కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలో ఎన్నికల అనంతరం జరిగిన హింసాకాండ కేసులో సీబీఐ గురువారం చార్జిషీట్ దాఖలు చేసింది. తీవ్రమైన నేరాల దర్యాప్తును కోల్‌కతా హైకోర్టు సీబీఐకి అప్పగించిన తర్వాత ఇదే మొదటి ఛార్జ్‌షీట్ అని అధికార వర్గాలు తెలిపాయి. రాంపూర్‌హాట్ కోర్టుకు సమర్పించిన చార్జిషీట్‌లో బీజేపీ కార్యకర్త హత్యతో సంబంధం ఉన్న ఇద్దరు నిందితుల పేర్లు చేర్చారు. కాగా ఆగస్టు 19న కోల్‌కతా హైకోర్టు హత్య, అత్యాచారం కేసులను సీబీఐ ద్వారా దర్యాప్తు చేయాలని ఆదేశించింది.
చదవండి: రూ.23 లక్షల కోట్లు ఏమయ్యాయి?: రాహుల్ గాంధీ
కేసులపై సీబీఐ దర్యాప్తును ఆదేశించిన హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కాగా ఇప్పటివరకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) బీజేపీ కార్యకర్తలపై హత్య, ఇతర దారుణమైన అఘాయిత్యాలకు పాల్పడిన వారిపై మొత్తం 34 ఎఫ్ఐఆర్‌లను దాఖలు చేసింది. ఇదిలా ఉండగా ఎన్నికల ఫలితాలు ప్రకటించిన కొద్ది సేపటికే సీబీఐ అధికారుల బృందం నగరంలోని కంకుర్గాచి ప్రాంతంలో మరో బీజేపీ పార్టీ కార్యకర్త హత్యకు పాల్పడిన నిందితులను విచారించడానికి ప్రెసిడెన్సీ కరెక్షనల్ హోమ్‌ని సందర్శించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment