bifurcation of high court
-
హైకోర్టు విభజనకు వ్యతిరేకంగా న్యాయవాదుల ఆందోళన
సాక్షి, అమరావతి : ఉమ్మడి హై కోర్టును విభజిస్తూ కేంద్రం ప్రభుత్వం గెజిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. జనవరి 1 నుంచి రెండు రాష్ట్రాలకు వేర్వేరు హై కోర్టులు అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో హై కోర్టు విభజనకు వ్యతిరేకంగా ఆంధ్ర, రాయలసీమ లాయర్లు హైకోర్టులో ఆందోళన చేశారు. ఆంధ్రాలో హై కోర్టు ఏర్పాటు ఇంకా పూర్తి కాలేదని.. ఇప్పటికిప్పుడు ఎలా వెళ్లాలంటూ ప్రశ్నించారు. అంతేకాక జడ్జిలను బెంచ్ నుంచి దింపి కోర్టు నడవకుండా చేశారు. ఆంధ్రాలో కోర్టు సముదాయాలు ఇంకా సిద్ధం కాలేదని.. అలాంటప్పుడు ఎలా విభజిస్తారని ప్రశ్నించారు. అనంతరం ఆంధ్రా న్యాయవాదులు హై కోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిశారు. తగిన సమయం ఇవ్వకుండా కోర్టును విభజించడం వల్ల కేసుల విభజన, సిబ్బంది విభజన వంటి అంశాల్లో సమస్యలు తలెత్తుతాయని తెలిపారు. హై కోర్టు విభజనకు మరికొంత సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. హై కోర్టు విభజన తరువాత ప్రస్తుతం ఉన్న భవనాన్ని తెలంగాణకు కేటాయించగా.. ఏపీ హై కోర్టు భవన నిర్మాణం పూర్తి కావడానికి ఇంకా రెండు నెలల సమయం పడుతుందని సమాచారం. -
సీఎం క్యాంప్ ఆఫీస్‌లోనే హై కోర్టు కార్యకలపాలు
సాకి, అమరావతి : ఇన్ని రోజులు ఎప్పుడెప్పుడా అని ఊరించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటుకు బుధవారం ఉత్తర్వులు విడుదలైన సంగతి తెలిసిందే. జనవరి 1 నుంచి అమరావతి కేంద్రంగా ఏపీ హైకోర్టు కార్యకలపాలు ప్రారంభించేలా ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో కోర్ట్ భవనాలు సిద్ధం కానందున సీఎం క్యాంప్ ఆఫీస్‌నే హైకోర్టు కార్యకలాపాలకు వాడేలా ప్రతిపాదించారు. ఒకవేళ క్యాంప్ ఆఫీస్‌లో కోర్ట్ నిర్వహణ సాధ్యం కాకపోతే కొద్దిరోజుల పాటు ఉమ్మడి హైకోర్ట్ భవనంలోనే ఏపీ హైకోర్టు ఉండేలా ప్రతిపాదనలు చేశారు. ఈ మేరకు ప్రభుత్వం ప్రతిపాదనలను కోర్టు వర్గాలకు సూచించారు. అయితే అమరావతిలో నాలుగేళ్ల క్రితమే తాత్కలిక హైకోర్టు నిర్మణాన్ని ప్రారంభించారు. ఈ ఏడాది డిసెంబర్ 30 నాటికే తాత్కలిక భవనాన్ని పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణ ప్రకటించారు. జనవరి నుంచి కోర్టు నిర్వహణకు ఇబ్బంది లేదని కూడా గతంలో ప్రకటించారు. తీరా గడువు పూర్తయ్యేనాటికి ప్రభుత్వం హై కోర్టు నిర్మణాన్ని పూర్తి చేయ్యలేదు. ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు తాత్కాలిక హై కోర్టు భవన నిర్మణాన్ని నిర్లక్ష్యం చేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. -
ఇక ఎవరి హైకోర్టు వారిదే
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు విభజన ఎట్టకేలకు పూర్తయింది. గత నాలుగు రోజులుగా అదిగో.. ఇదిగో అంటున్న విభజన నోటిఫికేషన్ వెలువడింది. అమరావతిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటును నోటిఫై చేస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఆ వెంటనే కేంద్ర న్యాయశాఖ దానిని గెజిట్‌లో ప్రచురించింది. జనవరి 1, 2019 నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటవుతుందని రాష్ట్రపతి ఆ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని అధికరణ 214, సుప్రీంకోర్టు ఆదేశాలు, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్లు 30 (1)(ఏ), 31(1), 31(2) ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు హైకోర్టును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ఆప్షన్ ఇచ్చిన 16 మంది న్యాయమూర్తులు 2019 జనవరి 1 నుంచి ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా వ్యవహరి స్తారు. అలాగే తెలంగాణకు ఆప్షన్ ఇచ్చిన 10 మంది న్యాయమూర్తులు కూడా జనవరి 1, 2019 నుంచి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా చెలామణి అవుతారు. దీంతో ఉమ్మడి హైకోర్టు అంతర్థానమై రెండు తెలుగు రాష్ట్రాలకు వేర్వేరుగా హైకోర్టులు ఏర్పడినట్లైంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా వ్యవహరించేది వీరే. 1. జస్టిస్ రమేశ్ రంగనాథన్ (ప్రస్తుతం ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు.) 2. జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్ 3. జస్టిస్ సరస వెంకట నారాయణ బట్టి 4. జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి 5.జస్టిస్ దామా శేషాద్రి నాయుడు (బదిలీపై ప్రస్తుతం కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు) 5. జస్టిస్ మంథాట సీతారామమూర్తి 6.జస్టిస్ ఉప్మాక దుర్గా ప్రసాద్ రావు 7.జస్టిస్ తాళ్లూరి సునీల్ చౌదరి 8.జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి 9.జస్టిస్ గుడిసేవ శ్యాంప్రసాద్ 10.జస్టిస్ జవలాకర్ ఉమాదేవి 11.జస్టిస్ నక్కా బాలయోగి 12.జస్టిస్ తేలప్రోలు రజని 13.జస్టిస్ దూర్వాసుల వెంకట సుబ్రహ్మణ్య సూర్యనారాయణ సోమయాజులు 14.జస్టిస్ కొంగర విజయలక్ష్మి 15.జస్టిస్ మంతోజు గంగారావు. ఈ 16 మందిలో జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ శేషాద్రి నాయుడు వేరే హైకోర్టుల్లో న్యాయమూర్తులుగా కొనసాగుతున్నందున మిగిలిన 14 మందే జనవరి 1 నుంచి ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా విధులు నిర్వర్తిస్తారు. ఇక తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల విషయానికొస్తే.. 1. జస్టిస్ పులిగోరు వెంకట సంజయ్ కుమార్ 2. జస్టిస్ మామిడన్న సత్యరత్న శ్రీరామచంద్రరావు 3. జస్టిస్ అడవల్లి రాజశేఖర్ రెడ్డి 4. జస్టిస్ పొనుగోటి నవీన్ రావు 5. జస్టిస్ చల్లా కోదండరామ్ చౌదరి 6. జస్టిస్ బులుసు శివశంకర్ రావు 7. జస్టిస్ డాక్టర్ షమీమ్ అక్తర్ 8. జస్టిస్ పోట్లపల్లి కేశవరావు 9. జస్టిస్ అభినందన్ కుమార్ షావిలి 10. జస్టిస్ తొండుపునూరి అమర్నాథ్ గౌడ్ వ్యవహరిస్తారు. ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి తెలంగాణకు ఆప్షన్ ఇచ్చారు. ఆ ముగ్గురు ఎక్కడికి బదిలీ..? ఇక బయట రాష్ట్రాల నుంచి బదిలీపై ఇక్కడి వచ్చిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకష్ణన్, న్యాయమూర్తులు జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ వి.రామసుబ్రమణియన్ల బదిలీపై సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకోవాల్సింది. అది కూడా జనవరి 1 లోపు జరగాల్సి ఉంది. కొలీజియం నిర్ణయం ఆధారంగా కేంద్రం నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఒకవేళ జనవరి 1లోపు వీరి బదిలీపై నిర్ణయం తీసుకోని పక్షంలో లేదా బయట నుంచి ఎవరైనా సీనియర్ న్యాయమూర్తిగా ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలి. లేని పక్షంలో ప్రస్తుతం ఉన్న ఏపీ న్యాయమూర్తుల సీనియారిటీ జాబితా ప్రకారం జస్టిస్ ప్రవీణ్‌కుమార్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తారు. ఆ పరిస్థితి వస్తుందా? రాదా? అన్న విషయం రెండు మూడు రోజుల్లో తేలనుంది. పోరాడి సాధించుకున్నాం హైకోర్టు విభజనపై ఎంపీ వినోద్ సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి హైకోర్టు విభజనను టీఆర్ఎస్ ఎంపీ బి.వినోద్ కుమార్ స్వాగతించారు. హైకోర్టు విభజనపై సీఎం కేసీఆర్ పలుమార్లు ప్రధాని మోదీ, హోంమంత్రి, న్యాయశాఖ మంత్రిని కలసి విజ్ఞప్తి చేసిన సంగతిని, పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీలు హైకోర్టు విభజనపై కేంద్రాన్ని పలుమార్లు నిలదీసిన వైనాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. హైకోర్టు విభజనపై నోటిఫికేషన్ వెలువడిన అనంతరం ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణ హైకోర్టు ఏర్పాటు కాబోతుండటం సంతోషం. పోరాటం చేయడం ద్వారా ఏర్పాటుకు ఉన్న అవాంతరాలను అధిగమించాం. చాలాసార్లు వెల్‌లోకి వెళ్లి ఆందోళన చేయడంతోపాటుగా పార్లమెంటు ఆవరణలో ఆందోళనలు నిర్వహించాం. ఎట్టకేలకు నోటిఫికేషన్ వెలువడింది. ఇప్పుడే రాష్ట్ర సంపూర్ణ విభజన జరిగినట్టు భావిస్తున్నాం. కొన్నిశక్తులు ఉమ్మడి రాజధాని ఉన్నంతవరకు ఉమ్మడి హైకోర్టు ఉండేలా ప్రయత్నాలు చేయాలనుకున్నారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఉండటం ద్వారా తెలంగాణలో సత్వరన్యాయం అందుతుందని ఆశిస్తున్నాం..’అని పేర్కొన్నారు. ఇది శుభదినం: జితేందర్‌రెడ్డి సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ సాధించుకున్న రోజున సంతోషించినట్టుగానే హైకోర్టు విభజనపై నోటిఫికేషన్ వెలువడిన ఈరోజు కూడా అంతే సంతోషిస్తున్నామని టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత జితేందర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ‘అనేకసార్లు లోక్‌సభను స్తంభింపజేశాం. ఎంపీలందరం కలిసి పోరాడాం. కొత్త రాష్ట్రాలు ఏర్పడిన వెంటనే హైకోర్టులు ఏర్పడ్డా తెలంగాణ విషయంలో అలా జరగలేదు. ఎట్టకేలకు తెలంగాణ హైకోర్టు ఏర్పడుతుండటం హర్షణీయం. తెలంగాణ కోసం కేసీఆర్ చేసిన పోరాట స్ఫూర్తితోనే హైకోర్టు విభజనకు పోరాడాం. న్యాయమంత్రులుగా ఉన్న సదానంద గౌడ, ఆయన తర్వాత రవిశంకర్ ప్రసాద్‌లకు అనేకమార్లు విజ్ఞప్తి చేశాం. పార్లమెంటులో కొన్ని రోజులు మౌనంగా పోరాడాం. ..’అని వివరించారు. -
హైకోర్టు విభజన : ఏపీకి 16, తెలంగాణకు 10 మంది జడ్జీలు
సాక్షి, న్యూఢిల్లీ : ఉమ్మడి హైకోర్టు విభజనపై కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. అదేవిధంగా ఉమ్మడి హైకోర్టులో పనిచేస్తున్న న్యాయమూర్తులను రెండు రాష్ట్రాలకు కేటాయిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇందులో భాగంగా ఉమ్మడి హైకోర్టు నుంచి 16 మంది జడ్జిలను కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు, 10 మంది జడ్జిలను తెలంగాణ హైకోర్టుకు కేటాయించారు. ఆ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల హైకోర్టులు జనవరి 1 నుంచి విడివిడిగా పనిచేయనున్నాయి. ఏపీ హైకోర్టుకు కేటాయించిన జడ్జిలు 1. జస్టిస్ రమేశ్ రంగనాథన్ (ప్రస్తుతం ఉత్తరాఖండ్ చీఫ్ జస్టిస్‌గా ఉన్నారు) 2. జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్ 3. జస్టిస్ సరసా వెంకటనారాయణ భట్టి 4. జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి 5. జస్టిస్ దామ శేషాద్రినాయుడు 6. జస్టిస్ మాదాత సీతారామమూర్తి 7. జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు 8. జస్టిస్ తాళ్లూరు సునీల్ చౌదరి 9. జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి 10. జస్టిస్ గుడిసేవ శ్యాంప్రసాద్ 11. జస్టిస్ కుమారి జవలాకర్ ఉమాదేవి 12. జస్టిస్ నక్కా బాలయోగి 13. జస్టిస్ శ్రీమతి తేలప్రోలు రజిని 14. జస్టిస్ దుర్వాసుల వెంకట సుబ్రహ్మణ్య సూర్యనారాయణ సోమయాజులు 15. జస్టిస్ శ్రీమతి కొంగర విజయ లక్ష్మి 16. జస్టిస్ మాతోజ్ గంగారావు తెలంగాణకు కేటాయించిన జడ్జిలు 1. జస్టిస్ పులిగోరు వెంకట సంజయ్ కుమార్ 2. జస్టిస్ మామిడాల సత్యరత్న శ్రీరామచంద్రరావు 3. జస్టిస్ అడవల్లి రాజశేఖర్ రెడ్డి 4. జస్టిస్ పొనుగోటి నవీన్ రావు 5. జస్టిస్ చల్లా కోదండరాం చౌదరి 6. జస్టిస్ బులుసు శివ శంకర్రావు 7. జస్టిస్ డా. షమీమ్ అఖ్తర్ 8. జస్టిస్ పొట్లపల్లి కేశవ రావు 9. జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి 10. జస్టిస్ తోడుపునూరి అమర్నాథ్ గౌడ్ -
‘నిన్న ఈవీఎంలు అన్నారు.. నేడు చంద్రబాబు అంటున్నారు’
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని టీఆర్ఎస్ ఎంపీలు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణలోని పెండింగ్ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని టీఆర్ఎస్ ఎంపీలు మంగళవారం కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, రవిశంకర్ ప్రసాద్‌లను కలిసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి బుధవారం ఎంపీలు మీడియాతో మాట్లాడారు. నిజామాబాద్ ఎంపీ కవిత మాట్లాడుతూ.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ 16 స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఓటమికి ప్రతిపక్షాలు కుంటి సాకులు వెతుకుతున్నాయని విమర్శించారు. ఎన్నికల్లో ఓటమికి తొలుత ఈవీఎంల ట్యాంపరింగ్ అన్నారని.. ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబును నిందిస్తున్నారని వ్యాఖ్యానించారు. జాతీయ రాజకీయాల్లో తెలంగాణ తరఫున కీలక భూమిక పోషిస్తామని తెలిపారు. మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా కల్పించాలని గడ్కరీని కలిసి విజ్ఞప్తి చేశామన్నారు. తక్షణమే హైకోర్టును విభజించాలని మంత్రులకు చెప్పినట్టు తెలిపారు. తెలంగాణకు కేంద్రం ప్రత్యేకంగా నిధులు ఇవ్వలేదని పేర్కొన్నారు. సీతారామ ప్రాజెక్టు విషయంలో కేంద్రం జాప్యం చేస్తుందని మండిపడ్డారు. కేంద్రం తెలంగాణకు ప్రత్యేకంగా ఎటువంటి నిధులు ఇవ్వలేదని పేర్కొన్నారు. బీజేపీ కేవలం మాటల ప్రభుత్వం అని విమర్శించారు. కరీంనగర్ ఎంపీ వినోద్ మాట్లాడుతూ.. తెలంగాణలో టీఆర్ఎస్ను గెలిపించాలని ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారని అన్నారు. అసెంబ్లీ రద్దుకు తర్వాత కూటమి ఏర్పాటయిందని గుర్తుచేశారు. కూటమి కట్టకముందే కాంగ్రెస్ ఓడిపోయిందని ఎద్దేవా చేశారు. -
రంగారెడ్డి కోర్టుల వద్ద ఉద్రిక్తత
- ప్రత్యేక హైకోర్టు కోసం లాయర్ల ఆందోళన తీవ్రం - ఓ జడ్జిపై రాళ్లు, కోడిగుడ్లతో దాడికి యత్నం - కోర్టు హాల్లోకి ప్రవేశించి ఫర్నిచర్ ధ్వంసం - పోలీసులతో తోపులాట, పలువురిపై కేసులు నమోదు సాక్షి, హైదరాబాద్/రంగారెడ్డి జిల్లా కోర్టులు: తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు డిమాండ్‌తో రంగారెడ్డిజిల్లా కోర్టులు, నాంపల్లి క్రిమినల్ కోర్టుల న్యాయవాదులు కొద్ది రోజులుగా చేస్తున్న ఉద్యమం శుక్రవారం ఉద్రిక్తతకు దారితీసింది. ప్రత్యేక హైకోర్టు వచ్చే దాకా ఉమ్మడి పోస్టుల భర్తీని ఆపాలని సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ తిరస్కరణకు గురవడంతో న్యాయవాదులు నిరసనకు దిగారు. రంగారెడ్డిజిల్లా కోర్డుల ప్రధాన ద్వారం ముందు బైఠాయించి జడ్జీలతోపాటు కోర్టు సిబ్బంది, కక్షిదారులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా 2వ అదనపు సెషన్స్ జడ్జి గాంధీ.. కోర్టు లోపలికి వెళ్తుండగా వెనుక్కురావాలని న్యాయ వాదులు నినాదాలు చేశారు. సీమాంధ్ర జడ్జీలు గో బ్యాక్ అంటూ జడ్జిపై రాళ్లు, కోడిగుడ్లతో దాడికి ప్రయత్నించారు. దీంతో కోర్టు ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కోర్టు గేటు ముందు బైఠాయించిన న్యాయవాదులు ఎవరినీ లోపలికి వెళ్లనీయలేదు. దీంతో అప్పటికే అక్కడకు చేరుకున్న పోలీసులకు, లాయర్లకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలోనే కోర్టులోకి ప్రవేశించిన గాంధీ.. ఓ కేసు విచారణను చేపట్టారు. దీంతో కోపోద్రిక్తులైన లాయర్లు కోర్టు హాల్లోకి ప్రవేశించి అక్కడి పూలకుండీలను, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. జడ్జి టేబుల్‌పైనున్న కంప్యూటర్ను కూడా బద్దలుకొట్టారు. దీంతో జడ్జి గాంధీ వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈలోగా అక్కడకు భారీ సంఖ్యలో చేరుకున్న పోలీసులు.. లాయర్లను నిలువరించి దాదాపు 20 మందిని అరెస్ట్ చేసి తర్వాత వ్యక్తిగత పూచీపై వదిలేశారు. కోర్టులో విధ్వంసం సృష్టించిన పలువురిపై కేసులు నమోదు చేశారు. ప్రత్యేక హైకోర్టు ప్రజల ఆకాంక్ష: గద్దర్ ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు తెలంగాణ ప్రజల ఆకాంక్ష అని ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు. దాన్ని నిజం చేసేందుకు ప్రధాని, ఇరురాష్ట్రాల సీఎంలు కృషి చేయాలని సూచించారు. హైకోర్టు విభజన కోసం నాంపల్లి క్రిమినల్ కోర్టులో న్యాయవాదులు చేస్తున్న ఆందోళనకు ఆయన మద్దతు ప్రకటించారు. హైకోర్టు విభజన చేయకుండా జూనియర్ సివిల్ జడ్జీల (జేసీజే) నియామకాలు చేపడితే తెలంగాణకు మరోసారి అన్యాయం జరుగుతుందన్నారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించాలని సూచిం చారు. కాగా, జేసీజే నియామకాలు చేపట్టాలని సుప్రీం ఆదేశించిన నేపథ్యంలో శనివారం సమావేశమై భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తామని హైకోర్టు సాధన కమిటీ అధ్యక్షుడు సహోధర్‌రెడ్డి తెలిపారు.