
సాక్షి, తాడేపల్లి : రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిపై చర్చించేందుకు ఏర్పాటైన హైపవర్ కమిటీ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో సమావేశం కానుంది. సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది. రాజధాని రైతుల సమస్యలపై హైపవర్ కమిటీ సభ్యులు సీఎం వైఎస్ జగన్‌తో చర్చించనున్నారు. ఇప్పటికే జీఎన్ రావు, బీసీజీ నివేదికలను హైపవర్ కమిటీ పరిశీలించిన సంగతి తెలిసిందే. మూడు సార్లు సమావేశమైన కమిటీ సభ్యులు రెండు నివేదికలపై విస్తృతంగా చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే రేపు చివరిసారిగా సీఎం వైఎస్ జగన్‌తో హైపవర్ కమిటీ భేటీ కానుంది. కాగా, పరిపాలన వికేంద్రీకరణపై ఈ నెల 20న ఏపీ అసెంబ్లీలో విస్తృతంగా చర్చ జరిగే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment