
సాకి, అమరావతి : ఇన్ని రోజులు ఎప్పుడెప్పుడా అని ఊరించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటుకు బుధవారం ఉత్తర్వులు విడుదలైన సంగతి తెలిసిందే. జనవరి 1 నుంచి అమరావతి కేంద్రంగా ఏపీ హైకోర్టు కార్యకలపాలు ప్రారంభించేలా ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో కోర్ట్ భవనాలు సిద్ధం కానందున సీఎం క్యాంప్ ఆఫీస్‌నే హైకోర్టు కార్యకలాపాలకు వాడేలా ప్రతిపాదించారు. ఒకవేళ క్యాంప్ ఆఫీస్‌లో కోర్ట్ నిర్వహణ సాధ్యం కాకపోతే కొద్దిరోజుల పాటు ఉమ్మడి హైకోర్ట్ భవనంలోనే ఏపీ హైకోర్టు ఉండేలా ప్రతిపాదనలు చేశారు.
ఈ మేరకు ప్రభుత్వం ప్రతిపాదనలను కోర్టు వర్గాలకు సూచించారు. అయితే అమరావతిలో నాలుగేళ్ల క్రితమే తాత్కలిక హైకోర్టు నిర్మణాన్ని ప్రారంభించారు. ఈ ఏడాది డిసెంబర్ 30 నాటికే తాత్కలిక భవనాన్ని పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణ ప్రకటించారు. జనవరి నుంచి కోర్టు నిర్వహణకు ఇబ్బంది లేదని కూడా గతంలో ప్రకటించారు. తీరా గడువు పూర్తయ్యేనాటికి ప్రభుత్వం హై కోర్టు నిర్మణాన్ని పూర్తి చేయ్యలేదు. ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు తాత్కాలిక హై కోర్టు భవన నిర్మణాన్ని నిర్లక్ష్యం చేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.