ఆ ప్లైఓవర్ పేరు మారింది!
బంజారాహిల్స్: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమాజిగూడ సీఎం క్యాంపు కార్యాలయం ఎదుట ఫ్లై ఓవర్‌కు రాత్రికి రాత్రి సెప్టెంబర్ 17 వంతెన పేరుతో బోర్డు ఏర్పాౖటెంది. సీఎం క్యాంపు కార్యాలయం ముందు, పంజాగుట్ట ఫ్లై ఓవర్ ముగిసే ప్రాంతంలో రెండు ప్రాంతాల్లో బోర్డులు కనిపించాయి. తెలంగాణ ప్రజల తీర్మానం పేరుతో నేటి నుంచి ఈ వంతెన పేరు 17 సెప్టెంబర్ ఫ్లై ఓవర్‌గా.. భారత సైన్యానికి ప్రజలు స్వాగతం పలికిన చౌరస్తా అంటూ భారతీయ జనతా పార్టీ పేరుతో బోర్డులు ఏర్పాటు చేశారు.