SC Dismisses PIL Seeking Ban On BBC Over PM Modi Documentary - Sakshi
Sakshi News home page

మోదీ డాక్యుమెంటరీ వివాదం.. బీబీసీ బ్యాన్‌కు నో చెప్పిన సుప్రీంకోర్టు

Published Fri, Feb 10 2023 1:57 PM | Last Updated on Fri, Feb 10 2023 2:14 PM

SC Dismisses PIL Seeking Ban On BBC Over PM Modi Documentary - Sakshi

సాక్షి, ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ ప్రసారం చేసిన ఓ డాక్యుమెంటరీ రాజకీయం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. కేంద్రం ఆ డాక్యుమెంటరీని, దానికి సంబంధించిన లింకులను భారత్‌లో బ్లాక్‌ చేసింది. దీంతో, ఈ వ్యవహరం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. 

తాజాగా పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అదే సమయంలో భారత్‌లో బీబీసీ ఛానల్ ప్రసారం కాకుండా బ్యాన్ చేయాలని వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. కాగా, ఇండియా ద మోదీ క్వశ్చన్‌ పేరిట బీబీసీ డాక్యుమెంటరీని విడుదల చేసిన విషయం తెలిసిందే.  

ఇక, గుజరాత్ అల్లర్లతో పాటు ప్రధాని మోదీకి సంబంధించిన ఈ డాక్యుమెంటరీ తప్పుదోవ పట్టిస్తోందంటూ కేంద్రం బ్యాన్ విధించింది. సోషల్ మీడియాలోనూ ఎక్కడా ఈ వీడియో క్లిప్‌లు కనిపించకుండా సెన్సార్ విధించింది. ఈ క్రమంలోనే హిందూ సేన అసలు బీబీసీ ఛానల్‌నే సెన్సార్ చేయాలంటూ సుప్రీం కోర్టుని ఆశ్రయించింది. దీనిపై అసహనం వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు చివరకు ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. 

అంతకుముందు అత్యున్నత న్యాయస్థానం.. కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఆ డాక్యుమెంటరీకి సంబంధించిన ఒరిజినల్ రికార్డులను సమర్పించాలని ఆదేశించింది. మూడు వారాల్లో కేంద్రం సమాధానం ఇవ్వాలని తేల్చి చెప్పింది. ఏప్రిల్‌కు విచారణను వాయిదా వేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement