అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, అమరావతి: గ్రామస్థాయిలోనే పంటల సేకరణకు ఆయా శాఖల అధికారులు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. జిల్లాల్లో వ్యవసాయం.. దాని అనుబంధ రంగాలను ఒక జేసీకి అప్పగించాలన్నారు. అలాగే, ప్రతీరోజూ వ్యవసాయ రంగం పరిస్థితులను సమీక్షించాలని సూచించారు. మార్కెట్ ఇంటెలిజెన్స్ యాప్‌పై మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు.
► గతంలో సీఎం సూచనల మేరకు మార్కెట్ ఇంటెలిజెన్స్ యాప్‌లో మార్పులు చేర్పులు చేసిన అధికారులు దాని పనితీరు గురించి వైఎస్ జగన్‌కు వివరించారు.
► ఈ యాప్‌కు కాంప్రహెన్సివ్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్‌మెంట్ (సీఎం ఏపీపీ) గా నామకరణం చేశారు.
► జిల్లాల్లో వ్యవసాయం, అనుబంధ రంగాలు చూస్తున్న జేసీలు అందరికీ ఈ యాప్‌పైన అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించారు.
► పంటల సేకరణ విధానాల్లో ఏమైనా లోపాలుంటే వాటిని క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఫుల్‌స్టాప్ పెట్టాలని వైఎస్ జగన్ స్పష్టంచేశారు.
► ఈ నెల 30న రైతుభరోసా కేంద్రాలు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు.
కాగా, సమీక్షా సమావేశంలో ఏపీ వ్యవసాయ మిషన్ వైస్‌చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment