నీటిపారుదల శాఖ ప్రాంగణం సమర్పయామి! | Irrigation, samarpayami campus! | Sakshi
Sakshi News home page

నీటిపారుదల శాఖ ప్రాంగణం సమర్పయామి!

Published Tue, Oct 27 2015 12:49 AM | Last Updated on Sun, Sep 3 2017 11:31 AM

నీటిపారుదల శాఖ ప్రాంగణం  సమర్పయామి!

నీటిపారుదల శాఖ ప్రాంగణం సమర్పయామి!

మినీ సెక్రటేరియట్‌గా సీఎం క్యాంప్ ఆఫీస్!
‘ఇరిగేషన్’ ప్రాంగణాన్ని స్వాధీనం చేసుకుంటున్న
{పభుత్వం   డివిజన్, సబ్‌డివిజన్
కార్యాలయాలు ఇప్పటికే తరలింపు
తాజాగా ఎస్‌ఈ కార్యాలయం వంతు
ఆ కార్యాలయాన్నీఅప్పగించాలంటూ ఉత్తర్వులు

 
విజయవాడ : నగరానికి నడిబొడ్డులో ఉన్న నీటిపారుదల శాఖ ప్రాంగణం నుంచి ఆ శాఖకు చెందిన అన్ని విభాగాలనూ బయటికి తరలించారు. ఈ ప్రాంగణంలో నీటిపారుదల శాఖ ఎస్‌ఈ కార్యాలయంతో పాటు డివిజన్, సబ్ డివిజన్ కార్యాలయాలు ఉండేవి. నూతనంగా నిర్మించిన భవనాన్ని సీఎం క్యాంపు కార్యాలయంగా మార్చిన నేపథ్యంలో డివిజన్, సబ్ డివిజన్ కార్యాలయాలన్నింటినీ బయటకు తరలించిన విషయం విదితమే. తాజాగా ఎస్‌ఈ కార్యాలయం వంతు వచ్చింది. సిబ్బంది కోరిక మేరకు ఈ కార్యాలయాన్ని ఇప్పటివరకు ఈ ప్రాంగణంలోనే కొనసాగించారు. సీఎం క్యాంపు కార్యాలయానికి, ఎస్‌ఈ కార్యాలయానికి మధ్య పెద్ద గోడను నిర్మించారు. ఎస్‌ఈ కార్యాలయానికి దారిని సీఎం క్యాంపు కార్యాలయం ైవె పు మూసివేసి కోర్టుల పక్కన ఉన్న మార్గం నుంచి పంపుతున్నారు. గతంలో ఇదే ప్రాంగణంలో ఉన్న నీటిపారుదల శాఖ కేఈ డివిజన్, స్పెషల్ డివిజన్లను తొలగించి ఆ భవనాల్లో నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ కార్యాలయం ఏర్పాటు చేశారు. దీంతో ఇక ఎస్‌ఈ కార్యాలయాన్ని ఇక్కడ నుంచి తరలించరని అందరూ భావించారు. తాజాగా ఈ భవనాన్ని కూడా ప్రభుత్వానికి అప్పగించాలని జనరల్ అడినిస్ట్రేషన్ విభాగం ఉత్తర్వులు జారీ చేసింది.

 నగరం వెలుపలికి వెళ్లాల్సిందేనా...
 నీటిపారుదల ప్రాంగణంలో నుంచి బయటికి వచ్చిన కేసీ, కేఈ, స్పెషల్ డివిజన్లు, సబ్ డివిజన్ల కార్యాలయాలు సీఎం క్యాంపు ఆఫీసుకు సమీపంలో సూపరింటెండెంట్ కోసం నిర్మించిన నూతన క్వార్టర్స్‌లోకి మార్చారు. ఇప్పుడు సీఎం క్యాంపు కార్యాలయం పరిసర ప్రాంతాన్ని మినీ సెక్రటేరియట్‌గా మార్చాలని ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో ఈ క్వార్టర్లను కూడా తమకు అప్పగించాలని ప్రభుత్వ పెద్దలు నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. దీంతో ఈ శాఖలు నగరం వెలుపలకు తరలివెళ్లే పరిస్థితి ఏర్పడింది.
 
 నూతన భవనాల మాటేమిటి?
 గతంలో ఈ ప్రాంగణం నుంచి బయటికి తరలించిన కేఈ, కేసీ, స్పెషల్, పులిచింతల డివిజన్‌లను తిరిగి ప్రాంగణంలోకి తీసుకురావాలంటూ ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేయడంతో ఎస్‌ఈ కార్యాలయం వెనుక వైపు ఐదంతస్తుల నూతన భవనం నిర్మిస్తున్నారు. ఇందులో నీటిపారుదల శాఖ మంత్రి కార్యాలయం, ఉద్యోగులకు శిక్షణ తరగతులు, డివిజన్ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని భావించారు. ఇప్పుడు ఈ భవనాన్ని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement