
'నిర్భయ డాక్యుమెంటరీపై నిషేధం సరైనదే'
ఢిల్లీలో పారామెడికల్ విద్యార్థినిపై లైంగికదాడి నేపథ్యంలో బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ)రూపొందించిన వివాదాస్పద డాక్యుమెంటరీ ఇండియా డాటర్స్ పై విధించిన ప్రభుత్వ నిర్ణయం సరైనదేనని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ: ఢిల్లీలో పారామెడికల్ విద్యార్థినిపై లైంగికదాడి నేపథ్యంలో బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ)రూపొందించిన వివాదాస్పద డాక్యుమెంటరీ ఇండియా డాటర్స్ పై నిషేధం విధించిన ప్రభుత్వ నిర్ణయం సరైనదేనని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఒకవేళ ఆ డాక్యుమెంటరీని నిషేధించకపోతే ఆ బాధిత మహిళను పదే పదే చూపించడంతో ఆమెను గుర్తుపట్టే ఆస్కారం ఉందని పేర్కొన్నారు.
ఆ మహిళకు రక్షణ కల్పించడం తమ ప్రభుత్వ బాధ్యతగా మోదీ స్పష్టం చేశారు. దేశంలోని అన్ని మతాలకు బీజీపీ ప్రభుత్వం సమానమైన రక్షణ కల్పిస్తుందని ఈ సందర్భంగా మోదీ హామీ ఇచ్చారు.