
సీఎం హైదరాబాద్ ఇల్లు ఇక క్యాంపు ఆఫీసు
మరోవైపు రాజధాని అమరావతిలో ఉండవల్లి కరకట్ట అతిథిగృహం, విజయవాడలోని ఇరిగేషన్ కార్యాలయాన్ని క్యాంపు కార్యాలయాలుగా గుర్తించి.. నిధులు కేటాయించి అభివృద్ధి చేశారు. వారంక్రితం చిత్తూరు జిల్లా నారావారిపల్లెలోని సీఎం ఇంటిని సైతం క్యాంపు కార్యాలయంగా గుర్తించి రూ.36 లక్షల నిధులు కేటాయించడం విదితమే. హైదరాబాద్‌లో నిర్మించిన భవనానికి నిధులు కేటాయించడంలో ఆటంకాల్లేకుండా ఉండేందుకు క్యాంపు కార్యాలయంగా గుర్తించారని అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది.