సాక్షి, అమరావతి: స్వచ్ఛ అమృత్ మహోత్సవ్‌లో భాగంగా కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్– 2022లో ఆంధ్రప్రదేశ్‌కు వివిధ కేటగిరీల్లో 11 అవార్డులు వచ్చాయి. ఈ క్రమంలో అవార్డులు అందుకున్న కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపాలిటీల ఛైర్మన్లు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలను సీఎం వైఎస్ జగన్ అభినందించారు.
► గార్బెజ్ ఫ్రీ సిటీస్ అవార్టు కేటగిరీలో 5 స్టార్ రేటింగ్ అవార్డుతో పాటు, సఫాయి మిత్ర సురక్షిత్ షెహర్ కేటగిరీలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అవార్డు గెల్చుకుంది. ఈ సందర్భంగా మేయర్ డాక్టర్ ఆర్ శిరీష, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, తిరుపతి కమిషనర్ అనుపమ అంజలిని అభినందించారు సీఎం వైఎస్ జగన్.
► గార్బెజ్ ఫ్రీ సిటీస్ అవార్టు కేటగిరీలో 5 స్టార్ రేటింగ్ అవార్డుతో పాటు బిగ్ క్లీన్ సిటీ కేటగిరీలో విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ అవార్డు సాధించింది. డిప్యూటీ మేయర్లు జియ్యాని శ్రీధర్, సతీష్, కమిషనర్ రాజబాబు, అడిషనల్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ సన్యాసిరావు, జీవీఎంసీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శాస్త్రీలను సీఎం వైఎస్ జగన్ అభినందించారు.
► క్లీన్ స్టేట్ క్యాపిటల్ కేటగిరీలో విజయవాడ అవార్డు గెల్చుకుంది. ఈ క్రమంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్, అడిషనల్ కమిషనర్ కె వి సత్యవతిలను అభినందించారు సీఎం వైఎస్ జగన్.
► 50 వేల నుంచి 1 లక్ష లోపు జనాభా ఉన్న మున్సిపాలిటీలకు సంబంధించి ఇన్నోవేషన్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ కేటగిరీలో పులివెందుల మున్సిపాలిటీకి అవార్డు వచ్చింది. అవార్డు అందుకున్న పులివెందులు మున్సిపాలిటీ ఛైర్మన్ వి వరప్రసాద్, వైస్ ఛైర్మన్‌లు వైయస్.మనోహర్‌రెడ్డి, హఫీజుల్లా, కమిషనర్ వి వి నరసింహారెడ్డిలను అభినందించారు సీఎం వైఎస్.జగన్.
► 50 వేల నుంచి 1 లక్ష లోపు జనాభా ఉన్న మున్సిపాల్టీలకు సంబంధించి సిటిజన్ ఫీడ్ బ్యాక్ కేటగిరీలో పుంగనూరు మున్సిపాలిటీ అవార్డు గెల్చుకుంది. ఈ సందర్భంగా ఛైర్మన్ అలీమ్ భాషా, కమిషనర్ నరసింహ ప్రసాద్‌లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రశంసించారు.
► ఇండియన్ స్వచ్ఛతా లీగ్ కేటగిరీలో(15వేలలోపు జనాభా) స్పెషల్ మెన్షన్ అవార్డు సాధించిన పొదిలి మున్సిపల్ కమిషనర్ కె డేనియల్ జోసఫ్, మున్సిపల్ మేనేజర్ ఎస్ వి శ్రీకాంత్‌రెడ్డిలను అభినందించారు సీఎం వైఎస్ జగన్.
► ఇండియన్ స్వచ్ఛతా లీగ్ కేటగిరీ(లక్ష నుంచి 3 లక్షలలోపు జనాభా)లో స్పెషల్ మెన్షన్ అవార్డు సాధించిన శ్రీకాకుళం కార్పొరేషన్ కమిషనర్ చల్లా ఓబులేశు, మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ జి వెంకటరావులను అభినందించారు సీఎం వైఎస్ జగన్.
► 25 వేల నుంచి 50 వేలులోపు జనాభా ఉన్న మున్సిపాలిటీలకు సంబంధించి ఇన్నోవేషన్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ కేటగిరీలో సాలూరు మున్సిపాలిటీకి అవార్డు లభించింది. ఈ సందర్భంగా ఛైర్‌పర్సన్ పువ్వుల ఈశ్వరమ్మ, కమిషనర్ హనుమంతు శంకరరావులను అభినందించారు సీఎం వైయస్.జగన్.
కార్యక్రమంలో పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ప్రవీణ్‌కుమార్, ఏపీయూఎఫ్‌ఐడీసీ ఎండీ లక్ష్మీషా, స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఎండీ డాక్టర్ పి సంపత్ కుమార్, స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ పి దేవసేన, స్వచ్చాంధ్ర కార్పొరేషన్ సీఓఓ కిరణ్ కుమార్, టీం లీడర్ పాతూరు సునందలు పాల్గొన్నారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
ఇదీ చదవండి: సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన 2021 బ్యాచ్ ఐఏఎస్ ప్రొబేషనర్స్
Comments
Please login to add a commentAdd a comment