
సాక్షి, విజయవాడ: ఎన్ఆర్‌ఐ సొసైటీ, వైద్య కళాశాలలో నిధుల మళ్లింపుపై నమోదైన మనీలాండరింగ్ కేసులో సోదాలపై కీలక ప్రకటన చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. విజయవాడ, కాకినాడ, గుంటూరు, హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు సోదాలు నిర్వహించి మొత్తం 53 చోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు గుర్తించామని పేర్కొంది. నగదు, కీలక పత్రాలు, పలు ఆస్తులను సీజ్ చేసినట్లు తెలిపింది.
‘ నగదు, కీలక పత్రాలు, పలు ఆస్తులు సీజ్ చేశాం. ఎన్‌ఆర్‌ఐ సొసైటీకి చెందిన నిధులను భవన నిర్మాణాల పేరుతో దుర్వినియోగం చేశారు. కోవిడ్ సమయంలో రోగుల నుంచి భారీగా నగదు వసూలు చేశారు. ఆ ఆదాయాన్ని ఎన్‌ఆర్‌ఐ సొసైటీ ఖాతాల్లో చూపించలేదని గుర్తించాము. ఎంబీబీఎస్ విద్యార్థుల దగ్గర పెద్ద మొత్తంలో అడ్మిషన్ల పేరుతో వసూళ్ళు చేశారు. ఇలా వచ్చిన ఆదాయాన్ని దారి మళ్లించారు. ఎన్‌ఆర్‌ఐ సొసైటీ ఖాతా నుండి ఎన్‌ఆర్‌ఐఏఎస్ అనే మరో ఖాతాకు బదిలీ చేసినట్లు గుర్తించాము.’ అని తెలిపింది ఈడీ. ఎన్‌ఆర్‌ఐ సొసైటీలో జరిగిన అవకతవకలపై ఏపీ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది ఈడీ. ఈ కేసులో విజయవాడ, కాకినాడ, గుంటూరు, హైదరాబాద్ ప్రాంతంలో రెండు రోజులుగా సోదాలు నిర్వహించింది.
ఇదీ చదవండి: బీసీలను బెదిరించాడు.. చంద్రబాబు ఆ మాట చెప్పలేకపోతున్నాడు: సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment