ఆరేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయిన వడ్లమాని నరేశ్ అనే వికలాంగుడు బుధవారం సీఎం కేసీఆర్‌ను క్యాంపు కార్యాలయంలో కలసి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు.
జన్మదినం సందర్భంగా బొకే ఇచ్చిన వికలాంగుడు
సాక్షి, హైదరాబాద్: ఆరేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయిన వడ్లమాని నరేశ్ అనే వికలాంగుడు బుధవారం సీఎం కేసీఆర్‌ను క్యాంపు కార్యాలయంలో కలసి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. నిజామాబాద్ జిల్లా దోమకుంటకు చెందిన నరేశ్.. సీఎంపై అభిమానంతో శుభాకాంక్షలు చెప్పేందుకు హైదరాబాద్‌కు వచ్చారు. నరేశ్ అందించిన పుష్పగుచ్ఛాన్ని ప్రేమపూర్వకంగా స్వీకరించిన సీఎం.. ఏమ్మా.. ఏమైనా సమస్యలున్నాయా.. అంటూ ఆప్యాయంగా పలకరించారు. కూలీనాలీ చేసుకునే తల్లిదండ్రులపై తనతోపాటు మరో ముగ్గురు చెల్లెళ్లు ఆధారపడి ఉన్నారని నరేశ్ చెప్పగా, వివరాలు సేకరించి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సీఎం అధికారులను ఆదేశించారు. కేసీఆర్ తక్షణమే స్పందించి, తమపై ఔదార్యం చూపడంపై నరేశ్, అతని వెంట వచ్చిన సోదరి ఆనందం వ్యక్తం చేశారు.