ప్రజల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేసిన అభయ గోల్డ్ సంస్థ నుంచి తమకు రావాల్సిన బకాయిలు ఇప్పించాలంటూ బాధితులు మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
విజయవాడ : ప్రజల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేసిన అభయ గోల్డ్ సంస్థ నుంచి తమకు రావాల్సిన బకాయిలు ఇప్పించాలంటూ బాధితులు మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న వారు.. చంద్రబాబు క్యాంపు కార్యాలయంలోనే ఉన్నారని తెలుసుకుని కలవడానికి వెళ్లారు.
అయితే అప్పటికే ఆయన చిత్తూరు జిల్లా పర్యటనకు బయలుదేరబోతుండగా వారిని పోలీసులు లోపలికి అనుమతించలేదు. ఈలోగా సీఎం వెళ్లిపోయారు. దీంతో వారంతా కార్యాలయం వద్ద ఫ్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి తమకు పూర్తి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.