కాంగ్రెస్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డితో భేటీ.. ఈడీ సోదాలపై ఆరా
పటాన్‌చెరు టౌన్: కాంగ్రెస్ ప్రభుత్వం విపక్ష నేతలను ఇబ్బందులకు గురిచేస్తోందని మాజీ మంత్రి టి.హరీశ్‌రావు ఆరోపించారు. ‘మా పారీ్టలో చేరండి.. లేకుంటే ఇబ్బందులు తప్పవన్న విధంగా వ్యవహరిస్తోంది’అని ఆయన మండిపడ్డారు. శుక్రవారం పటాన్‌చెరులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్‌రెడ్డిని హరీశ్‌రావు కలిశారు. గురువారం జరిగిన ఈడీ సోదాలపై ఆరా తీశారు. అనంతరం విలేకరులతో హరీశ్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిపక్ష ఎమ్మెల్యేలను భయభ్రాంతులకు గురిచేయడమే పనిగా పెట్టుకుందని దుయ్యబట్టారు.
పదవికి రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయించే ఎమ్మెల్యేలపై తక్షణమే అనర్హత వర్తించేలా చట్ట సవరణ చేస్తామంటూ కాంగ్రెస్ మేనిఫెస్టోలో రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని.. కానీ టీ కాంగ్రెస్ నేతలు మాత్రం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకొనేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. మాట వినకపోతే ఆ ఎమ్మెల్యేను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు పెట్టడం, భయభ్రాంతులకు గురిచేస్తూ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం వంటివి చేస్తున్నారన్నారు.
ఈడీ దాడుల్లో దొరికిందేమీ లేదు..
ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఇంట్లో ఈడీ చేపట్టిన సోదాల్లో డబ్బు, బంగారం, ఎలాంటి వస్తువులు అక్రమంగా దొరకలేదని హరీశ్‌రావు చెప్పారు. ఆదాయపన్ను చెల్లిస్తున్న ఎమ్మెల్యే వద్ద ఆదాయ లెక్కలన్నీ పక్కాగా ఉన్నాయని స్పష్టం చేశారు. లీకేజీకి కారణమైన అధికారులపై ఈడీ, ఐటీ ఎందుకు దాడులు చేయట్లేదని నిలదీశారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు మహిపాల్‌రెడ్డి, చింతా ప్రభాకర్, మాణిక్యరావు, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, జెడ్పీ వైస్ చైర్మన్ మంజుశ్రీ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment