చంద్రబాబు నాయుడుకు ఎన్ని ఇళ్లు? | ap government treats hyderabad house of chandra babu as his camp office | Sakshi
Sakshi News home page

చంద్రబాబు నాయుడుకు ఎన్ని ఇళ్లు?

Published Wed, May 31 2017 8:17 PM | Last Updated on Sat, Aug 18 2018 8:05 PM

చంద్రబాబు నాయుడుకు ఎన్ని ఇళ్లు? - Sakshi

చంద్రబాబు నాయుడుకు ఎన్ని ఇళ్లు?

 హైదరాబాద్‌ : ఎవరికైనా సాధారణంగా ఒకటి, లేదా రెండు నివాసాలు ఉంటాయి. అయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాత్రం ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు అధికారిక నివాసాలట. అవును చంద్రబాబుకు హైదరాబాద్‌తో పాటు విజయవాడలోని కరకట్ట, సొంత ఊరు నారావారి పల్లెలోనూ అధికారిక నివాసాలు ఉన్నాయి. ఎన్ని ఇళ్లున్నా ఇబ్బందేమీ లేదు కానీ.. అధికారంలో ఉన్నాం కదా అని ఆ ఇళ్ల నిర్వహణ కోసం ప్రజాధనాన్ని ఏదో జేబులో డబ్బులా మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు పెడుతున్నారు.

ఇప్పటికే నిబంధనల ప్రకారం విజయవాడలోని సీఎం అధికారిక నివాసానికి ప్రభుత్వ ఖర్చుతో భద్రత కల్పిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఇటీవలే నిర్మించిన చంద్రబాబు నివాసాన్ని ఏపీ ప్రభుత్వంలోని రహదారులు, భవనాల శాఖ ఆయన క్యాంప్‌ కార్యాలయంగా మార్చేస్తూ జీవో కూడా ఇచ్చేసింది. దాని ప్రకారం ఇంటికి తగిన భద్రత కల్పించడం, ఇంట్లో పనిచేసే వ్యక్తిగత సహాయకులు, ఇతరులు అందరి జీతాలు, అందులోని మొక్కల నిర్వహణ.. ఇలాంటి ఖర్చులన్నీ కూడా ప్రభుత్వ ఖాతాలోకే వెళ్లిపోతాయన్న మాట. చంద్రబాబు జూబ్లీహిల్స్ ఇంటికి రక్షణ కోసం అంటూ ఆర్అండ్ బి శాఖ జీవో 68 జారీ చేసింది.

చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లెలోని బాబు ఇంటికి కూడా ప్రభుత్వ ఖర్చుతోనే భద్రతతో పాటు లైటింగ్‌ ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఏడాదికి ఒకటి లేదా రెండుసార్లు అక్కడకు చంద్రబాబు కుటుంబసమేతంగా వెళతారు. అయినా ఆయన సొంత ఇంటి భద్రత కోసం ప్రభుత్వ ఖర్చుతో సోలార్ పవర్ ఫెన్స్, నెట్వర్క్ కమ్యూనికేషన్, సీసీటీవీల ఏర్పాటుకు రూ.36 లక్షలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జూరీ అయ్యాయి. గతంలోనూ రాష్ట్ర విభజన నేపథ్యంలో చంద్రబాబు లేక్వ్యూ గెస్ట్హౌస్తో పాటుగా ఏపీ సచివాలయాల మార్పులు, చేర్పులపై కోట్ల రూపాయిలు ఖర్చుచేశారు. తన అంత నిజాయితీపరుడు ప్రపంచంలోనే లేడని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు... ప్రజాధనాన్ని మాత్రం నీళ్లలా ఖర్చు చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

అంతకుముందు కూడా ఒకసారి తన ఇంటి నుంచి మంగళగిరి.. అంటే పది కిలోమీటర్ల దూరం వెళ్లడానికి ప్రత్యేకంగా ఒక హెలిప్యాడ్ ఏర్పాటు చేయించుకున్నారు. దానికి అయిన ఖర్చు అక్షరాలా రూ. 26.34 లక్షలు. అంటే ఒక కిలోమీటరుకు రూ. 2.6 లక్షలు ఖర్చు పెట్టారన్న మాట. అదీ ఘనత వహించిన ఏపీ ముఖ్యమంత్రి గారి విలాసకేళి.





Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement