Corporation Chairmen
-
TS: పలు కార్పొరేషన్ ఛైర్మన్ల నియామకాలు రద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పలు కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలను రద్దు చేస్తూ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. మొత్తం 54 కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలు రద్దు చేస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబరు 7న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరగా, తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో నియమితులైన ప్రభుత్వ సలహాదారుల నియామకాలను కూడా రద్దు చేసిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వంలో ఏడుగురు అధికారులను సలహా దారులుగా నియమించగా, నియమితులైన సోమేశ్‌కుమార్, చెన్నమనేని రమేష్, రాజీవ్ శర్మ, అనురాగ్ శర్మ, ఏకే ఖాన్, జీఆర్ రెడ్డి, ఆర్.శోభ నియామకాలను ప్రభుత్వం రద్దు చేసింది. -
కార్పొరేషన్ చైర్మన్ల బాధ్యతల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్లుగా నియమితులైన వేణుగోపాలచారి, ఈడిగ ఆంజనేయగౌడ్ గురువారం జరిగిన వేర్వేరు కార్యక్రమాల్లో బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ (టీఎస్ఐడీసీ) చైర్మన్‌గా వేణుగోపాలచారి బంజారాహిల్స్‌లోని ఐడీసీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, నేతలు హాజరై వేణుగోపాలచారికి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్‌గా రాష్ట్ర సాధన ఉద్యమంలో విద్యార్థి నేతగా క్రియాశీలకంగా పనిచేసిన ఈడిగ ఆంజనేయగౌడ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఎల్బీ స్టేడియంలోని స్పోర్ట్స్ అథారిటీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి మంత్రులు వి.శ్రీనివాస్‌గౌడ్, తలసాని, ఎమ్మెల్సీ కవిత హాజరై శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌తో కలిసి నడిచిన ఉద్యమకారులకు ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కల్పించారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రతీ నియోజకవర్గంలో స్టేడియం నిర్మాణంతో పాటు అంతర్జాతీయ క్రీడాకారులను తయారుచేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందన్నారు. -
స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు గ్రహీతలకు సీఎం వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి: స్వచ్ఛ అమృత్ మహోత్సవ్‌లో భాగంగా కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్– 2022లో ఆంధ్రప్రదేశ్‌కు వివిధ కేటగిరీల్లో 11 అవార్డులు వచ్చాయి. ఈ క్రమంలో అవార్డులు అందుకున్న కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపాలిటీల ఛైర్మన్లు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలను సీఎం వైఎస్ జగన్ అభినందించారు. ► గార్బెజ్ ఫ్రీ సిటీస్ అవార్టు కేటగిరీలో 5 స్టార్ రేటింగ్ అవార్డుతో పాటు, సఫాయి మిత్ర సురక్షిత్ షెహర్ కేటగిరీలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అవార్డు