NRI deposits
-
ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాల సోదాలపై ఈడీ కీలక ప్రకటన
సాక్షి, విజయవాడ: ఎన్ఆర్ఐ సొసైటీ, వైద్య కళాశాలలో నిధుల మళ్లింపుపై నమోదైన మనీలాండరింగ్ కేసులో సోదాలపై కీలక ప్రకటన చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. విజయవాడ, కాకినాడ, గుంటూరు, హైదరాబాద్లో రెండు రోజుల పాటు సోదాలు నిర్వహించి మొత్తం 53 చోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు గుర్తించామని పేర్కొంది. నగదు, కీలక పత్రాలు, పలు ఆస్తులను సీజ్ చేసినట్లు తెలిపింది. ‘ నగదు, కీలక పత్రాలు, పలు ఆస్తులు సీజ్ చేశాం. ఎన్ఆర్ఐ సొసైటీకి చెందిన నిధులను భవన నిర్మాణాల పేరుతో దుర్వినియోగం చేశారు. కోవిడ్ సమయంలో రోగుల నుంచి భారీగా నగదు వసూలు చేశారు. ఆ ఆదాయాన్ని ఎన్ఆర్ఐ సొసైటీ ఖాతాల్లో చూపించలేదని గుర్తించాము. ఎంబీబీఎస్ విద్యార్థుల దగ్గర పెద్ద మొత్తంలో అడ్మిషన్ల పేరుతో వసూళ్ళు చేశారు. ఇలా వచ్చిన ఆదాయాన్ని దారి మళ్లించారు. ఎన్ఆర్ఐ సొసైటీ ఖాతా నుండి ఎన్ఆర్ఐఏఎస్ అనే మరో ఖాతాకు బదిలీ చేసినట్లు గుర్తించాము.’ అని తెలిపింది ఈడీ. ఎన్ఆర్ఐ సొసైటీలో జరిగిన అవకతవకలపై ఏపీ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది ఈడీ. ఈ కేసులో విజయవాడ, కాకినాడ, గుంటూరు, హైదరాబాద్ ప్రాంతంలో రెండు రోజులుగా సోదాలు నిర్వహించింది. ఇదీ చదవండి: బీసీలను బెదిరించాడు.. చంద్రబాబు ఆ మాట చెప్పలేకపోతున్నాడు: సీఎం జగన్ -
రిటైల్ డైరెక్ట్ స్కీమ్కు ఎన్ఆర్ఐల నుంచి భారీ స్పందన
ముంబై: ప్రభుత్వ సెక్యూరిటీ మార్కెట్లో రిటైల్ మదుపర్లు పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తూ భారతీయ రిజర్వ్ బ్యాంకు(ఆర్బీఐ) రూపొందించిన రెండు కీలక పథకాలను ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 12న ప్రారంభించిన సంగతి తేలిసిందే. అయితే, ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైల్ డైరెక్ట్ పథకం కింద ఖాతాలను తెరవడానికి ప్రవాస భారతీయుల నుంచి గణనీయమైన స్పందన వస్తుంది. "యుఎస్, యుకె, సింగపూర్, దుబాయ్ దేశాలతో సహ ఇతర దేశాలలో ఉన్న ఎన్ఆర్ఐ పెట్టుబడిదారుల నుంచి మాకు చాలా ప్రశ్నలు వస్తున్నాయని సినెర్గీ క్యాపిటల్ మేనేజింగ్ డైరెక్టర్ విక్రమ్ దలాల్ చెప్పారు. ఎన్ఆర్ఐలు తమ ఎన్ఆర్ఓ బ్యాంకు ఖాతాల ద్వారా ఈ ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేయవచ్చు. తమ తల్లిదండ్రుల ఖర్చుల కోసం లేదా భారతదేశంలో తమ ఆస్తిని పెంపొందించుకోవడానికి రిటైల్ డైరెక్ట్ పథకం వంటి దీర్ఘకాలిక రుణాల నుంచి స్థిరమైన ఆదాయ కోసం చూస్తున్న ఎన్ఆర్ఐలు ఈ బాండ్లను కొనుగోలు చేయాలని కోరుకుంటున్నారని దలాల్ తెలిపారు. కేంద్ర బ్యాంకు ఆర్బీఐ ప్రకటించిన రిటైల్ డైరెక్ట్ స్కీమ్ కింద ఒక ఎన్ఆర్ఐ విదేశాల్లో కూర్చొని తన ఖాతాను తేరిచి ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేయవచ్చు. అభివృద్ధి చెందిన దేశాలలో వడ్డీ రేట్లు కేవలం 1-2% పరిధిలో ఉన్నందున, భారత ప్రభుత్వం బాండ్లపై ఇస్తున్న 6.5-7% వడ్డీ రేట్లు పెట్టుబడిదారులను ఆకర్షిస్తుంది అని అన్నారు. (చదవండి: అదిరే ఫీచర్లతో 5జీ ఫోన్, చేతులు కలిపిన జియో - షావోమీ!) రిటైల్ డైరెక్ట్ స్కీమ్ పేరిట వచ్చిన ఈ పథకం ద్వారా ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడి పెట్టేందుకు రిటైల్ మదుపర్లకు కొత్త మార్గం లభించనుంది. అలాగే మదుపర్లు ఉచితంగా ఆర్బీఐ వద్ద ఆన్లైన్లో సులభంగా తమ ప్రభుత్వ సెక్యూరిటీ ఖాతాను తెరిచి నిర్వహించుకోవచ్చు. అలాగే డిజిటల్ ప్లాట్ఫామ్లో ప్రభుత్వ సెక్యూరిటీలను కొనొచ్చు, విక్రయించవచ్చు. "ఈ బాండ్లు స్థిరమైన రిటర్న్స్ ఇస్తాయి కాబట్టి మీరు ప్రతి నెల కచ్చితంగా వడ్డీ లభిస్తుంది. అలాగే, మీరు అన్ని పెట్టుబడులను ఆన్లైన్లో నిర్వహించవచ్చు" అని రూంగ్టా సెక్యూరిటీస్ చీఫ్ ఫైనాన్షియల్ ప్లానర్ హర్షవర్ధన్ రూంగ్టా అన్నారు. (చదవండి: Paytm ఢమాల్.. రెండు రోజుల్లో పదివేల కోట్ల లాస్!) -
1.7 శాతం పెరిగిన భారత్ విదేశీ రుణ భారం
న్యూఢిల్లీ: భారత్ విదేశీ రుణ భారం ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య 1.7 శాతం పెరిగింది. మార్చి 2015 ముగింపుతో పోల్చితే, సెప్టెంబర్ వరకూ గడచిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆరు నెలల కాలంలో విదేశీ రుణం 8 బిలియన్ డాలర్లు పెరిగి 483.2 బిలియన్ డాలర్లకు చేరిందని గురువారం విడుదలైన గణాంకాలు తెలిపాయి. వాణిజ్య రుణాల వంటి దీర్ఘకాలిక విదేశీ రుణం, ఎన్ఆర్ఐ డిపాజిట్లు పెరగడం విదేశీ రుణం పెరగడానికి కారణమని ఆర్థిక శాఖ పేర్కొంది. -
ఎన్ఆర్ఐ డిపాజిట్ల వెల్లువ
న్యూఢిల్లీ: దేశానికి ప్రవాస భారతీయుల (ఎన్ఆర్ఐ) డిపాజిట్లు భారీగా పెరుగుతున్నాయని ప్రముఖ ఎన్ఆర్ఐ పారిశ్రామికవేత్త లార్డ్ స్వరాజ్ పాల్ పేర్కొన్నారు. గడచిన ఆరు నెలల కాలంలో దేశానికి 65 బిలియన్ డాలర్ల ఎన్ఆర్ఐ డిపాజిట్లు వచ్చినట్లు పాల్ తెలిపారు. తద్వారా దేశాభివృద్ధిలో వారు కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ సోమవారం రాత్రి ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ తన గౌరవార్థం నిర్వహించిన ఒక విందు కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. దేశాభివృద్ధిలో ఎన్ఆర్ఐల తోడ్పాటును ప్రజలు మరవడం తగదని అన్నారు. భారత వోటర్లు ఎటువంటి ప్రలోభాలకూ లోనుకాకుండా తమ వోటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల నేపథ్యంలో ఆయన పిలుపునిచ్చారు. దేశం అన్ని రంగాల్లో విజయం సాధించడానికి రాజకీయ పార్టీలు విద్య, పేదరిక నిర్మూలన వంటి అంశాలకు ప్రాధాన్యతను ఇవ్వాలని సూచించారు.