సాక్షి, హైదరాబాద్: మహేష్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌లో భారీ అక్రమాలు బయటపడుతున్నాయి. రెండు రోజుల పాటు మహేష్ బ్యాంక్‌లో ఈడీ సోదాలు చేపట్టింది. రూ. కోటి నగదుతో పాటు రూ.5 కోట్ల విలువైన ఆభరణాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనర్హులకు రూ.300 కోట్ల రుణాలు ఇచ్చినట్లు ఈడీ గుర్తించింది. 1800 మందికి డమ్మీ గోల్డ్‌లోన్స్ ఇచ్చినట్లు ఈడీ తేల్చింది.
పలు రుణాలకు తక్కువ వడ్డీ వసూలు చేసినట్లు గుర్తించని ఈడీ.. రుణాలన్నీ బినామీల పేర్లతో కుటుంబసభ్యులే తీసుకున్నట్లు నిర్థారణ అయ్యింది. బ్యాంక్‌లోని డబ్బు వివిధ మార్గాల ద్వారా పక్కదారి పట్టిందని ఈడీ వెల్లడించింది. తప్పుడు ఆస్తి పత్రాలతో భారీ రుణాలు మంజూరు చేయడంతో పాటు.. వక్ఫ్‌బోర్డ్‌కు చెందిన పలు ఆస్తులకు లోన్స్ ఇచ్చారని.. బ్యాంక్ అక్రమాలపై విచారణ కొనసాగుతోందని ఈడీ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment