ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్లపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఈ నెల 18న విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాంపు ఆఫీసు ముట్టడించిన అంగన్వాడీ వర్కర్లను ఉద్యోగాల నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్లపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఈ నెల 18న విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాంపు ఆఫీసు ముట్టడించిన అంగన్వాడీ వర్కర్లను ఉద్యోగాల నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు మెమో జారీ చేసింది. ఈ నెల 21న ఐసీడీఎస్ స్పెషల్ కమిషనర్ చక్రవర్తి మెమో జారీ చేశారు. వీడియోల ద్వారా అంగన్వాడీలను గుర్తించి ఉద్యోగాల నుంచి తొలగించాలని ఆదేశించారు.
జీతాలను పెంచాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో సీఎం క్యాంపు ఆఫీసు ముందు అంగన్వాడీలు ధర్నా చేసిన సంగతి తెలిసిందే. పోలీసులు అంగన్వాడీ వర్కర్లను చితకబాది ఈడ్చుకెళ్లడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ధర్నాలో పాల్గొన్న వారిని గుర్తించి ఉద్యోగాల నుంచి తొలగించాలని ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది.