సాక్షి, ఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులో ఈడీ దూకుడు పెంచింది. మరోసారి ఈడీ సోదాలు చేపట్టింది. ఢిల్లీ, పంజాబ్, హైదరాబాద్‌లో సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, కూకట్ పల్లి,మాదాపూర్, జూబ్లీహిల్స్‌లో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉదయం ఆరు గంటల నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. పంజాబ్, ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా 35 ప్రదేశాల్లో తనిఖీలు చేపట్టారు. లిక్కర్ కేసులో ఇప్పటికే ఈడీ,సీబీఐ.. ఇద్దరిని అరెస్ట్ చేసింది. లిక్కర్ స్కాం కేసులో గతంలో అరెస్టయిన విజయ్, మహేంద్రు ఇచ్చిన సమాచారం మేరకు ఈడీ సోదాలు జరుపుతుంది.
చదవండి: మునుగోడు టీఆర్‌ఎస్ అభ్యర్థిని ప్రకటించిన సీఎం కేసీఆర్
ఢిల్లీలో డిప్యూటీ సీఎం సిసోడియా అనుచరుడి ఇంట్లో ఈడీ సోదాలు చేపట్టింది. దినేష్ అరోరా నివాసం, ఆఫీసుతో పాటు స్నేహితుల ఇళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. దినేష్ అరోరా అకౌంట్లోకి సమీర్ మహేంద్రు రూ.కోటి బదిలీ చేసినట్లు సమాచారం. ఇప్పటికే దినేష్ అరోరాపై సీబీఐ కేసు నమోదు చేసింది. మనీష్ సిసోడియాకు దినేష్ అరోరా డబ్బులు ఇచ్చినట్లు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment