న్యూఢిల్లీ: భారత్ విదేశీ రుణ భారం ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య 1.7 శాతం పెరిగింది. మార్చి 2015 ముగింపుతో పోల్చితే, సెప్టెంబర్ వరకూ గడచిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆరు నెలల కాలంలో విదేశీ రుణం 8 బిలియన్ డాలర్లు పెరిగి 483.2 బిలియన్ డాలర్లకు చేరిందని గురువారం విడుదలైన గణాంకాలు తెలిపాయి. వాణిజ్య రుణాల వంటి దీర్ఘకాలిక విదేశీ రుణం, ఎన్‌ఆర్‌ఐ డిపాజిట్లు పెరగడం విదేశీ రుణం పెరగడానికి కారణమని ఆర్థిక శాఖ పేర్కొంది.