
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పేదవాళ్లకు పెద్ద భరోసా.. సీఎం వైఎస్ జగన్ అని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఏదో ఒక పథకం కింద లబ్ధి పొందారని పేర్కొన్నారు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించి.. అందులోని హామీలను రెండేళ్లలోనే నెరవేర్చిన ఘనత సీఎం జగన్ సొంతమన్నారు. చెప్పినవే కాకుండా.. చెప్పనివి కూడా అమలు చేసి.. సీఎం జగన్ ప్రజలకు లబ్ధి చేకూర్చారని వివరించారు. కాగా, సీఎం జగన్‌కు వ్యతిరేకంగా ఇంత మంది కుట్రలు పన్నుతున్నారంటే.. ఆయన పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా కూడా సీఎం జగన్ సంక్షేమ పాలన అందిస్తున్నారని చెప్పారు.