గెల్చుకుంది. ఈ సందర్భంగా మేయర్ డాక్టర్ ఆర్ శిరీష, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, తిరుపతి కమిషనర్ అనుపమ అంజలిని అభినందించారు సీఎం వైఎస్ జగన్. ► గార్బెజ్ ఫ్రీ సిటీస్ అవార్టు కేటగిరీలో 5 స్టార్ రేటింగ్ అవార్డుతో పాటు బిగ్ క్లీన్ సిటీ కేటగిరీలో విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ అవార్డు సాధించింది. డిప్యూటీ మేయర్లు జియ్యాని శ్రీధర్, సతీష్, కమిషనర్ రాజబాబు, అడిషనల్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ సన్యాసిరావు, జీవీఎంసీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శాస్త్రీలను సీఎం వైఎస్ జగన్ అభినందించారు. ► క్లీన్ స్టేట్ క్యాపిటల్ కేటగిరీలో విజయవాడ అవార్డు గెల్చుకుంది. ఈ క్రమంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్, అడిషనల్ కమిషనర్ కె వి సత్యవతిలను అభినందించారు సీఎం వైఎస్ జగన్. ► 50 వేల నుంచి 1 లక్ష లోపు జనాభా ఉన్న మున్సిపాలిటీలకు సంబంధించి ఇన్నోవేషన్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ కేటగిరీలో పులివెందుల మున్సిపాలిటీకి అవార్డు వచ్చింది. అవార్డు అందుకున్న పులివెందులు మున్సిపాలిటీ ఛైర్మన్ వి వరప్రసాద్, వైస్ ఛైర్మన్లు వైయస్.మనోహర్‌రెడ్డి, హఫీజుల్లా, కమిషనర్ వి వి నరసింహారెడ్డిలను అభినందించారు సీఎం వైఎస్.జగన్. ► 50 వేల నుంచి 1 లక్ష లోపు జనాభా ఉన్న మున్సిపాల్టీలకు సంబంధించి సిటిజన్ ఫీడ్ బ్యాక్ కేటగిరీలో పుంగనూరు మున్సిపాలిటీ అవార్డు గెల్చుకుంది. ఈ సందర్భంగా ఛైర్మన్ అలీమ్ భాషా, కమిషనర్ నరసింహ ప్రసాద్‌లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రశంసించారు. ► ఇండియన్ స్వచ్ఛతా లీగ్ కేటగిరీలో(15వేలలోపు జనాభా) స్పెషల్ మెన్షన్ అవార్డు సాధించిన పొదిలి మున్సిపల్ కమిషనర్ కె డేనియల్ జోసఫ్, మున్సిపల్ మేనేజర్ ఎస్ వి శ్రీకాంత్‌రెడ్డిలను అభినందించారు సీఎం వైఎస్ జగన్. ► ఇండియన్ స్వచ్ఛతా లీగ్ కేటగిరీ(లక్ష నుంచి 3 లక్షలలోపు జనాభా)లో స్పెషల్ మెన్షన్ అవార్డు సాధించిన శ్రీకాకుళం కార్పొరేషన్ కమిషనర్ చల్లా ఓబులేశు, మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ జి వెంకటరావులను అభినందించారు సీఎం వైఎస్ జగన్. ► 25 వేల నుంచి 50 వేలులోపు జనాభా ఉన్న మున్సిపాలిటీలకు సంబంధించి ఇన్నోవేషన్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ కేటగిరీలో సాలూరు మున్సిపాలిటీకి అవార్డు లభించింది. ఈ సందర్భంగా ఛైర్పర్సన్ పువ్వుల ఈశ్వరమ్మ, కమిషనర్ హనుమంతు శంకరరావులను అభినందించారు సీఎం వైయస్.జగన్. కార్యక్రమంలో పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ప్రవీణ్‌కుమార్, ఏపీయూఎఫ్ఐడీసీ ఎండీ లక్ష్మీషా, స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఎండీ డాక్టర్ పి సంపత్ కుమార్, స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఛైర్పర్సన్ పి దేవసేన, స్వచ్చాంధ్ర కార్పొరేషన్ సీఓఓ కిరణ్ కుమార్, టీం లీడర్ పాతూరు సునందలు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఇదీ చదవండి: సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన 2021 బ్యాచ్ ఐఏఎస్ ప్రొబేషనర్స్ -
ప్రోటోకాల్ సమస్య లేకుండా రాజీనామాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నామినేటెడ్ పదవుల్లో ఉన్న పలువురు టీఆర్ఎస్ అభ్యర్థులు మంగళవారం తమ పదవులకు రాజీనామా చేశారు. టీఆర్ఎస్ తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తున్న పిడమర్తి రవి, ప్రశాంత్ రెడ్డి, సోమారపు సత్యనారాయణ తమ కార్పొరేషన్ పదవులకు రాజీనామా చేశారు. ఎన్నికల ప్రచారంలో ప్రోటోకాల్ సమస్య ఎదురుకాకుండా వీరు రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. వీరి రాజీనామాలను ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదించారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా పిడమర్తి రవి ఉండగా.. మిషన్ భగీరథ కార్పొరేషన్ చైర్మన్ పదవిలో బాల్కొండ తాజా మాజీ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్‌గా సోమారపు సత్యనారాయణ కొనసాగిన విషయం తెలిసిందే. నామినేటెడ్ పదవుల్లో ఉంటూ ఎన్నికల్లో పోటీ చేస్తుండటం వల్ల ప్రోటోకాల్ సమస్యలు తలెత్తుతాయన్న భావంతో సీఎం కేసీఆర్ సూచన మేరకు వీరు పదవుల నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. -
8 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని ఎనిమిది కార్పొరేషన్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం చైర్మన్లను నియమించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డిని, ఉమెన్ కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్ పర్సన్ గా మాజీ ఎంపి గుండు సుధారాణి (వరంగల్ జిల్లా), హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా మడుపు భూంరెడ్డి (మెదక్ జిల్లా), గిరిజన కో-ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ గా గాంధీ నాయక్ (వరంగల్ జిల్లా), ఫిల్మ్, టివి అండ్ థియేటర్ డెవలప్మెంట్ చైర్మన్ గా పుష్కర్ రామ్మోహన్ రావు(ఆదిలాబాద్ – మందమర్రి), వికలాంగుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా కె.వాసుదేవ రెడ్డి (కేయూ విద్యార్థి నాయకుడు), మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాథోడ్ (గోషామహల్), టెక్నికల్ సర్వీసెస్ కార్పొరేషన్ చైర్మన్ గా డాక్టర్ చిరుమిల్ల రాకేశ్ కుమార్ (ఓయూ విద్యార్థి నాయకుడు –పెద్దపల్లి)ను నియమించారు. అలాగే, టీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలిగా మాజీ ఎంపి గుండు సుధారాణి(వరంగల్ జిల్లా)ను, తెలంగాణ రాష్ట్ర విద్యార్థి సమితి అధ్యక్షుడిగా ఓయు విద్యార్థి నాయకుడు గెల్లు శ్రీనివాసయాదవ్ (కరీంనగర్ జిల్లా), మెదక్ డిసిసిబి మాజీ అధ్యక్షుడు ఎలక్షన్ రెడ్డి పేరును కూడా కార్పొరేషన్ చైర్మన్ పదవికి ఖరారు చేశారు. ప్రస్తుతం ఎలక్షన్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్నందున, తిరిగి హైదరాబాద్ రాగానే చర్చించి ఏ కార్పొరేషన్ బాధ్యతలు అప్పగించాలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయిస్తారు. -
ప్రజాస్వామ్యం ఖూనీ
* మున్సిపల్, మండల, జిల్లా పరిషత్ చైర్మన్ల ఎన్నికల్లో అధికార పార్టీ దురాగతాలు * సీట్లు గెలుచుకోవడానికి దౌర్జన్యాలు, బెదిరింపులు, అక్రమాలు * ప్రజా తీర్పును అపహాస్యం చేసిన ప్రభుత్వం * కుట్రలు కుతంత్రాలతో ప్రతిపక్షం గొంతు నొక్కిన అధికార పక్షం * 15 మున్సిపాలిటీలను అప్రజాస్వామిక, అక్రమంగా గెలుచుకున్న టీడీపీ సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ అధికార తెలుగుదేశం పార్టీ బరితెగించింది. గురు, శుక్ర, శనివారాల్లో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల ఛైర్మన్లు, మండల, జిల్లా పరిషత్ అధ్యక్షుల ఎన్నికలే దీనికి నిదర్శనం. గత మూడురోజులుగా చంద్రబాబునాయుడు ప్రతిక్షణం ఈ ఎన్నికలపైనే దృష్టి సారించి అటు పార్టీ నేతలకు, ఇటు అధికారులకు ఆదేశాలు ఇస్తూ వచ్చారు. జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలందరినీ మోహరించి మరీ స్థానిక స్థానాలను కైవసం చేసుకొనే ప్రయత్నాలు చేయించారు. చివరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారులైన కలెక్టర్లపై కూడా ఎమ్మెల్యేలు దాడులకు దిగారంటే పరిస్థితిని ఎంతలా దిగజార్చారో స్పష్టమవుతోంది. టీడీపీ నేతలు సహకరించకపోవడం వల్ల తాను జడ్పీ ఛైర్మన్ ఎన్నికను వాయిదా వేయాల్సి వచ్చిందని నెల్లూరు కలెక్టర్ పేర్కొన్నారు. ఇదే పరిస్థితి ప్రకాశం జిల్లాలోనూ ఏర్పడింది. కర్నూలు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలను బలవంతంగా బయటకు పంపి అధికారు లు టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారు. రెండురోజులుగా జమ్మలమడుగు మున్సిపల్ ఛైర్మన్ స్థానికి ఎన్నిక జరగ నివ్వకండా అధికారపార్టీ నేతలు భయానక వాతావరణాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. వైఎస్సార్ కాంగ్రెస్‌ను అడ్డుకోవడమే లక్ష్యం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో వేళ్లూనుకోకుండా చేయడానికి అధికార తెలుగుదేశం కుట్రలకు తెరలేపింది. పార్టీ ఆవిర్భవించి ఎంతోకాలం కాకపోయినా, క్షేత్రస్థాయిలో సరైన పార్టీ నిర్మాణం లేకపోయినా స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల ను వైఎస్సార్సీపీ అనేక సీట్లు గెలుచుకునే పరిస్థితిని అధికార పార్టీ జీర్ణించుకోలేకపోయింది. మున్సిపల్, ఎంపీపీ, జడ్పీటీసీ ఎన్నికల్లో మెజార్టీ ఉన్న స్థానాలను ఆపార్టీ దక్కించుకుంటే క్షేత్రస్థాయిలో మరింతగా వేళ్లూనుకుంటుందని తెలుగు తమ్ముళ్లు భయపడ్డారు. దీంతో మెజార్టీ ఉన్న ప్రాంతాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులను బెది రించి, ప్రలోభాలు పెట్టి, చివరకు దాడులకు పురి కొల్పి టీడీపీ కైవసమయ్యేలా చేశారు. దాదాపు 15కు పైగా మున్సిపాల్టీలను, వందకు పైగా మండల పరిషత్తులను అక్రమంగా టీడీపీ తన ఖాతాలో వేసుకున్నారు. ముఖ్యమంత్రి అధికార దుర్వినియోగంతో ప్రతిపక్ష గొంతు నొక్కినా ప్రజల గొంతు నొక్కలేరని, ప్రజాస్వామ్య పరిరక్షణకు యుద్ధం చేస్తామని వైఎస్సార్సీపీ నేతలు చెప్పారు. రాష్ట్రంలో మొత్తం ఎంపీటీసీ స్థానాలు 10,092 ఉండగా, అందులో వైఎస్సార్సీపీ 4,199 మంది, టీడీపీ 5,216 మంది, కాంగ్రెస్ 172 మంది, సీపీఐ 14మంది, సీపీఎం 24మంది, బీజేపీ 13 మంది, ఇతరులు 15మంది, ఇండిపెండెంట్లు 428 మంది గెలిచారు. ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల్లో మెజార్టీ స్థానాలు వైఎస్సార్సీపీకి దక్కాయి. చిత్తూరు, గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో టీడీపీకి ఆధిక్యమున్నా వైఎస్సార్సీపీ పోటాపోటీగా నిలిచింది. అయితే వైఎస్సార్సీపీకి మెజార్టీ ఉన్న మండలాలను టీడీపీ కబ్జాచేసింది. మున్సిపాల్టీల్లోనూ ఇదే అరాచకానికి తెగబడింది. రాష్ట్రంలో 92 మున్సిపాల్టీల్లో ఎన్నికలు జరగ్గా 36 మున్సిపాల్టీల్లో వైఎస్సార్సీపీకి స్పష్టమైన ఆధిక్యత ఉంది. తక్కిన స్థానాల్లో టీడీపీకి మెజార్టీ ఉంది. కానీ వైఎస్సార్సీపీకి కేవలం 15 మున్సిపాల్టీలే వచ్చాయి. ఆపార్టీకి దక్కాల్సిన 20కి పైగా మున్సిపాల్టీలను టీడీపీ అడ్డదారుల్లో చేజిక్కించుకుంది. జెడ్పీ ఎన్నికల్లో.. రాష్ట్రంలో జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గా లు 653. ఇందులో 275 స్థానాలను వైఎస్సార్సీపీ గెలుచుకోగా 373 స్థానాలను టీడీపీ దక్కిం చుకుంది. ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్, కర్నూ లు జిల్లాల్లో వైఎస్సార్సీపీకి ఆధిక్యముంది. తక్కిన జిల్లాల్లో టీడీపీకి ఆధిక్యముంది. ఆయా జడ్పీల్లో ఆధిక్యాన్ని అనుసరించి ఛైర్మన్ స్థానాలు ఆయా పార్టీలకు దక్కాలి. వైసీపీ ఆధిక్యమున్న చోట టీడీపీ నేతలు అరాచకం సృష్టించారు. -
ఏపిలో కార్పోరేషన్, మునిసిపాలిటీల విజేతలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో 7 కార్పొరేషన్లు, 92 మున్సిపాలిటీల చైర్మన్ స్థానాలకు ఈ రోజు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు తెలిసిన సమాచారం ప్రకారం టిడిపి, వైఎస్ఆర్ సిపి ఎక్కువ చైర్మన్ స్థానాలను గెలుచుకున్నాయి. విజేతల వివరాలు ఈ దిగువ ఇస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా : ఇచ్చాపురం - రాజ్యలక్ష్మీ - వైఎస్ఆర్ సీపీ అమదాలవలస - గీత - టీడీపీ పలాస - పూర్ణచంద్రరావు - టీడీపీ పాలకొండ - పి. విజయనిర్మల - టీడీపీ విజయనగరం జిల్లా: సాలూరు : విజయకుమారి - టీడీపీ బొబ్బిలి - అచ్యుతవల్లి - టీడీపీ తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రి మేయర్ - రజనీ శేషసాయి - టిడిపి - డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి అమలాపురం మునిసిపాలిటీ - ఏళ్ల మల్లేశ్వరరావు తుని - దినకంటి సత్యనారాయణ మండపేట - చొండ్రు శ్రీహరి ప్రసాద్ పెద్దాపురం - రాజ సూరిబాబు రాజు - టిడిపి సామర్లకోట - ఎన్ చందర్ రావు - టిడిపి పిఠాపురం - కరణం తిమ్మారావు - టీడీపీ ఏలేశ్వరం - కొప్పాడ పార్వతీ గొల్లప్రోలు-పెడం మాణిక్యం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మేయర్ ఏకగ్రీవం - షేక్ నూర్జహాన్ - డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ - శివలక్ష్మి - టిడిపి - వైఎస్ చైర్మన్ అట్లూరి రామ్మోహన్రావు కొవ్వూరు మున్సిపల్ ఛైర్మన్ - డి.సూర్యభాస్కరరామ్మోహనరావు టీడీపీ - వైఎస్ ఛైర్మన్‌గా డి.రాజారమేష్ టీడీపీ కృష్ణా జిల్లా విజయవాడ మేయర్ - కోనేరు శ్రీధర్ - టిడిపి - డిప్యూటీ మేయర్ గోగుల రమణ నూజివీడు మున్సిపాలిటీ - బసవ రేవతి - వైఎస్ఆర్ సిపి - వైస్ చైర్ పర్సన్ అన్నె మమత జగ్గయ్యపేట - తన్నీరు నాగేశ్వరరావు -వైఎస్ఆర్ సిపి గుడివాడ - వైఎస్ఆర్ సీపీ నందిగామ - ఎ. పద్మావతి - టీడీపీ తిరువూరు - ఎం.కృష్ణకుమారి - టీడీపీ ఉయ్యూరు - టీడీపీ మచిలీపట్నం - టీడీపీ పెడన - టీడీపీ గుంటూరు జిల్లా: తెనాలి - కొత్తమాసు తులసీదాసు - టీడీపీ బాపట్ల -తోట మల్లీశ్వరీ -టీడీపీ రేపల్లె - తాడివాక శ్రీనివాసరావు -టీడీపీ చిలకలూరిపేట - గంజి చెంచుకుమారి -టీడీపీ పొన్నూరు - సజ్జా హేమలత - టీడీపీ మంగళగిరి - గంజి చిరంజీవి - టీడీపీ మాచర్ల - గోపవరపు శ్రీదేవి - టీడీపీ సత్తెనపల్లి - ఎల్లినీడి రామస్వామి - టీడీపీ వినుకొండ - జాన్ బి- పిడుగురాళ్ల - బి.హైమవతి -టీడీపీ తాడేపల్లి - కె.మహాలక్ష్మి -వైఎస్ఆర్ సీపీ నెల్లూరు జిల్లా: నెల్లూరు కార్పొరేషన్ మేయర్ - అబ్దుల్ అజీజ్ - వైఎస్ఆర్సీపీ కావలి - అలేఖ్య - టిడిపి నాయుడు పేట - ఎం.శోభారాణి - టీడీపీ వైఎస్ఆర్ జిల్లా: కడప మేయర్ - కె.సురేష్‌బాబు - వైఎస్ఆర్ సిపి పులివెందుల మున్సిపాలిటీ - వైఎస్ ప్రమీలమ్మ - వైఎస్ఆర్ సిపి ఎర్రగుంట్ల మున్సిపాలిటీ - ముసలయ్య -వైఎస్ఆర్ సిపి రాయచోటి - నసీబూన్ఖానం -వైఎస్ఆర్ సిపి చిత్తూరు జిల్లా: చిత్తూరు మేయర్ - అనురాధ - టిడిపి శ్రీకాళహస్తి మున్సిపాలిటీ - రాధారెడ్డి -టిడిపి పుంగనూరు - షమీమ్ - వైఎస్ఆర్ సిపి నగరి - కెజె శాంతి - వైఎస్ఆర్ సిపి గూడూరు - టీడీపీ పలమనేరు - శారద కుమారి - వైఎస్ఆర్ సిపి పుత్తూరు - కరుణాకరణ్ - టిడిపి అనంతపురం జిల్లా: హిందూపురం - లక్ష్మి - టీడీపీ గుంతకల్ - అపర్ణ - టీడీపీ తాడిపత్రి - వెంకట లక్ష్మి- టీడీపీ ధర్మవరం - గోపాల్ - టీడీపీ గుత్తి - తులసమ్మ - టీడీపీ మడకశిర - ప్రకాశ్ - టీడీపీ కల్యాణదుర్గం - రమేష్ - టీడీపీ పుట్టపర్తి - గంగన్న - టీడీపీ రాయదుర్గం - రాజశేఖర్ - టీడీపీ పామిడి - గౌస్ పీరా- టీడీపీ కర్నూలు జిల్లా: నందికొట్కూరు - కురువ సుబ్బమ్మ - వైఎస్ఆర్ సిపి, వైఎస్ ఛైర్మన్‌గా మునాఫ్ నంద్యాల - చైర్ పర్సన్ సులోచన - టిడిపి - వైస్ చైర్మన్ గంగిరెడ్డి ఆదోని - కురువ సరోజమ్మ - వైఎస్ఆర్ సిపి - వైస్ చైర్మన్ మహమూద్ ఎమ్మిగనూరు - సాయి సరస్వతీ - టిడిపి - వైస్ చైర్మన్ కొండయ్య చౌదరి ఆళ్లగడ్డ - ఉషారాణి - వైఎస్ఆర్ సిపి - వైస్ చైర్మన్ రామలింగారెడ్డి గూడూరు- ఇందిర సుభాషిణి - టీడీపీ డోన్ - గాయత్రి - టీడీపీ ఆత్మకూరు - నూర్ అహ్మద్ - టీడీపీ ప్రకాశం జిల్లా: గిద్దలూరు : వెంకట సుబ్బమ్మ - వైఎస్ఆర్ సీపీ కనిగిరి : చిన్నమస్తాన్ - టీడీపీ అద్దంకి - దయామణి - టీడీపీ చీరాల - ఎం.రమేశ్ -టీడీపీ మార్కాపురం ఎన్నిక రేపటికి వాయిదా