
హైదరాబాద్: తెలంగాణ సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద ఓ వ్యక్తి హల్‌చల్ సృష్టించాడు. మంచిర్యాలలో తన కేబుల్ నెట్‌వర్క్‌ను ఆక్రమించారంటూ ఆరోపించిన రవీందర్ అనే వ్యక్తి వీరంగం చేశాడు. తాను ఫిర్యాదు చేసినా ఎంపీ,ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదంటూ సీఎం క్యాంప్ ఆఫీస్‌కే వచ్చేశాడు.
క్యాంప్ ఆఫీస్ వద్ద ఆత్మహత్య చేసుకుంటానంటూ హడావుడి చేశాడు. తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ బాటిల్‌ను చూపిస్తూ ఆత్మహత్యకు పాల్పడతానంటూ పేర్కొనడంతో అక్కడ కలకలం రేగింది. దాంతో సమాచారం అందుకున్న పంజాగుట్ట పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.