యుమెంటరీ నేపథ్యంలో భారతదేశంలో బీబీసీపై పూర్తి నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గత వారం కొట్టివేసిన విషయం తెలిసిందే. అలాగే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో డాక్యుమెంటరీ లింక్‌లను బ్లాక్ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన మరో పిటిషన్‌పై ఏప్రిల్‌లో విచారణ జరగనుంది. చదవండి: హిండెన్‌బర్గ్ ఆరోపణలు.. ‘అదానీ’పై మరో కేసు -
బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సోదాలపై అమెరికా కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్: ఢిల్లీ, ముంబైలోని బీబీసీ కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రధానీ మోదీపై బీబీసీ వివాదాస్పద డాక్యుమెంటరీ రూపొందించిన తర్వాత ఈ తనిఖీలు చేపట్టడం చర్చనీయాంశమైంది. విపక్షాలు ఇప్పటికే కేంద్రంపై విమర్శలు గుప్పించాయి. తాజాగా అగ్రరాజ్యం అమెరికా ఈ వ్యవహారంపై స్పందించింది. బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరిగిన విషయం తమ దృష్టికి వచ్చిందని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా పత్రిక స్వేచ్ఛకు ప్రాధాన్యం ఉండాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు భావ ప్రకటనా స్వేచ్చ, మతం లేదా విశ్వాసపరమైన స్వేచ్చ మానవహక్కులుగా దోహదపడుతాయన్నారు. భారత్‌లో ప్రజాస్వామ్యాన్ని కూడా ఇవే బలోపేతం చేశాయని చెప్పారు. ఈ విషయాలను తాము ఎప్పుడు హైలైట్ చేస్తూనే ఉన్నామని వివరించారు. ఈ సార్వత్రిక హక్కులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్యాలకు పునాది అని నొక్కి చెప్పారు. అయితే బీబీసీపై ఐటీ దాడులు ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకమా ? అని అడిగిన ప్రశ్నకు నెడ్ ప్రైస్ ఆచితూచి సమాధానమిచ్చారు. ఈ సోదాలపై నిజానిజాల గురించి తమకు తెలుసునని, అయితే దీనిపై తీర్పు చెప్పే స్థితిలో తాను లేనని వ్యాఖ్యానించారు. చదవండి: ‘లేఆఫ్స్’ తాత్కాలికమే.. అమెరికాలో భారీగా ఉద్యోగాలు..! -
IT Raids on BBC: బీబీసీపై ఐటీ సర్వే
న్యూఢిల్లీ: బీబీసీ–మోదీ డాక్యుమెంటరీ వివాదం కొత్త మలుపు తిరిగింది. పన్ను ఎగవేత ఆరోపణలపై దర్యాప్తులో భాగంగా ఢిల్లీ, ముంబైల్లోని బీబీసీ కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖ మంగళవారం ‘సర్వే’ జరిపింది! ఇవి దాడులు కావని, బీబీసీ సబ్సిడరీ కంపెనీలకు చెందిన అంతర్జాతీయ పన్ను విధానాలు తదితరాలకు సంబంధించిన సర్వే మాత్రమేనని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ‘‘ఈ అవకతవకలపై బీబీసీకి గతంలోనే నోటీసులిచ్చినా బేఖాతరు చేసింది. పైగా భారీగా లాభాలను దారి మళ్లించింది’’ అని ఆరోపించాయి. ఐటీ అధికారులు ఉదయం 11 గంటల సమయంలో ఢిల్లీలో కస్తూర్బా గాంధీ మార్గ్, ముంబైలోని శాంతాక్రుజ్ ప్రాంతంలో ఉన్న బీబీసీ కార్యాలయాలకు చేరుకున్నారు. సర్వే పూర్తయ్యేదాకా బీబీసీ సిబ్బందిని కార్యాలయ ఆవరణ వీడేందుకు అనుమతించలేదు. వారినుంచి సెల్ ఫోన్లు, లాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. అధికారులకు పూర్తిగా సహకరిస్తున్నట్టు అనంతరం బీబీసీ ట్వీట్ చేసింది. గుజరాత్లో గోద్రా అనంతర అల్లర్లకు అప్పట్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న మోదీయే నేరుగా బాధ్యుడంటూ జనవరిలో బీబీసీ విడుదల చేసిన డాక్యుమెంటరీ పెను వివాదానికి దారి తీయడం, దాన్ని కేంద్రం నిషేధించడం తెలిసిందే. మండిపడ్డ విపక్షాలు బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సర్వేలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. మోదీ ప్రభుత్వం నిత్యం పత్రికా స్వేచ్ఛపై దాడి చేస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దుయ్యబట్టారు. ఇది కచ్చితంగా బెదిరింపు చర్యేనని పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ అన్నారు. వినాశకాలం దాపురించినప్పుడు ఇలాంటి విపరీత బుద్ధులే పుడతాయంటూ ధ్వజమెత్తారు. కేంద్రం తీరు నియంతృత్వానికి పరాకాష్ట అని సీపీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ దుయ్యబట్టాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలు ‘ప్రేమికుల రోజు సర్వే’లకు దిగాయంటూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా ఎద్దేవా చేశారు. ‘‘ఇదే ఊపులో ఐటీ, సెబీ, ఈడీ తదితరాలన్నీ కలసి కేంద్రానికి అత్యంత ప్రియుడైన మిస్టర్ ఎ సంస్థలపైనా ఇలాంటి సర్వేలు చేస్తే ఎలా ఉంటుంది!’’ అని అదానీని ఉద్దేశించి ట్వీట్ చేశారు. బీబీసీ ఆఫీసుల్లో ఐటీ సర్వేలతో తీవ్రంగా ఆందోళన చెందుతున్నట్టు ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా పేర్కొంది. పాలక వర్గం పట్ల విమర్శనాత్మకంగా ఉండే మీడియా సంస్థలను వేధించే ధోరణికి ఇది కొనసాగింపని ఒక ప్రకటనలో విమర్శించింది. నిశితంగా గమనిస్తున్నాం: బ్రిటన్ తాజా పరిణామాలు బ్రిటన్‌లోనూ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ సర్వేకు బీబీసీ డాక్యుమెంటరీతో సంబంధముందన్న భావన బ్రిటన్ ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అధికారికంగా స్పందించకపోయినా, పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్టు అవి పేర్కొన్నాయి. ఇవి కచ్చితంగా కక్షసాధింపు ధోరణితో కూడిన వేధింపు చర్యలేనని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లీడింగ్ ఆథర్ డాక్టర్ ముకులికా బెనర్జీతో పాటు బ్రిటన్‌కు చెందిన మానవ హక్కుల సంస్థ సౌత్ ఏషియా సాలిడారిటీ గ్రూప్ కూడా విమర్శించింది. వీటిని తక్షణం ఆపాలని డిమాండ్ చేసింది. అయితే, వార్తా సంస్థ ముసుగులో సామ్రాజ్యవాదులతో చేతులు కలిపిన బీబీసీ భారత్‌లో కచ్చితంగా ఆర్థిక అవకతవకలకు పాల్పడిందని గ్లోబల్ హిందూ ఫెడరేషన్ చైర్పర్సన్ సతీశ్ శర్మ ఆరోపించారు. కాంగ్రెస్ రియాక్షన్.. బీబీసీ కార్యాలయంలో ఐటీ సోదాలపై కాంగ్రెస్ స్పందించింది. అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెటంరీ కమిటీ(జేపీసీ) వేయాలని తాము డిమాండ్ చేస్తుంటే కేంద్రం మాత్రం బీబీసీ వెనకాల పడుతోందని విమర్శలు గుప్పించింది. ఈ మేరకు సీనియర్ నేత జైరాం రమేశ్ వీడియోను కాంగ్రెస్ ట్విట్టర్లో షేర్ చేసింది. यहां हम अडानी के मामले में JPC की मांग कर रहे हैं और वहां सरकार BBC के पीछे पड़ी हुई है। 'विनाशकाले विपरीत बुद्धि' : @Jairam_Ramesh जी pic.twitter.com/PvQ57tMTVP — Congress (@INCIndia) February 14, 2023 చదవండి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి పోటీయే లేదు: అమిత్ షా -
మోదీ డాక్యుమెంటరీ వివాదం.. బీబీసీ బ్యాన్‌కు నో చెప్పిన సుప్రీంకోర్టు
సాక్షి, ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ ప్రసారం చేసిన ఓ డాక్యుమెంటరీ రాజకీయం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. కేంద్రం ఆ డాక్యుమెంటరీని, దానికి సంబంధించిన లింకులను భారత్‌లో బ్లాక్ చేసింది. దీంతో, ఈ వ్యవహరం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. తాజాగా పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అదే సమయంలో భారత్‌లో బీబీసీ ఛానల్ ప్రసారం కాకుండా బ్యాన్ చేయాలని వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. కాగా, ఇండియా ద మోదీ క్వశ్చన్ పేరిట బీబీసీ డాక్యుమెంటరీని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక, గుజరాత్ అల్లర్లతో పాటు ప్రధాని మోదీకి సంబంధించిన ఈ డాక్యుమెంటరీ తప్పుదోవ పట్టిస్తోందంటూ కేంద్రం బ్యాన్ విధించింది. సోషల్ మీడియాలోనూ ఎక్కడా ఈ వీడియో క్లిప్‌లు కనిపించకుండా సెన్సార్ విధించింది. ఈ క్రమంలోనే హిందూ సేన అసలు బీబీసీ ఛానల్నే సెన్సార్ చేయాలంటూ సుప్రీం కోర్టుని ఆశ్రయించింది. దీనిపై అసహనం వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు చివరకు ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. అంతకుముందు అత్యున్నత న్యాయస్థానం.. కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఆ డాక్యుమెంటరీకి సంబంధించిన ఒరిజినల్ రికార్డులను సమర్పించాలని ఆదేశించింది. మూడు వారాల్లో కేంద్రం సమాధానం ఇవ్వాలని తేల్చి చెప్పింది. ఏప్రిల్‌కు విచారణను వాయిదా వేసింది. -
బీబీసీ డాక్యుమెంటరీ.. కేంద్రానికి సుప్రీం నోటీసులు
సాక్షి, ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ ప్రసారం చేసిన ఓ డాక్యుమెంటరీ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. కేంద్రం ఆ డాక్యుమెంటరీని, దానికి సంబంధించిన లింకులను భారత్‌లో బ్లాక్ చేసింది. ఈ పరిణామంపై పిటిషన్లు దాఖలుకాగా.. శుక్రవారం విచారణ సందర్భంగా సుప్రీం కోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, 2002 గుజరాత్ అల్లర్లపై వివాదాస్పద బీబీసీ డాక్యుమెంటరీని అడ్డుకోవాలన్న కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన అప్పీళ్లపై సుప్రీంకోర్టు ఈరోజు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. కేంద్రం ఆ డాక్యుమెంటరీని నిషేధించడాన్ని సవాల్ చేస్తూ.. అలాగే భవిష్యత్‌లోనూ సెన్సార్ చేయకుండా అడ్డుకోవాలని పిటిషనర్ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై మూడు వారాల్లో వివరణ ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్‌లో తదుపరి విచారణ ఉంటుందని తెలిపింది. ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన వివాదాస్పద డాక్యుమెంటరీని నిషేధించడంపై సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. పబ్లిక్ డొమైన్ నుంచి దానిని తొలగించడాన్ని.. డాక్యుమెంటరీ లింకులను సోషల్ మీడియా నుంచి తొలగించేందుకు కేంద్రం తన విశేష అధికారాలను ఉపయోగించడాన్ని సవాల్ చేస్తూ ఓ పిటిషన్ దాఖలు అయ్యింది. ఇది రాజ్యాంగవిరుద్ధమైన చర్యగా అభివర్ణించారు పిటిషనర్ తరపు న్యాయవాది ఎంఎల్ శర్మ. ఇక.. దిగ్గజ జర్నలిస్ట్ ఎన్ రామ్, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మెయిత్రా మరో ప్రత్యేక పిటిషన్ దాఖలు చేశారు. గుజరాత్ అలర్ల సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీని విమర్శిస్తూ రెండు భాగాలుగా ఇండియా: ది మోదీ క్వశ్చన్ పేరుతో డాక్యుమెంటరీ ప్రసారం చేసింది. దీంతో దుమారం రేగింది. ఇంగ్లండ్‌లో ఉన్న భారత సంతతి సైతం ఈ వ్యవహారాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. మరోవైపు జనవరి 21వ తేదీన కేంద్రం ఐటీ రూల్స్ 2021 ప్రకారం.. విశేష అధికారాలను ఉపయోగించి యూట్యూబ్, ట్విట్టర్లలో డాక్యుమెంటరీకి సంబంధించిన లింకులను, పోస్టులను తొలగించింది. -
'చైనా సంస్థ నుంచి డబ్బులు తీసుకొనే బీబీసీ తప్పుడు ప్రచారం'
న్యూఢిల్లీ: చైనాకు చెందిన సంస్థ నుంచి డబ్బులు తీసుకునే ప్రధాని మోదీపై బీబీసీ తప్పుడు డాక్యుమెంటరీని రూపొందించిందని బీజేపీ ఎంపీ, సీనియర్ న్యాయవాది మహేష్ జెఠ్మలాని ఆరోపించారు. హూవావే సంస్థ నుంచి బీబీసీకి డబ్బులు అందాయని పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. Why is #BBC so anti-India? Because it needs money desperately enough to take it from Chinese state linked Huawei (see link) & pursue the latter’s agenda (BBC a fellow traveller, Comrade Jairam?)It’s a simple cash-for-propaganda deal. BBC is up for sale https://t.co/jSySg542pl — Mahesh Jethmalani (@JethmalaniM) January 31, 2023 'బీబీసీ ఎందుకు భారత్‌కు వ్యతిరేకం? ఆ సంస్థకు బాగా డబ్బు అవసరమైంది. చైనాకు చెందిన హువావే సంస్థ ఆ డబ్బును సమకూర్చింది. డబ్బు తీసుకుని కావాలనే బీబీసీ తప్పుడు ప్రచారం చేస్తోంది. బీబీసీ అమ్ముడుపోతోంది.' అని మహేష్ జెఠ్మాలని ట్వీట్ చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి బ్రిటన్ మేగజీన్ 'ది స్పెక్టేటర్' 2022 ఆగస్టులో ప్రచురించిన ఓ కథనాన్ని కూడా షేర్ చేశారు. బీజేపీ నేత అమిత్ మాలవీయ సైతం బీబీసీ డాక్యుమెంటరీ దురుద్దేశంతో ఉందని ఆరోపించారు. భారత్ వృద్ధికి ఆటంకం కల్గించేందుకే ఇలా చేస్తున్నారని ధ్వజమెత్తారు. చైనా ప్రభుత్వం అండదండలతో కొన్ని సంస్థలు బీబీసీతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయని, రెండేళ్లుగా డబ్బులు అందిస్తున్నాయని అన్నారు. ఈ డాక్యుమెంటరీని ప్రతిపక్షాలు కూడా ఉపయోగించుకోవాలని చూస్తున్నాయని పేర్కొన్నారు. కార్తీ చిదంబరం సెటైర్లు.. మరోవైపు బీజేపీ నేతల తీరుపై కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం సెటైర్లు వేశారు. కేంద్రం బీబీసీ డాక్యమెంటరీని బ్యాన్ చేయడం చిన్నపిల్లల మనస్తత్వాన్ని గుర్తు చేస్తోందన్నారు. ఒకవేళ బీజేపీ నేతల దగ్గర బలమైన ఆధారాలుంటే బ్రిటన్‌లో ఆ సంస్థపై ఫిర్యాదు చేయవచ్చు కదా? అని ప్రశ్నించారు. డాక్యుమెంటరీలో వాస్తవం లేదని ప్రభుత్వం భావిస్తే అసలు నిజాలేంటో ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయకుండా బ్యాన్ ఎందుకు చేశారని అడిగారు. బీజేపీ నేతలు నిజంగా చైనా గురించి మాట్లాడాలనుకుంటే సరిహద్దులో చొరబాట్లు గురించి చర్చించాలన్నారు. చదవండి: మోదీ బీబీసీ డాక్యుమెంటరీ నిషేధంపై సుప్రీంకోర్టులో విచారణ -
మోదీ బీబీసీ డాక్యుమెంటరీ నిషేధంపై సుప్రీంకోర్టులో విచారణ..
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ 2002లో గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు జరిగిన గోద్రా అల్లర్లపై బీబీసీ డాక్యుమెంటరీ రూపొందించిన విషయం తెలిసిందే. ఇది పూర్తి దురుద్దేశంతో ఉందని కేంద్రం ఇందుకు సంబంధించిన రెండు వీడియోలను బ్యాన్ చేసింది. యూట్యూబ్, ట్విట్టర్లో వీడియో లింకులను బ్లాక్ చేసింది. తాజాగా కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. బీబీసీ డాక్యుమెంటరీని నిషేధించడం రాజ్యాంగ విరుద్ధమని, ఏకపక్ష నిర్ణయమని సీనియర్ న్యాయవాదులు ఎంఎల్ శర్మ, సీయూ సింగ్ తమ పిటిషన్లలో పేర్కొన్నారు. వీటిని అత్యవసరంగా విచారించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. సీనియర్ జర్నలిస్ట్ ఎన్ రామ్, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కూడా బీబీసీ వీడియోలను కేంద్రం బ్లాక్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్లు దాఖలు చేశారు. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహా, జస్టిస్ జేబీ పార్దీవాలాతో కూడిన బెంచ్ వీటిని పరిశీలించింది. వీటన్నింటిపై ఫిబ్రవరి 6న విచారణ చేపడతామని చెప్పింది. చదవండి: చావనైనా చస్తా.. కానీ బీజేపీతో మాత్రం చేతులు కలపను.. -
బీబీసీ డాక్యుమెంటరీ రచ్చ.. బ్రిటీష్ అరాచకాలపై కేరళ గవర్నర్ ఫైర్
Kerala Governor Arif Mohammad.. దేశంలో ప్రధాని మోదీ, గుజరాత్ అల్లర్లపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ వివాదాస్పదంగా మారింది. ఈ డ్యాకుమెంటరీపై భారత ప్రభుత్వం బ్యాన్ విధించిన విషయం తెలిసిందే. బీబీసీ డాక్యుమెంటరీ దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీస్తుంది. కాగా, ఈ బీబీసీ డాక్యుమెంటరీపై కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే బీబీసీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, కేరళ గవర్నర్ ఖాన్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. గుజరాత్ అల్లర్లపై బీబీసీ డాక్యుమెంటరీ రూపొందించిన వారు భారతదేశంలో బ్రిటీష్ పాలనలో జరిగిన దురాగతాలను ఎందుకు వీడియోలు తీయలేదని ప్రశ్నించారు. వందల సంవత్సరాలు బ్రిటీష్ పాలనలో భారతీయులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు వాటిని ఎందుకు డాక్యుమెంటరీ తీయలేదు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా భారత్ ఎన్నో రంగాల్లో ముందంజలో ఉంది. ఆర్థికంగా బలోపేతమై ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలో కొందరు నిరాశకు గురవుతున్నారు. అందుకే ఇలా డాక్యుమెంటరీ పేరుతో వివాదం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని సీరియస్ అయ్యారు. ఇదే సమయంలో.. భారతదేశం జీ20 అధ్యక్ష పదవిని చేపట్టిన సమయం ఇది. ఇప్పుడు భారత్ పేరును చెడగొట్టడానికే దీని ముందుకు తీసుకువచ్చారు. ఇప్పుడే డాక్యుమెంటరీని బయటకు తీసుకురావడాని కారణమేంటి? అని ప్రశ్నల వర్షం కురిపించారు. భారత్ ఎదుగుదలను చూడలేకనే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. అలాగే, న్యాయవ్యవస్థ తీర్పులపై డాక్యుమెంటరీని విశ్వసిస్తున్న కొందరిని చూస్తే జాలివేస్తోంది అంటూ కామెంట్స్ చేశారు. మరోవైపు.. 2002 గుజరాత్లో ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అల్లర్లకు సంబంధించి బీబీసీ డాక్యుమెంటరీని విడుదల చేసింది. అల్లర్ల సమయంలో కొన్ని అంశాలను పరిశోధించినట్లు పేర్కొంటున్న రెండు భాగాల డాక్యుమెంటరీని రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో డాక్యుమెంటరీపై బీబీసీ వివరణ కూడా ఇచ్చింది. ప్రధాని మోదీపై రూపొందించిన డాక్యుమెంటరీని ఆయా అంశాలపై విస్తృతంగా పరిశోధించిన తర్వాతనే దీన్ని రూపొందించినట్టుగా తెలిపింది. దీనికోసం అప్పటి సాక్ష్యులు, నిపుణులను సంప్రదించామని.. బీజేపీ నాయకుల నుంచి కూడా అభిప్రాయాలు సేకరించామని పేర్కొంది. -
మోదీ బీబీసీ డాక్యుమెంటరీపై రగడ.. ఢిల్లీ యూనివర్సిటీలో ఉద్రిక్తత
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ ప్రాంగణంలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కేంద్రం నిషేధించిన మోదీ బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు విద్యార్థులు ప్రయత్నించడం టెన్షన్ వాతావరణానికి దారితీసింది. ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు యూనివర్సిటీ యాజమాన్యం, పోలీసు అధికారులు నిరాకరించారు. అయినా ఎన్ఎస్యూఐకి చెందిన విద్యార్థులు దీన్ని స్క్రీనింగ్ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో క్యాంపస్‌కు కరెంట్ సరఫరాను నిలిపివేశారు అధికారులు. ఫలితంగా విద్యార్థులు యూనివర్సిటీ బయట ఆందోళనకు దిగారు. వీరికి మద్దతుగా యువత భారీగా తరలివచ్చారు. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు 144 సెక్షన్ విధించారు. 24 మంది విద్యార్థులను అరెస్టు చేశారు. తాము స్కీనింగ్‌కు ఏర్పాట్లు చేశామని, ల్యాప్‌టాప్‌లు, ప్రొజెక్టర్లను ధ్వసం చేశారని విద్యార్థులు ఆరోపించారు. Students gathered for screening of BBC’s documentary, India: The Modi Question, at Arts Faculty, DU were stopped by police and security personnel.#BBC #BBCDocumentary #IndiaTheModiQuestion #DU #ArtsFaculty #NorthCampus #DelhiUniversity pic.twitter.com/WwJQEGebS3 — Chirag Jha (@iChiragJha) January 27, 2023 అటు అంబేడ్కర్ యూనివర్సిటీలో కూడా ఇదే తరహా పరిస్థితి నెలకొంది. బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు విద్యార్థులు విఫలయత్నం చేశారు. దీనికి కూడా కరెంటు సరఫరా నిలిపివేశారు. ఫలితంగా విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. ఈ రెండు యూనివర్సిటీల్లో ఎలాంటి వీడియోలు ప్రదర్శించడానికి అనుమతి లేదని అధికారులు తెలిపారు. అయినా వారు మెబైల్ ఫోన్లలో చూడాలనుకుంటే వారి విచక్షణకే వదిలేస్తామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 2002లో గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు జరిగిన అల్లర్లపై బీబీసీ రెండు వీడియోల డాక్యుమెంటరీని రూపొందించిన విషయం తెలిసిందే. అయితే ఇది దురుద్ధేశపూర్వకంగా ఉందని కేంద్రం బ్యాన్ చేసింది. యూట్యూబ్, ట్విట్టర్లో ఈ వీడియో లింకులను బ్లాక్ చేసింది. అయినా కొన్ని యూనివర్సిటీల్లోని విద్యార్థులు ఈ డాక్యుమెంటరినీ ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఢిల్లీ జేఎన్టీయూ యూనివర్సిటీలో కూడా విద్యార్థులు ఈ వీడియో స్క్రీనింగ్‌కు ప్రయత్నించగా.. అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. చదవండి: రాహల్ జోడో యాత్రకు సడెన్ బ్రేక్! కేవలం కిలోమీటర్ తర్వాతే.. -
హెచ్‌సీయూలో ఉద్రిక్తత.. మోదీ బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శనతో టెన్షన్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని హెచ్‌సీయూ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. హెచ్‌సీయూలో ప్రధాని నరేంద్ర మోదీపై రూపొందించిన బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శన వల్ల ఏబీవీపీ-ఎస్ఎఫ్ఐ నేతలు, కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో, పోలీసులు వారిని ఎంట్రీ ఇచ్చారు. వివరాల ప్రకారం.. హెచ్‌సీయూలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. క్యాంపస్‌లో గురువారం సాయంత్రం కశ్మీర్ ఫైల్స్‌ను ప్రదర్శించేందుకు ఏబీవీపీ ప్రయత్నించింది. ఈ సందర్భంగా మోదీ బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు ఎస్ఎఫ్ఐ నేతలు ప్రయత్నించారు. దీంతో, ఇరు వర్గాల విద్యార్థి సంఘాలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో క్యాంపస్‌లో ఎలాంటి ప్రదర్శనలకు అనుమతిలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటన కారణంగా హెచ్‌సీయూలో పోలీసులు భారీగా పోలీసులు మోహరించారు. -
మోదీకి షాకిచ్చిన అమెరికా.. బీబీసీ డాక్యుమెంటరీపై యూటర్న్!
వాషింగ్టన్: ప్రధాని నరేంద్ర మోదీ 2002లో గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు జరిగిన అల్లర్లపై బీబీసీ రెండు వీడియోల డాక్యుమెంటరీ రూపొందించిన విషయం తెలిసిందే. ఇది దురుద్దేశపూర్వకంగా ఉందని కేంద్రం ఈ వీడియోలను బ్యాన్ చేసింది. గతవారమే ట్విట్టర్, యూట్యూబ్‌లో ఈ వీడియో లింక్స్‌ను బ్లాక్ చేసింది. అయితే అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ తాజాగా దీనిపై స్పందించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతికా స్వేచ్ఛకు తాము మద్దతు ఇస్తామని, ప్రాజాస్వామ్య విలువలను భావప్రకటనా స్వేచ్ఛ, మతం మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. భారత్‌కు కూడా ఇది వర్తిస్తుందని స్పష్టం చేశారు. సోమవారం ఇదే విషయంపై మాట్లాడిన ప్రైస్.. మోదీపై బీబీసీ రూపొందించన డాక్యుమెంటరీ గురించి తనకు తెలియదని, భారత్-అమెరికా బంధం ప్రత్యేకమన్నారు. రెండు దేశాల ప్రజాస్వామ్య విలువలు ఒకేలా ఉంటాయని వ్యాఖ్యానించారు. భారత్‌లో జరిగిన విషయాల గురించి గతంలోనే తాము మాట్లాడినట్లు పేర్కొన్నారు. కానీ ఒక్కరోజులోనే యూ టర్న్ తీసుకుని బీబీసీ డాక్యుమెంటరీని భారత్‌లో నిషేధించడాన్ని పరోక్షంగా తప్పుబట్టారు. 2002లో మోదీ సీఎంగా ఉన్నప్పుడు గుజరాత్లో మతపరమైన ఘర్షణలు చెలరేగాయి. కరసేవకులు ప్రయాణించిన రైలుకు దుండగుడు నిప్పుపెట్టిన ఘటనలో 50మందికిపైగా చనిపోయిన తర్వాత ఈ హింస మొదలైంది. ఈ ఘర్షణల్లో 1000 మందికిపైగా చనిపోయారు. బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే ఈ వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం మోదీకి 2012లోనే క్లీన్చిట్ ఇచ్చింది. కానీ బీబీసీ గుజరాత్ అల్లర్లపై ఇన్వెస్టిగేషన్ చేసి రెండు వీడియోల రూపంలో డాక్యుమెంటరీ రూపొందించి ఇటీవలే విడుదల చేసింది. ఇందులో విషయమేమీ లేదని, పూర్తింగా దురుద్దేశపూర్వకంగా ఉందని కేంద్రం ఈ వీడియోలను బ్యాన్ చేసింది. చదవండి: దారుణమైన పరిస్థితులు.. ప్రభుత్వ ఉద్యోగులకు షాక్! జీతాల్లో 10 శాతం కోత -
కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. ఏకే ఆంటోని కుమారుడు అనిల్ రాజీనామా
కాంగ్రెస్‌కు బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ఈ రాజీనామాకు కారణంగా మారింది. 2002 గుజరాత్ అల్లర్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మోదీపై బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీపై అనిల్ అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ డాక్యుమెంటరీని వ్యతిరేకిస్తూ అనిల్ ఆంటోనీ పోస్టు చేయగా.. తన ట్వీట్‌ను వెనక్కి తీసుకోవాలంటూ అతనికి కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్ర ఒత్తడి ఎదురైంది. ఈ క్రమంలోనే పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు బుధవారం ప్రకటించారు. మోదీపై డాక్యుమెంటరీపై విమర్శించిన మరుసటి రోజే అనిల్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ‘కాంగ్రెస్ పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నాను. నా ట్వీట్‌ను వెనక్కి తీసుకోవాలని విపరీతమైన ఒత్తిడి చేశారు. అది కూడా వాక్ స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న వారి నుంచి వచ్చింది. కానీ దానికి నేను నిరాకరించాను. ప్రేమను ప్రచారం చేసే వారే ఫేస్బుక్లో నాపై ద్వేషాన్ని వెల్లగక్కుతున్నారు. దీనినే హిపోక్రసీ అంటారు. జీవితం సాగుతూనే ఉంటుంది’ అంటూ ట్విటర్లో రాజీనామా లేఖను కూడా పోస్టు చేశారు. ‘నిన్నటి నుంచి సంఘటనలను పరిశీలిస్తే కాంగ్రెస్‌లోని నా అన్ని పదవులను వదిలేయడానికి సరైన సమయమని నమ్ముతున్నాను. కేపీసీసీ డిజిటల్ మీడియా కన్వీనర్, ఏఐసీసీ సోషల్ మీడియా- డిజిటల్ కమ్యూనికేషన్ సెల్ జాతీయ కో ఆర్డినేటర్ పదవులకు రాజీనామా చేస్తున్నాను. నా రాజీనామా లేఖను పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నాను. నేను ఇక్కడ ఉన్న కొద్ది కాలంలో నాకు సహరించిన కేరళ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి, నేతలకు, పార్టీ కార్యకర్తలకు ముఖ్యంగా ఎంపీ శంశిథరూర్‌కు ధన్యవాదాలు.’ అని తెలిపారు. ఇక ఇప్పటికే మోదీపై ‘ఇండియా ద మోదీ క్వశ్చన్’ పేరుతో బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీ లింక్‌లను బ్లాక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం యూట్యూబ్, ట్విట్టర్ సంస్థలను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏకే ఆంటోనీ తనయుడు అనిల్ ఆంటోనీ నుంచి మోదీకి అనూహ్య మద్దతు లభించింది. భారతీయ సంస్థలపై బ్రాడ్‌కాస్టర్ అభిప్రాయాలను వెల్లడించడం దేశ సార్వభౌమత్వాన్ని అణగదొక్కడం కిందకే వస్తుందంటూ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. 2002 గుజరాత్ అల్లర్లపై రూపొందించిన బీబీసీ డాక్యుమెంటరీని కేరళలో ప్రదర్శిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ లోని వివిధ విభాగాలు ప్రకటించిన తరుణంలో ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు. చదవండి: కొలీజియం తీర్మానం తీవ్ర ఆందోళనకరం I have resigned from my roles in @incindia @INCKerala.Intolerant calls to retract a tweet,by those fighting for free speech.I refused. @facebook wall of hate/abuses by ones supporting a trek to promote love! Hypocrisy thy name is! Life goes on. Redacted resignation letter below. pic.twitter.com/0i8QpNIoXW — Anil K Antony (@anilkantony) January 25, 2023 -
మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శిస్తాం.. బీజేపీ తీవ్ర అభ్యంతరం
తిరువనంతపురం/వాషింగ్టన్: ప్రధాని మోదీపై ‘ఇండియా: ద మోదీ క్వశ్చన్’ పేరిట బ్రిటిష్ వార్తా సంస్థ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శిస్తామని కేరళలోని వివిధ రాజకీయ పార్టీల అనుబంధ విభాగాలు మంగళవారం వెల్లడించాయి. దీనిపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సీఎం విజయన్ జోక్యం చేసుకోవాలని, వివాదాస్పద డాక్యుమెంటరీ ప్రదర్శనను అడ్డుకోవాలని డిమాండ్ చేసింది. డాక్యుమెంటరీని ప్రదర్శించబోతున్నామంటూ సీపీఎం యువజన విభాగమైన డీవైఎఫ్ఐ ఫేసుబుక్‌లో పేర్కొంది. అనంతరం సీపీఎం విద్యార్థి విభాగం ఎస్ఎఫ్ఐ, కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(కేపీసీసీ) అనుబంధ విభాగాలు ప్రకటించాయి. రాష్ట్రంలో బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శనకు ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వొద్దని బీజేపీ కేరళ అధ్యక్షుడు కె.సురేంద్రన్ కోరారు. మత కలహాలు సృష్టించడానికే ఈ డాక్యుమెంటరీని తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. డాక్యుమెంటరీ గురించి తెలియదు: అమెరికా బీబీసీ డాక్యుమెంటరీ గురించి తమకేమీ తెలియదని అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ స్పష్టం చేసింది. అమెరికా, భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలని పేర్కొంది. ఇరు దేశాల నడుమ బలమైన సంబంధ బాంధవ్యాలను తాము కోరుకుంటున్నామని వెల్లడించింది. ఇరు దేశాలు విలువలను కలిసి పంచుకోవాలన్నదే తమ ఆకాంక్ష అని ఉద్ఘాటించింది. బీబీసీ డాక్యుమెంటరీ విషయంలో బ్రిటిష్ ప్రధానమంత్రి రిషి సునాక్ గతవారం ప్రధాని మోదీకి అనుకూలంగా మాట్లాడారు. మోదీపై అసత్యాలు ప్రచారం చేయొద్దని హితవు పలికారు. కొన్ని ప్రాంతాల్లో ప్రదర్శన డాక్యుమెంటరీని ఎస్‌ఎఫ్‌ఐతోపాటు పలు సంఘాలు మంగళవారం కేరళలో కొన్ని ప్రాంతాల్లో ప్రదర్శించాయి. ఈ ప్రదర్శనలను వ్యతిరేకిస్తూ బీజేపీ యువమోర్చా కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి, నిరసన వ్యక్తం చేశారు. పాలక్కాడ్, ఎర్నాకుళం తదితర ప్రాంతాల్లో యువమోర్చా కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. పోలీసులు రంగంలోకి దిగి, వారిని అడ్డుకున్నారు. కేవలం కేరళలోనే కాదు, దేశవ్యాప్తంగా డాక్యుమెంటరీని ప్రదర్శిస్తామని సీపీఎం యువజన విభాగం డీవైఎఫ్ఐ మంగళవారం తేల్చిచెప్పింది. -
BBC Documentary On Modi: కాంగ్రెస్ నాయకుడి కొడుకు ఫైర్
ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ వివాదంలో మోదీకి ఊహించని వర్గాల నుంచి పెద్ద సంఖ్యలో మద్దతు లభించింది. అందులో భాగంగా మోదీకి ఓ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కొడుకు నుంచి ఆశ్చర్యపరిచే రీతిలో సపోర్టు లభించింది. ఈ మేరకు కేరళ మాజీ ముఖ్యమంత్రి ఏకే ఆంటోని కుమారుడు అనిల్ ఆంటోని ఆ డాక్యుమెంటరీపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భారతీయ సంస్థలపై బ్రాడ్‌కాస్టర్ అభిప్రాయాలను ఉంచడం దేశ సార్వభౌమత్వాన్ని అణగదొక్కడం కిందకే వస్తుందంటూ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. మన స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయినా ఇంకా మన సంస్థలపై పెత్తనం చెలాయించి, సార్వభౌమాధికారిన్ని అణగదొక్కేలా చేసేందుకు అనుమతించకూడదన్నారు. మన గ్రంథాలు ఉపనిషత్తులు, భగవద్గీత చదివితే గనుక సత్యం ఎప్పటికైనా.. బయటకు వస్తుందన్న విషయం తెలుస్తుందన్నారు. పతిక్రలను అణిచివేసి, సంస్థలు నియంత్రించి, ఆఖరికి ఈడీ, సబీఐలు ఉపయోగించకోవచ్చు, కానీ నిజం ఎప్పటికీ నిజమే అని చెప్పారు. అది ప్రకాశవంతంగా ఉంటుందని, దానికి బయటకు వచ్చేసే దుష్ట అలవాటు ఉందని అన్నారు. ప్రజలను ఎన్ని అణివేతలకు గురిచేసి భయబ్రాంతులకు గురిచేసినా.. నిజాన్ని బయటకు రాకుండా ఆపలేమని నొక్కి చెప్పారు. ఇటీవల భారత జోడో యాత్రలో రాహుల్ ఆ డాక్యుమెంటరీని నిరోధించే కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలను ప్రశ్నించిన రోజునే అనుహ్యంగా సీనియర్ నాయకుడు కుమారుడు అనిల్ ఆంటోని నుంచి ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం. తన పార్టీ నాయకుడు రాహుల్ గాంధీకి విరుద్ధంగా యూటర్న్ తీసుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇదిలా ఉండగా, ఇప్పటికే కేంద్రం ఆ వివాదాస్పద డాక్యుమెంటరీ లింక్‌లకు సంబంధించిన యూట్యూబ్ వీడియోలు, ట్విట్టర్ పోస్ట్‌లను తొలగించాలని ఆదేశించింది. అలాగే విదేశీ మంత్రిత్వ శాఖ సైతం నిష్పక్షపాతం లేని వలసవాద మససతత్వానికి నిదర్శనం అంటూ బీబీసీని తిట్టిపోసింది. (చదవండి: ఫ్రూఫ్ అవసరం లేదు! దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలపై రాహుల్ వివరణ) -
మోదీ బీబీసీ డాక్యుమెంటరీపై అమెరికా కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్: భారత ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ గురించి తెలియని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ పేర్కొన్నారు. సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో విలేకరి అడిగిన ప్రశ్నకు ఈమేరకు బదులిచ్చారు. భారత్-అమెరికా బలమైన ప్రజాస్వామ్య దేశాలుగా ఉండటానికి కారణమైన భాగస్వామ్య విలువల గురించే తనకు తెలుసని చెప్పారు. 'మీరు అడుగుతున్న బీబీసీ డాక్యుమెంటరీ గురించి నాకు తెలియదు. కానీ భారత్-అమెరికా భాగస్వామ్య విలువల గురించి బాగా తెలుసు. వీటి వల్లే రెండు దేశాలు బలమైన ప్రజాస్వామ్య, అభివృద్ధి చెందుతున్న దేశాలుగా ఉన్నాయి. ఇండియాలో జరిగిన పరిణామాల గురించి గతంలోనే కొన్ని సందర్భాల్లో మాట్లాడాం.' అని ప్రైస్ పేర్కొన్నారు. భారత్-అమెరికా అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్య దేశాలు కావడానికి రాజకీయ, ఆర్థిక కారణాలతో పాటు ప్రజా సంబంధాలు అత్యంత ముఖ్యమైనవని ప్రైస్ వివరించారు. 2002లో గుజరాత్ అల్లర్ల సమయంలో సీఎంగా ఉన్న మోదీపై బీబీసీ రెండు భాగాల డాక్యుమెంటరీ రూపొందించింది. అయితే ఇది దురుద్దేశంతో తీసినట్లుగా ఉందని కేంద్రం ఫైర్ అయ్యింది. యూట్యూబ్, ట్విట్టర్లో ఈ వీడియోలను బ్లాక్ చేసింది. చదవండి: ఇలాంటి సన్నివేశాన్ని ఇండియాలో ఊహించగలమా? -
పరిపాలన మాతృ భాషలోనే జరగాలి
