ఖమ్మం హవేలి, న్యూస్‌లైన్: రాజన్న కుమార్తె, వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఈనెల 13వ తేదీ నుంచి జిల్లాలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నట్లు వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పాయం వెంకటేశ్వర్లు, పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం షర్మిల పర్యటనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. 13వ తేదీ సాయంత్రం 4గంటలకు కూసుమంచిలో నిర్వహించనున్న సభలో షర్మిల ప్రసంగిస్తారు.
5గంటలకు తిరుమలాయపాలెం, 6గంటలకు ఖమ్మం రూరల్ మండలం పెద్దతండలో ప్రచారం నిర్వహిస్తారు. 14వ తేదీ ఉదయం 9గంటలకు రఘునాధపాలెం మండలం మంచుకొండలో, 10గంటలకు కారేపల్లి, 11గంటలకు గార్ల, సాయంత్రం 4గంటలకు టేకులపల్లి, 5గంటలకు పాల్వంచ, రాత్రి 7గంటలకు మణుగూరులో రోడ్‌షో ద్వారా ప్రచారం నిర్వహిస్తారు. 15వ తేదీ ఉదయం 9గంటలకు అశ్వాపురం, 10గంటలకు బూర్గంపాడు మండలం సారపాక, 11గంటలకు భద్రాచలం, సాయంత్రం 5గంటలకు ములకలపల్లి, రాత్రి 7గంటలకు దమ్మపేటల్లో రోడ్‌షో ద్వారా షర్మిల ప్రచారం నిర్వహిస్తారని, ఈ పర్యటనను విజయవంతం చేయాలని పాయం, పొంగులేటి పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.
13 నుంచి జిల్లాలోషర్మిల పర్యటన
Published Sat, Apr 12 2014 2:00 AM | Last Updated on Wed, Aug 8 2018 5:33 PM
Advertisement
Advertisement