న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ 2002లో గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు జరిగిన గోద్రా అల్లర్లపై బీబీసీ డాక్యుమెంటరీ రూపొందించిన విషయం తెలిసిందే. ఇది పూర్తి దురుద్దేశంతో ఉందని కేంద్రం ఇందుకు సంబంధించిన రెండు వీడియోలను బ్యాన్ చేసింది. యూట్యూబ్, ట్విట్టర్‌లో వీడియో లింకులను బ్లాక్ చేసింది.
తాజాగా కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. బీబీసీ డాక్యుమెంటరీని నిషేధించడం రాజ్యాంగ విరుద్ధమని, ఏకపక్ష నిర్ణయమని సీనియర్ న్యాయవాదులు ఎంఎల్ శర్మ, సీయూ సింగ్ తమ పిటిషన్లలో పేర్కొన్నారు. వీటిని అత్యవసరంగా విచారించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు.
సీనియర్ జర్నలిస్ట్ ఎన్ రామ్, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కూడా బీబీసీ వీడియోలను కేంద్రం బ్లాక్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్లు దాఖలు చేశారు.
సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహా, జస్టిస్ జేబీ పార్దీవాలాతో కూడిన బెంచ్ వీటిని పరిశీలించింది. వీటన్నింటిపై ఫిబ్రవరి 6న విచారణ చేపడతామని చెప్పింది.
చదవండి: చావనైనా చస్తా.. కానీ బీజేపీతో మాత్రం చేతులు కలపను..
Comments
Please login to add a commentAdd a comment