రియల్టీ రంగ దిగ్గజ సంస్థ అయిన డీఎల్‌ఎఫ్ కార్యాలయంలో ఈడీ సోదాలు జరిగినట్లు మీడియా కథనాల ద్వారా తెలిసింది. మనీలాండరింగ్ కేసులో డీఎల్‌ఎఫ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించింది.
నోయిడాలోని ప్రాజెక్ట్‌లను పూర్తి చేయకుండా గురుగ్రామ్‌లో ఆస్తులు కొనుగోలు చేయడానికి సూపర్‌టెక్ గ్రూప్ నిధులు సేకరించింది. సంస్థ ఛైర్మన్ రామ్ కిషోర్ అరోరా గృహ కొనుగోలుదారులు, బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.638 కోట్లను మళ్లించారని ఈడీ జూలైలో పేర్కొంది. అయితే సూపర్‌టెక్ గ్రూప్‌తో డీఎల్‌ఎఫ్ సంస్థకు సంబంధం ఉండడంతో ఈడీ సోదాలు చేసినట్లు సమాచారం.
ఈ సోదాలు శనివారం ఉదయం ముగిశాయని, ఈ సందర్భంగా ఈడీ అధికారులు కొన్ని పత్రాలను పరిశీలించారని చెప్పారు. అయితే సూపర్‌టెక్‌కు సంబంధించి డీఎల్‌ఎఫ్ ఏ మేరకు సహకరించింది, ఎలాంటి ఆధారాలు లభ్యమయ్యాయో వివరించలేదు.
ఇదీ చదవండి: సాయంత్రం 5 దాటితే కష్టాలే.. ఆ నగరాల్లో దారుణమైన ట్రాఫిక్!
ఈ కేసులో ఇప్పటివరకు సుమారు రూ.638.93 కోట్లు నిధులు మళ్లించారని ఈడీ తెలిపింది. దీన్ని సూపర్‌టెక్ గ్రూప్, దాని ప్రమోటర్లు/ డైరెక్టర్లు తమ గ్రూప్ కంపెనీల ద్వారా తక్కువ ధర ఉన్న భూమిని కొనుగోలు చేసేందుకు ఈ డబ్బును వినియోగించినట్లు ఈడీ వివరించింది. 2013-14లో సర్వ్ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని కొనుగోలు చేయడానికి కస్టమర్‌లు, బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణం మొత్తం రూ.444 కోట్లు వినియోగించారని ఈడీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment