
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు పుష్పగుచ్ఛం అందిస్తున్న ఆలిండియా ష్రింప్ హ్యాచరీస్ అసోసియేషన్ ప్రతినిధులు
సాక్షి,అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని బుధవారం ఆలిండియా ష్రింప్ హ్యాచరీస్ అసోసియేషన్ ప్రతినిధులు కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వారు సీఎంతో భేటీ అయ్యారు. కాకినాడ వద్ద ఏర్పాటు కానున్న మేజర్ బల్క్ డ్రగ్ పార్క్ వల్ల మత్స్యసంపద, సముద్ర ఉత్పత్తుల ఉనికికి ప్రమాదం ఏర్పడకుండా ప్రత్యేక చొరవ తీసుకోవాలని, డ్రగ్ పార్క్ వ్యర్థ జలాల డిశ్చార్జ్ పాయింట్ దూరం పెంచాలని హ్యాచరీస్ అసోసియేషన్ ప్రతినిధులు ఈ సందర్భంగా సీఎంను కోరారు. దీంతో పాటు అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు సర్‌ప్లస్ పవర్‌ను హ్యాచరీస్‌కు ప్రత్యేక కేటగిరీ కింద ఇవ్వాలని కూడా వారు సీఎంకు విన్నవించారు.
ష్రింప్ హ్యచరీస్ అసోసియేషన్ సమస్యలపై సీఎం సానుకూలంగా స్పందించారు. సీఎంని కలిసిన వారిలో ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి దాడిశెట్టి రాజా, ఆలిండియా ష్రింప్ హ్యాచరీస్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి కొనకంటి మధుసూదన్‌రెడ్డి, కాకినాడ చాప్టర్ ప్రెసిడెంట్ సత్తి బులివీర్‌రెడ్డి, నేషనల్ బాడీ వైస్ ప్రెసిడెంట్ వి.సత్తిరెడ్డి, అడ్వైజర్ ప్రత్తిపాటి వీరభద్ర కుమార్, హ్యాచరీ ఓనర్స్ కనుమూరి ఆనంద వర్మ, ఎ.నగేష్ బాబు, బి.విజయ్‌కుమార్, సి.కోదండ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment