నవాబ్‌పేట: అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలపై పోలీసులు, రెవెన్యూ సిబ్బంది దాడులు నిర్వహించారు. మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట్ మండలం తిరుమలపూర్ గ్రామం నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు ఒక లారీని, ట్రాక్టర్‌ను పట్టుకుని సీజ్ చేశారు. లారీ యజమానులపై కేసు నమోదు చేశారు.