
సాక్షి, అమరావతి: అంగన్‌వాడీ సంఘాలతో ఏపీ ప్రభుత్వం చర్చలు ముగిశాయి. 11 డిమాండ్లలో 10 డిమాండ్లు ఆమోదించామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గ్రాట్యూటీ అంశం మా పరిధిలో లేదని అంగన్‌వాడీలకు చెప్పామన్నారు.
‘‘వేతనం పెంపుపై కొంత సమయం అడిగాం. సమయం ఇస్తే సమస్య పరిష్కరిస్తాం. 15 రోజుల సమ్మెతో బాలింతలు ఇబ్బందులు పడుతున్నారు. జనవరి 3వ తేదీ తర్వాత బాలింతలకు జగనన్న కిట్లు అందించాలి. జగనన్న కిట్లు అందించేందుకు సహకరించాలని అంగన్‌వాడీలను కోరాం. సంక్రాంతి వరకూ సమ్మెను వాయిదా వేసుకోవాలని కోరుతున్నాం. సంక్రాంతి తర్వాత మరోమారు చర్చలు జరుపుతాం’’ అని మంత్రి బొత్స తెలిపారు.
‘‘అంగన్‌వాడీ సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉంది. సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తాం. మేం అంగన్‌వాడీలను బెదిరించడం లేదు.. రిక్వెస్ట్ చేస్తున్నాం’’ అని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: Fact Check: రైతుబజార్లపై ‘కుళ్లు’ కథ
Comments
Please login to add a commentAdd a comment