
స్వామి వివేకానంద చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: స్వామి వివేకానంద జయంతి సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఆ మహనీయునికి ఘన నివాళులర్పించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేశారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు పాల్గొన్నారు.
వివేకానందుని మాటలు స్ఫూర్తిదాయకం..
యువతకు సీఎం వైఎస్ జగన్ యువజనోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘యువత దేశానికి వెన్నెముక, వారు సాధించలేనిది ఏదీ లేదు’ అన్న స్వామి వివేకానంద మాటలను స్ఫూర్తిగా తీసుకుని లక్ష్య సాధనలో అంకిత భావంతో మనమందరం ముందడుగులు వేయాలి. జాతీయ యువజనోత్సవం సందర్భంగా యువత అందరికీ శుభాకాంక్షలు’ అంటూ సీఎం గురువారం ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment