డీఎస్సీ అభ్యర్థులను ఈడ్చేశారు | dsc candidates agitation in front of cm camp office | Sakshi
Sakshi News home page

డీఎస్సీ అభ్యర్థులను ఈడ్చేశారు

Published Mon, Dec 21 2015 12:05 PM | Last Updated on Tue, Aug 21 2018 5:52 PM

డీఎస్సీ అభ్యర్థులను ఈడ్చేశారు - Sakshi

డీఎస్సీ అభ్యర్థులను ఈడ్చేశారు

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీస్ ఎదుట 2014 డీఎస్సీ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే తమకు ఫోస్టింగ్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా భారీగా మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు.

అభ్యర్థులను బలవంతంగా ఈడ్చుకెళుతూ వ్యానుల్లో పడేశారు. అక్రమ అరెస్టులు చేశారు. ఈ క్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. 2014లో ఏపీ సర్కారు డీఎస్సీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఫలితాలు ప్రకంటించిన ప్రభుత్వం ఇప్పటి వరకు నియామకాల ప్రక్రియ ప్రారంభించకపోవడంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డీవైఎఫ్‌ఐ, 2014 డీఎస్సీ సాధన సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో వందలాదిగా అభ్యర్థులు పాల్గొన్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement