మహబూబ్ నగర్లో అక్రమ ఇసుక మాఫియా విషయంలో ఇప్పటి వరకు ఎంతమందిపై చర్యలు తీసుకున్నారని హైకోర్టు ప్రశ్నించింది.
హైదరాబాద్: మహబూబ్ నగర్లో అక్రమ ఇసుక మాఫియా విషయంలో ఇప్పటి వరకు ఎంతమందిపై చర్యలు తీసుకున్నారని హైకోర్టు ప్రశ్నించింది. దీనివెనుక ఎవరెవరున్నారో మొత్తం వివరాలు తేల్చాలంటూ జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది.
మహబూబ్ నగర్లో ఇసుక మాఫియాపై సోమవారం విచారణ చేపట్టిన హైకోర్టు దీనిపై వివరాలు తేల్చాలంటూ పోలీసులను ప్రశ్నించగా.. పన్నెండుమందిపై కేసులు పెట్టామని వారిలో నలుగురిని అరెస్టు చేశామని చెప్పారు. దీంతో మొత్తం వివరాలు తెలియజేయాలని పేర్కొంటూ కేసును రెండు వారాలకు వాయిదా వేసింది.