మణికొండ: దేశంలో ప్రధాన పరీక్షలను మాతృభాషలోనే నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం హర్షణీయమని, పరిపాలన, న్యాయ, వైద్య, శాస్త్ర సాంకేతిక లాంటి అన్ని రంగాలలో మాతృభాషను అమలు చేయాల్సిన అవసరం ఎంతో ఉందని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఆదివారం నార్సింగిలో సీనియర్ బీజేపీ నాయకుడు పి.మురళీధర్‌రావు సారధ్యంలో తెలుగు సంగమం సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సమ్మేళనంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మాతృభాషను చిన్నచూపు చూసే భావన పోవాలన్నారు. గతంలో ప్రపంచానికే విశ్వగురువులుగా ఉన్న మనం రాబోయే పదేళ్లలో తిరిగి పూర్వవైభవం సంతరించుకుంటామని వెంకయ్య నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. మనది దీపం వెలిగించే సంస్కృతి అని.. అదే పాశ్చాత్య దేశాల వారు వాటిని ఆర్పి ఉత్సవాలు చేసుకుంటారని వ్యాఖ్యానించారు. బీబీసీ డాక్యుమెంటరీలో ప్రధానమంత్రి మోదీ పట్ల అవమానకరంగా కథనం ప్రసారం చేయటం దేశానికే అవమానంగా భావించాలన్నారు. తాను పదవీ విరమణే చేశానని, పెదవి విరమణ చేయలేదని, రిటైర్డ్ అయ్యాను తప్ప టైర్డ్ కాలేదని ఆయన చమత్కరించారు. మన సంస్కృతి ఎంతో గొప్పది.. మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పవని, వాటిని ప్రస్తుతం ప్రపంచమంతా ఆచరిస్తున్నారని, మనం మాత్రం వారు వదిలిపెట్టిన సంస్కృతి వెంట పడుతున్నామని హరియాణ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిలు అన్నారు. కేంద్ర ప్రభుత్వం మాతృభాషకు మరింత ప్రాచుర్యం కల్పించేలా ప్రధాన పరీక్షలను స్థానిక భాషల్లోనే నిర్వహించేందుకు ముందుకు రావటం మంచి పరిణామమన్నారు. కార్యక్రమంలో సినీ డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు, పద్మశ్రీ డాక్టర్ శోభరాజు, డాక్టర్ ఆకేళ్ల విభీషణ శర్మ, లక్ష్మీనారాయణ, కామినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
మోదీపై డాక్యుమెంటరీ.. దెబ్బకు ఆ లింక్‌లు బ్లాక్
ఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీని విమర్శిస్తూ.. బీబీసీ తీసిన డాక్యుమెంటరీలను షేర్ చేసే పలు యూట్యూబ్ వీడియోలను, ట్విటర్లోని ట్వీట్లను బ్లాక్ చేసినట్లు కేంద్ర సమాచార ప్రసార మత్రిత్వ శాఖ పేర్కొంది. అలాగే సంబంధిత యూట్యూబ్ వీడియోలు కలిగి ఉన్న 50కి పైగా ట్వీట్లను బ్లాక్ చేయాలని ట్విట్టర్‌ని కేంద్రం ఆదేశించింది. ఐటీ నిబంధనల ప్రకారం.. విశేషాధికారాలను ఉపయోగించి సమాచార ప్రసార కార్యదర్శి ఈ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఐతే యూట్యూబ్, ట్విట్టర్ రెండూ ప్రభుత్వ ఆదేశాలకు కట్టుబడి ఉన్నట్లు ప్రసార మంత్రిత్వ శాఖ పేర్కొంది. బీబీసీ భారత్‌లోకి డాక్యుమెంటెరీని అందుబాటులోకి తీసుకురానప్పటికీ కొన్ని యూట్యూబ్ ఛానెల్‌లు భారత్ వ్యతిరేక ఎజెండాను ప్రచారం చేయడానికి అప్లోడ్ చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. అలాగే మళ్లీ తన ఫ్లాట్‌ఫామ్‌లో ఈ వీడియోలను అప్లోడ్ చేస్తే బ్లాక్ చేయమని యూట్యూబ్‌కు సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతేగాదు ఇతర ఫ్లాట్‌ఫామ్‌లలో ఈ వీడియో లింక్‌ను కలిగి ఉన్న ట్వీట్లను కూడా గుర్తించి బ్లాక్ చేయమని అదేశించినట్లు పేర్కొన్నాయి. వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన ఉన్నత ప్రభుత్వాధికారులు ఈ డాక్యుమెంటరీని పరిశీలించి.. దేశ ప్రతిష్టను దెబ్బ తీసేలా, భారత సుప్రీం కోర్టు అధికారం విశ్వసనీయతపై దుష్ప్రచారం చేసేలా, పైగా.. వివిధ భారతీయ వర్గాల మధ్య విభేదాలను కలిగించేలా ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. బీబీసీ డాక్యుమెంటరీపై కేంద్రం ఫైర్ అయ్యింది. ఈ డాక్యుమెంటరీ భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను దెబ్బతీసే విధంగా ఉందని, ప్రధాని మోదీ వ్యక్తిత్వాన్ని కించపరిచేదిగా ఉందని, విదేశాలతో భారత్‌కు ఉన్న స్నేహపూర్వక సంబంధాలను దెబ్బతీసేలా ఉందని కేద్రం అభిప్రాయపడింది. ఇంతకు ముందు బీబీసీ నరేంద్ర మోదీపై చేసిన వివాదాస్పద డాక్యుమెంటరీని విదేశాంగ మంత్రిత్వశాఖ తీవ్రంగా ఖండించింది. ఇదిలా ఉండగా, యూకే నేషనల్ బ్రాడ్‌కాస్టర్ బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న ప్రధాని మోదీ గురించి వ్యతిరేకంగా రెండు భాగాల సిరీస్‌ను ప్రసారం చేసింది. ఈ డాక్యుమెంటరీపై దుమారం రేగడంతో.. ఎపిసోడ్ లింక్‌లను తొలగించమని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. చదవండి: మోదీపై డాక్యుమెంటరీలో ఏముంది? రిషి సునాక్ ఎలా రియాక్ట్ అయ్యారు? -
మోదీపై డాక్యుమెంటరీ దుమారం! రిషి సునాక్ స్పందన
న్యూఢిల్లీ/లండన్: భారత ప్రధాని నరేంద్ర మోదీపై.. ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ తీసిన ఓ డాక్యుమెంటరీ పెను దుమారాన్ని రేపుతోంది. ‘ఇండియా ది మోదీ క్వశ్చన్’ పేరుతో రెండు పార్ట్‌ల సిరీస్‌గా డాక్యుమెంటరినీ రూపొందించింది బీబీసీ. అయితే ఈ సిరీస్‌పై భారత ప్రభుత్వం, మరోవైపు ప్రవాస భారతీయులు తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. డాక్యుమెంటరీ.. దానిని రూపొందించిన ఏజెన్సీకి ప్రతిబింబంగా ఉంది. అపఖ్యాతి పాలుజేసేందుకు ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రచార భాగం అని మేము భావిస్తున్నామని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ వెల్లడించారు. పక్షపాతం, నిష్పాక్షికత లేకపోవడం, వలసవాద మనస్తత్వం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అలాంటి చేష్టలను గౌరవించలేం అని బాగ్చీ పేర్కొన్నారు. ఈ సిరీస్‌ను ప్రసారం చేయడంలో ఎజెండా ఏమిటని బీబీసీని నిలదీశారు. బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ బీబీసీ (BBC) మోదీపై రెండు భాగాలుగా ఓ డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. 2002 అలర్లకు సంబంధించిన మోదీ పాత్ర అంటూ డాక్యుమెంటరీలో హైలైట్ చేసింది బీబీసీ. ఆ టైంలో మోదీ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్తూ విమర్శలు గుప్పించింది. మోదీ, భారతదేశంలోని ముస్లిం మైనారిటీల మధ్య ఉద్రిక్తతలను పరిశీలించడం, వెయ్యి మంది వరకు మరణించిన గుజరాత్ 2002 అల్లర్లలో ప్రధాని మోదీ పాత్ర గురించి వాదనలను పరిశీలించడం లాంటి ఉద్దేశాలను ప్రముఖంగా చూపించడంతో.. దుమారం మొదలైంది. భారత సంతతి మండిపాటు అపఖ్యాతిపాలు చేసే కథనాన్ని ప్రచారం చేయడం కోసమే ఈ విశ్వసనీయత లేని డాక్యుమెంటరీని ప్రసారం చేశారని బీబీసీని భారత ప్రభుత్వం దుయ్యబట్టింది. బ్రిటన్‌లోని అంతర్గత నివేదిక ఆధారంగా రూపొందించిన ఈ డాక్యుమెంటరీలో వలసవాద మనస్తత్వం, ఆలోచనా ధోరణి కనిపిస్తోందని పేర్కొంది. మరోవైపు భారతీయ మూలాలుగల బ్రిటన్ పౌరులు ఈ డాక్యుమెంటరీని తీవ్రంగా ఖండించారు. లార్డ్ రమి రేంజర్ మాట్లాడుతూ, 100 కోట్ల మందికిపైగా గల భారతీయుల మనోభావాలను బీబీసీ తీవ్రంగా గాయపరిచిందన్నారు. వలసవాద ఆలోచనా ధోరణిని ప్రతిబింబించే డాక్యుమెంటరీ అంటూ బీజేపీ శ్రేణులు సైతం మండిపడుతున్నాయి. రిషి సునాక్ స్పందన మోదీపై బీబీసీ తీసిన డాక్యుమెంటరీపై బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ పార్లమెంట్లో స్పందించారు. పాక్ సంతతికి చెందిన ఎంపీ ఇమ్రాన్ హుస్సేన్ బ్రిటన్ పార్లమెంట్లో ఈ డాక్యుమెంటరీపై మాట్లాడుతూ.. మోదీపై విమర్శలు గుప్పించారు. అయితే.. హుస్సేన్‌కు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ వెంటనే కౌంటర్ ఇచ్చారు. ప్రధాని మోదీకి మద్ధతుగా స్పందించారు. ‘‘దీనిపై UK ప్రభుత్వ వైఖరి స్పష్టంగా ఉంది. దీర్ఘకాలంగా ఉన్న ఆ వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. అలాగని ఎక్కడైనా హింసను సహించబోం.’’ అంటూ రిషి సునాక్ పాక్ సంతతి ఎంపీ నోరు మూయించారు. UK PM #RishiSunak dismisses Pak-origin #British MP's statement about #PMModi's leadership during 2002 Gujarat riot over BBC documentary#Pakistan #NewsUpdate #ModiGovt @PMModiNews @rishisunakmp1 @PMModiArmy #RIOT @PmModiFanClub1 @rishisunak_66 Video Credit: @kapilkumaron pic.twitter.com/uFhN8gOTMw — News9 (@News9Tweets) January 19, 2023 ఆ కామెంట్లపై అభ్యంతరాలు ఈ డాక్యుమెంటరీలో బ్రిటన్ మాజీ సెక్రటరీ జాక్ స్ట్రా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. జాక్ స్ట్రా ఏదో అంతర్గత బ్రిటన్ నివేదికను ప్రస్తావించినట్లు కనిపిస్తోందని, అది తనకు ఏవిధంగా అందుబాటులో ఉంటుందని ప్రశ్నలు తలెత్తుతోంది. పైగా అది ఇరవయ్యేళ్ళ క్రితంనాటి నివేదిక అని, దానిపైన ఇప్పుడు ఎందుకు స్పందించాలని, జాక్ చెప్పినంత మాత్రానికి అది సరైనదని బీబీసీ ఎలా ప్రసారం చేసిందని అభ్యంతరాలతో ఏకిపడేస్తున్నారు కొందరు. గుజరాత్ అల్లర్ల నేపథ్యం 2002 ఫిబ్రవరి నెలలో అయోధ్య నుంచి తిరిగి వస్తున్న సబర్మతి ఎక్స్ ప్రెస్ రైలులో కరసేవకులు ఉన్న బోగీకి గోద్రా రైల్వేస్టేషన్ లో నిప్పు పెట్టడంతో 59 మంది చనిపోయారు. ఈ ఘటనతో గుజరాత్ వ్యాప్తంగా హిందూ-ముస్లింల మధ్య ఘర్షణలు తలెత్తాయి. మూడు నెలల పాటు గుజరాత్ రాష్ట్రం అట్టుడికింది. ఈ ఘర్షణలో వెయ్యి మరణించారు. ఆ సమయంలో గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. సీఎంగా నరేంద్ర మోదీ ఉన్నారు. అయితే ఈ అల్లర్లపై ఏర్పాటు చేసిన సిట్ 2012లో ప్రధాని మోదీకి క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ అల్లర్లలో ప్రభుత్వ ప్రమేయం లేదని చెప్పింది. కొంతమంది మాత్రం నరేంద్రమోదీ పాత్ర ఉందని తప్పుడు ఆరోపణలు చేశారని వెల్లడించింది. ఇక తీస్తా సెతల్వాడ్ అనే హక్కుల కార్యకర్త నరేంద్ర మోదీని తప్పుడు ఆరోపణలతో ఇరికించే ప్రయత్నం చేసినట్లు తేలింది. దీనికి కాంగ్రెస్ పార్టీ, దివంగత కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ ప్లాన్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. కిందటి ఏడాది.. గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి గతంలో హైకోర్టు ఇచ్చిన క్లీన్ చిట్‌ను సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ మేరకు ఆ హింసాకాండలో మరణించిన కాంగ్రెస్ ఎంపీ ఈషాన్ జఫ్రీ భార్య జాకియా జఫ్రీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు అర్హత లేనిదిగా పేర్కొంది కూడా. -
నా ఫ్లయిట్లో వస్తారా కిమ్.. కొరియాలో దింపేస్తాను
ట్రంప్‌కి సొంత ఫ్లయిట్ ఉంది. కిమ్ రైల్లో వచ్చారు. వియత్నాంలో చర్చలు. చర్చల మధ్యలో ట్రంప్‌కి కిమ్ మీద కోపం వచ్చింది. ‘నేను వెళ్లిపోతున్నా’ అని పైకి లేచారు. వెళ్తూ, వెళ్తూ..‘నా ఫ్లయిట్లో వస్తారా.. కొరియాలో దింపేస్తాను’ అని ఆహ్వానించారు. ట్రంప్‌ని ఎలా అర్థం చేసుకోవాలి? ఫిబ్రవరి 24న బి.బి.సి. ప్రసారం చేస్తున్న ‘ట్రంప్ టేక్స్ ఆన్ ది వరల్డ్’ చివరి ఎపిసోడ్లో ట్రంప్‌లోని ‘నాన్–ప్రెసిడెంట్’ని చూపించే డాక్యుమెంటేషన్స్ కొన్ని ఉన్నాయి. ఆ వివరాలు.. ట్రంప్ ఉన్నన్నాళ్లూ అమెరికా ప్రెసిడెంటుగా మాత్రమే లేరు. మనకు తెలిసిన ఒక పెద్ద మనిషెవరో అమెరికా అధ్యక్షుడు అయితే ఎలా ఉంటారో అలా కూడా ఉన్నారు! ఆ సూటు, కోటు, టై మాత్రమే ఆయన ప్రెసిడెంటు అనగలగడానికి గుర్తు. అవి తీసి చూస్తే.. మామూలు విషయాలన్నీ మాట్లాడే ఒక మామూలు మనిషే. అయితే ట్రంప్‌లోని విశేషం.. ఆయన అమెరికన్ ప్రెసిడెంట్ దుస్తుల్ని ధరించి కూడా మామూలు మనిషిగా మాట్లాడ్డం! అమెరికా ఆతిథ్యానికి వచ్చిన పరదేశీ పెద్దమనిషి అని లేదు, ఓ పెద్దమనిషిగా çపరదేశానికి వచ్చానన్న ‘మూతి బిగింపు’ లేదు, ఆ దేశమూ ఈ దేశమూ కాకుండా వేరే దేశంలో ఎక్కడో ఇద్దరం అధ్యక్షులం చర్చల కోసం కలుసుకున్నాం అన్న దౌత్యాధిక్యమూ లేదు. కోపమొస్తే కోపం, నవ్వొస్తే నవ్వు! జోకులు వేసేవారు. భుజం చరిచేవారు. ఒక చెంపపై కొట్టి, ఇంకో చెంపపై ముద్దు పెట్టేవారు. ఇలా ఉన్నాయి ఆయన ఉన్న నాలుగేళ్లూ. రాజకీయాల నుంచి వచ్చిన మనిషి కాకపోవడంతో మనిషిగా మాత్రమే తరచు ఆయన ‘బిహేవ్’ చేసేవారు. ఎప్పుడైనా పర్సనల్ సెక్రెటరీ వచ్చి ‘అలా చేయకూడదు’ అని చెవిలో చెబితే వెంటనే తనొక ప్రెసిడెంట్‌నని గుర్తుకు తెచ్చుకుని తిన్నగా కూర్చున్నారేమో తెలియదు. అలాంటి విషయాలు చాలావరకు గోప్యంగా ఉండిపోతాయి. ప్రెసిడెంట్ పదవీ కాలం ముగిశాక, ప్రెసిడెంటుతో కలిసి సన్నిహితంగా పనిచేసినవారు ఎప్పుడైనా నోరు విప్పిన ప్పుడు బహిర్గతం అవుతాయి. వియత్నాంలోని హనోయ్ సమావేశానికి రైలు నుంచి కిమ్ ‘ట్రంప్ టేక్స్ ఆన్ ది వరల్డ్’ అని బి.బి.సి.లో ట్రంప్‌పై కొంతకాలంగా డాక్యుమెంటరీలు వస్తున్నాయి. ఇప్పటికి రెండు ఎపిసోడ్లు ప్రసారం అయ్యాయి. మూడోదీ, చివరిదీ అయిన ఎపిసోడ్ ఫిబ్రవరి 24 స్ట్రీమ్ అవుతోంది. అందులో ట్రంప్ అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయాలు, అనూహ్యంగా ప్రవర్తించే విధానం, తనొక ప్రెసిడెంట్ ననే స్పృహ లేకుండా కామన్‌మేన్‌గా మాట్లాడ్డం వంటి ఆసక్తికరమైన సందర్భాలు ఉండబోతున్నాయి. ముఖ్యంగా తన అత్యున్నతస్థాయి విదేశాంగ శాఖ అధికారులకు ఆయన ఇచ్చిన ‘షాకు’లు! అయితే ట్రంప్ అవి తెలిసి ఇచ్చిన షాకులు కాదని ఎపిసోడ్స్‌ని నిర్మించిన టిమ్ స్టిర్జకర్ ముందే చెప్పేశారు. తొలి రెండు ఎపిసోడ్లలో ‘అమెరికా ఫస్ట్’ అనే ట్రంప్ విధానం, అమెరికాను ట్రంప్ ఇరాన్ తో యుద్ధం వరకు తీసుకెళ్లడం వంటివి ఉన్నాయి. ఈ మూడో ఎపిసోడ్లో ఉత్తర కొరియాతో, అది కూడా కిమ్‌తో ఆయన ఎలా ఉన్నారో తెలిపే వాస్తవ చిత్రీకరణలు ఉన్నాయి. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌తో దాదాపుగా ఒక ఫ్రెండ్‌లానే ఉండి వెళ్లారు ట్రంప్. అది దక్షిణ కొరియాకు నచ్చేది కాదు. ట్రంప్ అకస్మాత్తుగా కొన్నిసార్లు దక్షిణ కొరియా వైపు ఉండేవారు. అది కిమ్‌కి నచ్చేది కాదు. మొత్తానికి గత నాలుగేళ్లలో ట్రంప్–మెలనియా (ప్రథమ మహిళ) జంట కన్నా, ట్రంప్–కిమ్ జంటే తరచు ప్రపంచ ప్రజల కంట పడుతుండేది. బి.బి.సి తాజా ఎపిసోడ్లో ఈ పోలిక లేదు కానీ.. ఎవరితోనూ పోల్చలేని ట్రంప్ ప్రవర్తనపై ఫోకస్ ఎక్కువగా ఉంది. అందులోనిదే ఓ చిన్న సందర్భం చూద్దాం. 2019 ఫిబ్రవరిలో.. వియత్నాంలోని హనోయ్‌లో ట్రంప్, కిమ్ ద్వైపాక్షిక చర్చలకు కూర్చున్నారు. ఉత్తర కొరియా అణు కార్యక్రమం మీద డిస్కషన్. ట్రంప్ చెప్పినట్లు కిమ్ వినడం లేదు. ట్రంప్‌కి విసుగొచ్చింది. చర్చల మధ్యలోనే లేచి బయటికి వచ్చేశారు. విమానం నుంచి ట్రంప్ (ఫైల్) ‘‘ఏమైంది మిస్టర్ ప్రెసిడెంట్’ అని బయట వేచి ఉన్న ప్రెస్ వాళ్లు అడిగారు. ట్రంప్ వాళ్లపైపు చూశారు. ‘కొన్నిసార్లు మధ్యలోనే లేచి రావలసి వస్తుంది’ అన్నారు. అనేసి ఆయన దారిన ఆయన తన ‘ఎయిర్ ఫోర్స్ వన్’ విమానంలో అమెరికా వెళ్లిపోవచ్చు. కానీ అలా వెళ్లలేదు. కిమ్ దగ్గరకు వెళ్లి.. ‘నా ఫ్లయిట్లో వస్తారా, మిమ్మల్ని కొరియాలో దింపేసి నేను అమెరికా వెళ్లిపోతాను’ అని ఆఫర్ ఇచ్చారు! ఆయన అలా అనడానికి కారణం ఉంది. ట్రంప్ తన ప్రెసిడెంట్ విమానంలో వియత్నాం చర్చలకు వస్తే, కిమ్ రైల్లో రోజంతా ప్రయాణించి చైనా మీదుగా హనోయ్ వచ్చారు. వెళ్లేటప్పుడు అంత చుట్టూ తిరిగే పని లేకుండా కిమ్‌ని నేరుగా కొరియాలో దింపేద్దామని అనుకున్నారు ట్రంప్. ‘రెండు గంటల్లో చేరుకుంటారు. వస్తారా’ అని అడిగారు. కిమ్ రానన్నారు. ట్రంప్‌లోని ఈ దౌత్యాతీత ఔదార్యం ట్రంప్ ‘నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్’ సభ్యుల్ని ఆశ్చర్యానికి, భయానికీ గురి చేసింది. ట్రంప్ పక్కనే ఆయన్ని కాచుకుని ఉండే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జాన్ బోల్టన్కి ఇలాంటి ఆశ్చర్యాలు, భయాలు కొత్తేం కాదు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన కొత్తలో కిమ్‌లో తన బెస్ట్ ఫ్రెండ్‌ని చూసుకున్నారు. 2018లో సింగపూర్‌లో ఈ రెండు దేశాధినేతల మధ్య తొలి సమావేశం జరిగిప్పుడు జాన్ బోల్టన్, ఆయన టీమ్ ఆ పక్కనే ఉంది. ‘నాకొకటి కావాలి’ అన్నారు కిమ్. ‘అడగండి మీ ఇష్టం’ అన్నారు ట్రంప్. ‘అమెరికా, దక్షిణ కొరియాల మధ్య జరుగుతున్న ఉమ్మడి సైనిక విన్యాసాలను రద్దు చేయాలి’ అన్నారు కిమ్. ‘దాన్దేముందీ.. అలాగే’ అనేశారు ట్రంప్. ఆ దెబ్బకు బోల్టన్ టీమ్ దిమ్మెరపోయింది. ఒకటేదైనా అడిగితే వెంటనే ఇచ్చేయడం దౌత్యధర్మం కాదు. ‘ఇస్తాను సరే మాకేమొస్తుంది?’ అని అడగాలి. ట్రంప్ అడగలేదు. పైగా 60 ఏళ్లకు పైగా అమెరికా, దక్షిణ కొరియాల మధ్య జరుగుతున్న సైనిక విన్యాసాలవి! ఒక్క ‘సరే’తో వాటిని రద్దు చేసి పడేశారు ట్రంప్. ఒక్కమాటైనా తన సెక్యూరిటీ అడ్వైజర్‌ని అడగలేదు. ‘అదేంటి మిస్టర్ ప్రెసిడెంట్ అలా మాట ఇచ్చేశారు’ అని అడ్వైజర్ అడిగితే.. ‘ఈ వార్ గేమ్స్ (విన్యాసాలు) ఎందుకు? అనవసరమైన ఖర్చు కాకపోతే’ అన్నారట ట్రంప్. ఆ మాటను ట్రంప్ పదవి దిగి వెళ్లిపోయాక ‘ట్రంప్ టేక్స్ ఆన్ ది వరల్డ్’ సీరీస్ డైరెక్టర్‌తో షేర్ చేసుకున్నారు జాన్ బోల్టన్. కిమ్‌ని ‘రాకెట్ మ్యాన్’ అని, ఉత్తర కొరియాను ‘ఫైర్ అండ్ ఫ్యూరీ’ అని ముద్దు చేసేవారు ట్రంప్. ఆ విషయాలూ ఈ మూడో ఎపిసోడ్ డాక్యుమెంటరీలో ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ సీరిస్ ముగుస్తున్నా.. ఎప్పటికీ ముగింపు ఉండనన్ని కోణాల్ని ట్రంప్‌లో లేకుండా అయితే పోవు. -
'నిర్భయ డాక్యుమెంటరీపై నిషేధం సరైనదే'
న్యూఢిల్లీ: ఢిల్లీలో పారామెడికల్ విద్యార్థినిపై లైంగికదాడి నేపథ్యంలో బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ)రూపొందించిన వివాదాస్పద డాక్యుమెంటరీ ఇండియా డాటర్స్ పై నిషేధం విధించిన ప్రభుత్వ నిర్ణయం సరైనదేనని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఒకవేళ ఆ డాక్యుమెంటరీని నిషేధించకపోతే ఆ బాధిత మహిళను పదే పదే చూపించడంతో ఆమెను గుర్తుపట్టే ఆస్కారం ఉందని పేర్కొన్నారు. ఆ మహిళకు రక్షణ కల్పించడం తమ ప్రభుత్వ బాధ్యతగా మోదీ స్పష్టం చేశారు. దేశంలోని అన్ని మతాలకు బీజీపీ ప్రభుత్వం సమానమైన రక్షణ కల్పిస్తుందని ఈ సందర్భంగా మోదీ హామీ ఇచ్చారు. -
ఏప్రిల్ 15వరకు బీబీసీ డాక్యుమెంటరీపై నిషేధం
న్యూఢిల్లీ: ఢిల్లీలో పారామెడికల్ విద్యార్థినిపై లైంగికదాడి నేపథ్యంలో బీబీసీ రూపొందించిన వివాదాస్పద డాక్యుమెంటరీ ఇండియా డాటర్‌పై విధించిన నిషేధాన్ని ఏప్రిల్ 15 వరకు ఢిల్లీ హైకోర్టు పొడిగించింది. ఆలోగా దీనికి సంబంధించిన పత్రాలను తమ ముందు ఉంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇండియా డాటర్‌పై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలంటూ రెండు పిల్లు దాఖలైన నేపథ్యంలో వాటిని పరిశీలించిన జస్టిస్ జీ రోహిణి, జస్టిస్ ఆర్ ఎండ్లా ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. ఇండియా డాటర్ను ఇండియాలో ప్రదర్శించకుండా ఉండేలా నిషేధం విధించాలని కేంద్రం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. -
రాంగ్ రూట్లో రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్