Huge irregularities
-
ఈడీ రైడ్స్.. మహేష్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌లో భారీ అక్రమాలు
సాక్షి, హైదరాబాద్: మహేష్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌లో భారీ అక్రమాలు బయటపడుతున్నాయి. రెండు రోజుల పాటు మహేష్ బ్యాంక్‌లో ఈడీ సోదాలు చేపట్టింది. రూ. కోటి నగదుతో పాటు రూ.5 కోట్ల విలువైన ఆభరణాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనర్హులకు రూ.300 కోట్ల రుణాలు ఇచ్చినట్లు ఈడీ గుర్తించింది. 1800 మందికి డమ్మీ గోల్డ్‌లోన్స్ ఇచ్చినట్లు ఈడీ తేల్చింది.పలు రుణాలకు తక్కువ వడ్డీ వసూలు చేసినట్లు గుర్తించని ఈడీ.. రుణాలన్నీ బినామీల పేర్లతో కుటుంబసభ్యులే తీసుకున్నట్లు నిర్థారణ అయ్యింది. బ్యాంక్‌లోని డబ్బు వివిధ మార్గాల ద్వారా పక్కదారి పట్టిందని ఈడీ వెల్లడించింది. తప్పుడు ఆస్తి పత్రాలతో భారీ రుణాలు మంజూరు చేయడంతో పాటు.. వక్ఫ్‌బోర్డ్‌కు చెందిన పలు ఆస్తులకు లోన్స్ ఇచ్చారని.. బ్యాంక్ అక్రమాలపై విచారణ కొనసాగుతోందని ఈడీ అధికారులు తెలిపారు. -
‘పీవోటీ’ని ఉల్లంఘించి థర్డ్ పార్టీలకు ప్లాట్లు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి భూ సమీకరణ ప్రక్రియలో పీవోటీ (ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్) చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘిస్తూ ఎస్సీలు, ఇతర బలహీన వర్గాలు సాగు చేసుకునేందుకు ఇచ్చిన వ్యవసాయ భూములకు బదులుగా కొందరు థర్డ్ పార్టీ వ్యక్తులకు ప్లాట్ల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు విచారణలో నిర్ధారణ అయిందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ‘రాజధాని అమరావతి’పై సోమవారం శాసనమండలిలో జరిగిన స్వల్పకాలిక చర్చలో మంత్రి బొత్స మాట్లాడారు. అసైన్డ్ భూమి కలిగి ఉన్న వ్యక్తులు తెల్ల కాగితంపై సంతకం చేసి ఇచ్చినా ప్రామాణికంగా తీసుకొని ఆ భూమికి బదులుగా థర్డ్ పార్టీ వ్యక్తులకు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసేందుకు సీఆర్డీఏ అనుమతిచ్చిందని, ఇది పూర్తిగా పీవోటీ చట్టాన్ని ఉల్లంఘించడమేనన్నారు. 455 మంది అసైన్డ్ రైతులకు సంబంధించి 289 ఎకరాల భూమికి బదులుగా 1,68,300 చదరపు అడుగుల మేర ప్లాట్లు ధర్డ్ పార్టీ వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్ జరిగినట్లు ఇప్పటివరకు జరిగిన విచారణలో తేలిందన్నారు. కమిటీ సూచనల ప్రకారమే నిర్ణయం భూ సమీకరణలో పీవోటీ చట్టాన్ని ఉల్లంఘించి గత ప్రభుత్వం ఎస్సీ, బలహీన వర్గాలకు చేసిన అన్యాయాలను సరిదిద్దేందుకు అలాంటి రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని బొత్స చెప్పారు. గుంటూరు– విజయవాడ మధ్య ఉండే సారవంతమైన భూముల్లో రాజధాని ఏర్పాటు సరైంది కాదని శివరామకృష్ణ కమిటీ స్పష్టంగా సూచించిందని బొత్స గుర్తు చేశారు. అది భవన నిర్మాణాలకు అనువైన ప్రాంతం కాదని కూడా కమిటీ సూచించిందని, ఆ కమిటీ చెప్పినట్టే తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణానికి 102 అడుగుల మేర పునాదులు వేయాల్సి రావడం వాస్తవం కాదా? అని బొత్స ప్రశ్నించారు. అభివృద్ధి ప్రణాళికల సమీక్ష, రాజధానితోపాటు మొత్తం రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం సమగ్ర వ్యూహాలను సూచించేందుకు నలుగురు నిపుణులతో కమిటీని నియమించినట్లు మంత్రి వివరించారు. రిటైర్డ్ ఐఏఎస్ జీఎన్ఆర్ కన్వీనర్‌గా ఏర్పాటైన నిపుణుల కమిటీ సూచనలకు అనుగుణంగానే రాజధానిపై ఏ నిర్ణయమైనా ఉంటుందని మంత్రి వివరించారు. దురాక్రమణ, అవినీతి, దోపిడీ సీఆర్డీఏ పరిధిలోని మొత్తం 2,600 ఎకరాల అసైన్డ్ భూములపై విచారణ కొనసాగుతుందని బొత్స స్పష్టం చేశారు. సీఆర్డీఏ పరిధిని మొదట 217 చదరపు కిలోమీటర్లగా నిర్ధారించి తర్వాత చంద్రబాబు వియ్యంకుడికి భూ కేటాయింపులపై గత ప్రభుత్వం జీవో విడుదల చేశాక వారికి ప్రయోజనం చేకూర్చేలా సీఆర్డీఏ పరిధిని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. అమరావతిలో దురాక్రమణ, అవినీతి, దోపీడీ జరిగిందని చెప్పారు. -
పరి‘ఛీ’లన
సాక్షి, సంగారెడ్డి: అనుకున్నట్లే జరిగింది. సొసైటీల అక్రమాలకు ఎప్పటిలాగే జిల్లా సహకార శాఖ అధికారులు వంత పాడారు. భారీ అవకతవకతలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వెల్దుర్తి ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం (పీఏసీఎస్) పాలకవర్గానికి జిల్లా సహకార శాఖ అధికారులు క్లీన్ చీట్ ఇచ్చారు. ఆరోపణల తీవ్రత రీత్యా సమగ్ర విచారణ జరపకుం డానే కేవలం ‘పరిశీలన’తో సరిపెట్టుకున్నారు. పాలకవర్గం మాటలు నమ్మి మోసపోయిన బాధిత రైతులను కనీసం సంప్రదించకుండానే పరిశీలన తంతును సైతం తూతూమంత్రంగా ముగించేశారు. అసలు అక్రమాలేవి జరగలేదని నిగ్గు తేల్చేసి కళ్లకు గంతలు కట్టారు. వెల్దుర్తి పీఏసీఎస్‌పై జిల్లా సహకార శాఖ జరిపిన ఉత్తుత్తి పరిశీలనపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. కక్కుర్తి నేపథ్యం.. ఓ ప్రైవేటు కంపెనీలో బీమా చేయించుకుంటేనే రుణాలు చెల్లిస్తామని వెల్దుర్తి పీఏసీఎస్ మెలిక పెట్టి మరీ రైతుల ద్వారా ప్రీమియం కట్టించుకుంది. 2007-10 మధ్యకాలంలో సుమారు 300 మంది రైతులు రూ.20 లక్షల వరకు బీమా ప్రీమియాన్ని చెల్లించారు. ఆ సమయంలో వెల్దుర్తి పీఏసీఎస్ చైర్మన్ టి. అనంతరెడ్డి కుమారుడు టి. నరేందర్ రెడ్డి స్థానికంగా మ్యాక్స్ లైఫ్ న్యూయార్క్ ఇన్సూరెన్స్ కంపెనీ సేల్స్ రిప్రజెంటేటివ్‌గా పనిచేశారు. ఈ క్రమంలో బీమా వ్యాపారాన్ని పెంచుకోవడానికి పీఏసీఎస్‌ను సదరు బీమా సం స్థ కార్యాలయంగా మార్చేశారు. రుణ మొత్తం ఆధారంగా ఒక్కోక్కరి నుంచి రూ.1000 నుంచి రూ.10 వేల వరకు మినహాయించుకుని ప్రీమియంగా కట్టించుకున్నారు. ఒక్కో బీమాపై 10 నుంచి 30 శాతం వరకు కమీషన్‌ను బీమా సంస్థ నుంచి పొందారు. గతేడాది బీమా కాలపరిమితి మించిపోయినా పునరుద్ధరించకుండా గప్‌చుప్‌గా ఉండిపోయారు. దీంతో రైతులు కట్టిన ప్రీమి యం ఉత్తిపుణ్యానికి బీమా సంస్థ జేబుల్లోకి వెళ్లిపోయింది. ఈ వ్యవహారంపై గతేడాది ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అప్పటి కలెక్టర్ దినకర్ బాబు విచారణకు ఆదేశించారు. జిల్లా సహకార శాఖాధికారి సాయికృష్ణుడు కలెక్టర్ ఉత్తర్వులకు భిన్నంగా పరిశీలన జరిపిం చారు. మెదక్ డివిజన్ సహకార అధికారి కార్యాలయ అసిస్టెంట్ రిజిస్ట్రార్ డీ చంద్రశేఖర్‌ను గత సెప్టెంబర్ 12న పరిశీలన అధికారిగా నియమించారు. ఆయన ఇటీవల సమర్పించిన నివేదికలోని సారాంశం ఇలా ఉంది. ఆరోపణ: బీమా పేరుతో అక్రమ వసూళ్లు పరిశీలన నివేదిక: సొసైటీలో ప్రత్యేక కౌంటర్ పెట్టి బీమా వసూలు చేసే అంశంపై ఉద్యోగులు, పాలకవార్గనికి నోటిసులు జారీ చేశాం. డీసీసీబీ బ్యాంక్ సర్క్యులర్ మేరకే కౌంటర్ ఏర్పాటు చేసి రైతులను బీమా సంస్థకు పరిచయం చేయడానికి పరిమితమయ్యామని సమాధానమిచ్చారు. సొసైటీ అధ్యక్షుడు, సిబ్బందిని విచారించిన తర్వాత సొసైటీ సిబ్బంది బీమా సంస్థ తరఫున అనధికారికంగా ప్రీమియం వసూలు చేయలేదని తేలింది. ఆరోపణ: రుణమాఫీ పథకం-2008 అమలులో సైతం అక్రమాలు జరిగాయి. రుణాలు ఇచ్చే సమయంలో నిబంధనల మేరకు 10 శాతం మొత్తాన్ని సొసైటీలో రైతు వాటాగా మినహాయించకుంటారు. రుణ మాఫీ తర్వాత ఈ 10 శాతం వాటాలను రైతులకు తిరిగి చెల్లించలేదు. పరిశీలిన నివేదిక: రుణ మాఫీ కింద లబ్ధిపొందిన రైతులకు వారి 10 శాతం వాటా ధనాన్ని తిరిగి చెల్లించలేదని సంబంధించిన రికార్డులను పరిశీలించగా తేలింది. లబ్ధిదారులు ఎవరైనా వచ్చి రాతపూర్వకంగా వాటా ధనం అడిగితే చెల్లిస్తామని సొసైటీ యాజమాన్యం సమాధానం ఇచ్చింది. సొసైటీలో రుణ మాఫీ పథకం అమలుపై శాఖపరమైన ఆడిట్ జరిపిన ఆడిటర్లు ఎలాంటి అభ్యంతరాలు తెలపలేదు. ఆరోపణ: మాజీ సీఈఓ వి.నర్సింహ రెడ్డి అనధికార పెత్తనం పరిశీలన నివేదిక: వెల్దుర్తి పీఏసీఎస్‌లో సీఈఓగా పనిచేసిన నర్సింహ రెడ్డి డీసీసీబీ తూప్రాన్ శాఖకు బదిలీ అయ్యారు. ఆయన తరుచుగా సొసైటీని సందర్శించి రికార్డుల నిర్వహణ విషయంలో సిబ్బందికి సహకరించే వారు. సొసైటీ మెలు కోరే ఆయనీ సేవలందించారు. అందుకు ఈ విషయంపై తదుపరి విచారణ అవసరం లేదు. ఆరోపణ: వెల్దుర్తి సొసైటీలో 2009-13 మధ్యకాలంలో ఎన్నో ఆర్థిక అవకతవకతలు జరిగాయి. పరిశీలన నివేదిక: పైన పేర్కొన్న విషయాలు మినహా .. 2009-13 మధ్యకాలంలో సొసైటీ జరిపిన లావాదేవీలపై పరిశీలన జరపగా ఎలాంటి అక్రమాలు జరగలేదని తేలింది.