సాక్షి, చెన్నై: తమిళనాడులో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కుప్పకూలడంతో శిథిలాల కింద వందలాది మంది కార్మికులు చికుకున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి.
వివరాల ప్రకారం.. తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లాలో అంబూర్ బస్టాండ్ ఎదురుగా చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిపై నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ శనివారం అర్ధరాత్రి ఒక్కసారిగా కూలిపోయింది. ఈ క్రమంలో వందలాది మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఘటనా స్థలంలో రాత్రి నుంచి సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. రెస్య్కూ టీమ్ ఇప్పటి వరకు 22 మందిని కాపాడింది. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: రత్న భండార్‌లో రెండో సర్వే ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment