‘పీఎం ట్రోఫీ’ విజేతలకు సీఎం అభినందన | CM YS Jagan congratulated the NCC cadets who won PM Trophy | Sakshi
Sakshi News home page

‘పీఎం ట్రోఫీ’ విజేతలకు సీఎం అభినందన

Published Sat, Feb 6 2021 5:02 AM | Last Updated on Sat, Feb 6 2021 5:02 AM

CM YS Jagan congratulated the NCC cadets who won PM Trophy  - Sakshi

సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన ఎన్‌సీసీ కేడెట్లు, అధికారులు

సాక్షి, అమరావతి: రిపబ్లిక్‌ డే పరేడ్‌ పీఎం ట్రోఫీ అవార్డును గెలుచుకున్న ఎన్‌సీసీ కేడెట్లను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో శుక్రవారం వారు సీఎం వైఎస్‌ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఎన్‌సీసీ కేడెట్లు శ్రేయాసి భక్త, ఎ.శ్రీసాయిప్రియ, రొంగలి భార్గవి, చిలకపాటి జ్యోత్స ్న, ఎ.హరిప్రసాద్, బి.భరత్‌నాయక్, డీడీ నాగసురేష్, వి.రామ్‌ప్రశాంత్, పి.సతీష్ కుమార్‌రెడ్డిలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని సీఎం అందజేశారు. 2020–21 సంవత్సరం రిపబ్లిక్‌ డే వేడుకల్లో ప్రైమ్‌ మినిస్టర్‌ ఛాంపియన్‌షిప్‌ బ్యానర్‌ను ఏపీ, తెలంగాణ ఎన్‌సీసీ డైరెక్టరేట్‌ గెలుచుకుంది.

ఈ సందర్భంగా ఎన్‌సీసీ కేడెట్లతో పాటు సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన వారిలో యూత్‌ సర్వీసెస్‌ అండ్‌ స్పోర్ట్స్‌ ముఖ్య కార్యదర్శి కె.రామ్‌గోపాల్, ఏపీ, తెలంగాణ ఎన్‌సీసీ డైరెక్టరేట్‌ డీడీజీ ఎయిర్‌ కమాండర్‌ టీఎస్‌ఎస్‌ కృష్ణన్, డైరెక్టర్‌ కల్నల్‌ ఎస్‌ నాగ్, గ్రూప్‌ కమాండర్‌ (కాకినాడ) కల్నల్‌ కేవీ శ్రీనివాస్, స్టేషన్‌ కమాండర్‌ (విజయవాడ) కల్నల్‌ నితిన్‌ శర్మ, కమాండింగ్‌ ఆఫీసర్‌ గ్రూప్‌ కెపె్టన్‌ పంకజ్‌ గుప్తా, తదితరులు ఉన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement