
ఈసీ పనితీరు అద్భుతం: చిదంబరం
న్యూఢిల్లీ: నైరాశ్యంతోనే వారణాసిలో బీజేపీ ఆందోళనకు దిగిందని కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం అన్నారు. ఓడిపోతామన్న నైరాశ్యంతోనే ఈసీకి వ్యతిరేకంగా బీజేపీ ఆందోళన చేపట్టిందని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం బలహీనమైందన్న వాదనతో ఏకీభవించబోనని చెప్పారు. మొత్తంమీద ఎన్నికల సంఘం పనితీరు గొప్పగా ఉందని కితాబిచ్చారు.
ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉందని చిదంబరం అన్నారు. అధిక వృద్ధితోనే పెట్టుబడుల వస్తాయన్నారు. ఆహార వస్తువుల ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణం పెరుగుతోందన్నారు. ఆర్బీఐ తదుపరి విధాన రేట్ల సమీక్షలో ద్రవ్యోల్బణం, అభివృద్ధి అంశాలను పరిగణనలోకి తీసుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆర్బీఐ గవర్నర్గా రఘురామ్ రాజన్ నియామకాన్ని తదుపరి ప్రభుత్వం తప్పకుండా గౌరవించాలని చిదంబరం సూచించారు.